ఆంధ్రప్రదేశ్‌

తీరం దాటిన తిత్లీ: 8 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలంలో తుపాను తీరాన్ని దాటింది. తుపాను తీరం దాటిన ప్రాంతాల్లో విస్తత్రంగా వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావం వల్ల గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. విజయనగరం జిల్లా ముక్కాం గ్రామం వద్ద సముద్రం 150 అడుగుల దూరం వచ్చింది. తుపాను ధాటికి 8 మంది మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో సముద్రంలో వేటకు వెళ్లి ఆరుగురు చనిపోగా, ఇల్లు కూలి ఒకరు, చెట్టు కూలి మరొకరు మృతి చెందారు.
శ్రీకాకుళం జిల్లా ఓని అగ్రహారంలో చెట్టు విరిగిపడి నరసమ్మ (62), సరబుజ్జలి మండలంలో సూర్యారావు(55) అనే కూలీ చనిపోయారు. తిత్లీ తుపాను తీరం దాటటంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.