తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ఇంధనమై కదిలించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్తమానం ఎప్పుడూ కలచివేసే అంశం
ఇవ్వాళటి వర్తమానం మరింత కలచివేతకి హేతువు అవుతోంది.
ఎందుకంటే-
గతంతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా వర్తమానం ముదురుతోంది
ఈరోజు సంస్కృతి గతంతో ఎడబాసి కులుకుతున్నది
నాగరికతకి గతం ఒక పురాచరిత్ర
సాహిత్యానికి సంప్రదాయం వూపిరి అందడం లేదు. ప్రజాసాహిత్య సంప్రదాయం కూడ పుటుక్కున తెగిపోతోంది.
వ్యాపారీకరణలో వీటిని ఎదుర్కోవలసి వస్తున్నది.
ఆధునిక సంతల్లో సరకుగా మారి మెరుస్తున్నది.
‘దేశీయత’2 సాంప్రదాయిక భావనకి, ఆధునికతకి, అత్యాధునికతకి నవ్వులాటగా మారింది.
విపణి విలువల రేటు ట్యాగులలో దానిని వెతుక్కోవలసి రావడం విషాదం.
ఒక కొత్త చట్రం బిగుసుకుపోతోంది. నవ్యత స్థానంలో యాంత్రికత. నవీనత అంటే రొడ్డకొట్టుడు.
ఎట్టకేలకు 3సృజన2శక్తి అన్ని రంగాల్లో చతికిల పడింది. ఏ ఒక్క రంగం కూడా దృఢంగా మనడం లేదు. అంతటా అనారోగ్య అవలక్షణ క్షీణ దశ.
ఈ దేశానికి ఒక గొప్ప గౌరవం, గర్వం ఉండేది. ఇప్పుడది ఎంత వెదికినా ఎక్కడా కానరావడం లేదు.
ప్రతిష్ట కూడా పాడుబడిన బావిలా మారింది. సమకాల ప్రతిభావ్యుత్పత్తులు మసకబారాయి. విదేశం వెళ్లితేనే గాని, అక్కడ ఒకరి మోచేతి కింద నీళ్లు తాగితేగాని మన ప్రతిభ పైకి ఉబికి రావడం లేదు. ప్రపంచ శాస్త్ర జ్ఞానానికి దేశం పునాదిలోంచి నవ్య ఆవిష్కరణల కోసం ఎంత గింజుకున్నా ఫలితం ఇప్పటికి సున్నకు సున్న. 3కాపీ2కొట్టి, మార్పులు చేర్పులతో, మసిపూసి మారేడు చేస్తే తప్ప ఒక స్వల్పమైన బలహీన ఆవిష్కరణకు నోచుకోవడం లేదు.
రాజకీయ నినాదాలతో కాలక్షేపం గావించే ఆలోచనా విధానం మనకుంది. తమ రాజకీయ ఎదుగుదలే దేశం లేదా రాష్ట్రం ఎదుగుదలగా భావించే వారితో దేశం ఆవరించిపోయింది. అభివృద్ధి అనే మాటకు తన వ్యక్తిగత లేదా కొంతమంది లేదా తమ పార్టీ అభివృద్ధి అని అర్థం వచ్చేట్లుగా మలుపులు తిప్పే మాటలు చెప్పడం ఎక్కువైంది. అందుకే అభివృద్ధి పదం ఈనాడు హాస్య రసస్ఫోరకం. మరిది కొందరి అభివృద్ధి అందరిదిగా మలచడంలో మాత్రం గణనీయంగా అభివృద్ధి సాధించాం.
ఈ అభివృద్ధిలో గతంతో లింకుని, తెంచక తప్పలేదు. సరికొత్త లింకులను ఏర్పాటు చేసి గతం కానరాకుండా, ఎలాంటి సంబంధం లేకుండా ఒక కొత్త నమూనాని తయారు చేశాం. ఈ అభివృద్ధిని సమీక్షించేవారున్నారు. రాజకీయంగా విమర్శించేవారు కూడా ఉన్నారు. కాని ఎలాంటి అభివృద్ధిని కోరాలి? దాని స్వరూప స్వభావ లక్ష్య లక్షణాలను వివరించేవారు కానరావడం లేదు. ఇది విమర్శల వెల్లువల యుగం. విమర్శించడమే రాజకీయం అయ్యింది. సైద్ధాంతిక అవగాహన పత్తా లేకుండా పరారైంది. చూసీ చూడకుండా నిరంతరం ఏకపక్షంగా చూడడమే చూపుల మతలబయ్యింది. నినాదాలే అభివృద్ధి అనే స్థితికి చేరినారు జనం. ఎవరెన్ని ఎక్కువ నినాదాలిస్తే వారూ అంతటి గొప్ప పాలకులు. సింగపూర్, జపాన్ అనేవారు కొందరు. ఆనాడు స్వతంత్ర దేశాన్ని వలస దేశంగా మార్చిన దేశంలో పర్యటించడం, ప్రస్తుతం అప్రత్యక్షంగా మనదేశాన్ని వలసాధీన దేశంగా మార్చే సామ్రాజ్యవాద దేశంలో పర్యటిస్తేనే గొప్ప అనే భావన రాజ్యమేలుతోంది.
గతంలోని అన్ని నిర్మాణాలు, కట్టడాలు, తగలేస్తాం, కొత్తవాటిని మాటలతో కట్టేస్తాం అనేవాళ్ల అంతరార్ధం ఎరగని అమాయక ప్రజలు మన ఓటర్లు. వారే ఈ దేశ మూలస్తంభాలు. వీరిని, అంగుళం ఎదగనివ్వకుండా, చిన్నిపాటి ఆలోచన చేయనివ్వకుండా ఉంచితే చాలు. సజావుగా దేశం నడుస్తుంది. వంతులవారీగా, పంచవర్ష ప్రణాళికల వారీగా నువ్వోసారి, నేనోసారి స్వారీ చేద్దాం అన్న చందాన పాలకవర్గాలు మధ్య బహిరంగ ఒప్పందం.
అందుకే-
గతానికి భవిష్యత్తుకు ఇక నుండి ఎలాంటి సంబంధం లేకుండా చేయాలన్నది వారి అభిమతం.
గతం వెనె్నముక లేనివాళ్లు తమ హక్కుల గురించి, తమ గౌరవ ప్రతిష్టల గురించి అడగలేరు. అలా వారిని స్తబ్దతకు లోను చేయడమే అభివృద్ధి మతలబు.
చూస్తుండగానే అందరూ రిమోట్ కంట్రోల్‌తో దేశం నడుస్తోంది. రిమోట్ ఎక్కడ ఉందన్నది పెద్దగా ఆలోచించాల్సిన విషయం కాదు. ఎక్కడ ఉన్నా దానితో గతాన్ని చిదిమేయడమే లక్ష్యం. గతం లేనివాడికి వర్తమానం ఉండదని ఆనాడు అనుకునే వాళ్లం. కాని అది తప్పు. వర్తమానంలో వర్తమానం అంటూ ఒకటి ఉండాలి కదా. అది లుప్తం అయిపోయింది. రేపు అనేది లేని దేశం ఎల్లలను కోల్పోయినట్లే. సరిహద్దు అనే బొట్టుని దేశం నుదిటి మీద నుండి చెరిపేసినట్లే. అంతర్జాతీయ అస్తిత్వ ఆవేదనలోంచి మాత్రమే ఈ అంశాన్ని చూడాల్సిందిగా కోరిక. దిక్కూ దివాణం లేని ఆలోచనల మధ్య శాఖాచంక్రమణం చేస్తున్న అత్యంత అల్పజీవులైన ప్రగతి వాదాత్మ రాహిత్య పరులకు చిన్న మనవి! వాళ్లకు ఎందుకు మనవి చేయాలటే ప్రతి విషయానికి గతానుగతిక సంబంధం ఉంటుందని, ఆ కోణంలోంచి సైద్ధాంతికతను నిర్మిస్తామని చెబుతారు కాబట్టి. ఐతే గతానికి పూర్తిగా వారి కళ్లముందే నీళ్లు వదిలాక ఇక చేసేదేముంటుంది? గతాన్ని పట్టుకొని వేళ్లాడే వాళ్లు చాలా ఎక్కువయ్యారు. ఒక బలమైన భౌతిక, మేధోపరమైన గతం గతించిపోయాక వారు వగచి లాభం ఏమిటి? ఈ సందర్భంగా ఒక మాట చెప్పుకుందాం.
గతం-మూర్ఖత్వం అనే ప్రగతిశీల వాదులు దానిని తమ కులం, మతం, విశ్వాసాలు, భావనలు, భౌతిక నిర్మాణాలు, తమతో ప్రమేయం ఉన్న చరిత్రని విస్మరిస్తారా? విస్మరించరు.
గతం-ఆగతం అనే యాంత్రిక సంప్రదాయ ఆలోచనా జీవులు దానిని కాపాడడంలో ఎందుకు వైఫల్యం పొందారో చెప్పగలరా?
గతం అంటే-పాంచభౌతిక సమష్టి శక్తి. మానవుడే కాదు, సకల చరాచరాలకు, ప్రాకృతిక జీవనచలనాలకు అది ప్రాణాధారం.
ఇవ్వాళ అది అంతరించిపోతున్నది. ఈ క్షణాలలో ఎన్నో అసంబద్ధతలు. అది కార్యకారక వివేచనకి పునాది.
అందుకే-
సంప్రదాయ శాస్ర్తియ దృక్పథం మలిగిపోయింది.
నూటొక్క అశాస్ర్తియ 3‘కాపీ’2రచనలు పెరిగిపోయాయ. 3శాస్ర్తియత జ్ఞానం2 వేలానికి తలవంచి ఎదురు చూస్తోంది.
ప్రాచీన సాహిత్యం అధ్యయన నిపుణులు తరిగిపోయారు. అందువల్ల ఆధునిక ప్రయోగాలు బలహీన పడ్డాయని చెప్పుకోవచ్చా.
గతకాలపు శక్తి, కళలు, సంస్కృతికి ఆక్సిజన్‌గా, నకిలీ టానిక్ గా అత్యాధునిక సరళి సమాజ వ్యాప్తమైంది.
ఇవ్వాళ అభ్యుదయ వేదికలపై, ప్రతిఘటన బేనర్ల కింద కులాలు కూచుంటున్నాయి. అభ్యుదయం ముసుగులో కుల గురువులు పీఠాలను అధిష్టిస్తున్నారు. ప్రగతి శీల ఎరుపులో తెలుపు ఎక్కడుంది? బేనర్ విప్లవ సంకేతాలకు ప్రజలకు వ్యతిరేకంగా సమాజాన్ని, గ్రామీణ వ్యవస్థని గుప్పిట్లో పెట్టుకున్నది. పటేల్, పట్వారి కరణాలు కలిసికట్టుగా మరోసారి ఆధిపత్యం చెలాయంచ బోతున్నారు.
ఆనాటి ప్రజాకంటక వర్గాలవారే ఈనాడు మోగని విప్లవ కరచరణాలై కదులుతున్నారు.
నిజమైన సంప్రదాయ గతం కూడా నిర్జీవమై డొల్ల నినాదాల వెల్లువలో కూరుకుపోతోంది.
ఇవ్వాళ దేశాలు ఎరుపు జీరల కళ్లు తెరవాలి.
సమాజాలు తమ మిత్రులను, చలన శక్తులను పునఃసమీక్షించుకోవాలి.
వృత్తుల్ని, భూమిని, వారసత్వాలను కోల్పోయి, గ్రామాలు, గ్రామాధికార వ్యవస్థలన్నీ దోపిడీ గురించి అగ్నిగానం చేయాలి.
గత గాన జ్ఞాన ప్రవాహాలకు పదును పెట్టాలి. గతం అనుభవాల అస్తి. దానిని ఇంధనంగాచేసుకోవాలి.

-జయధీర్ తిరుమలరావు సెల్ : 9951942242