తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ప్రజలను మరిచి ప్రభుత్వాల బాట పట్టిన పత్రికారచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పత్రికా స్వేచ్ఛ గురించి అనేక ఆలోచనలు చెలరేగుతున్నాయి. గత కొద్దికాలంగా సుమారు వందా ఏభై ఏళ్ళ కింద నుండి సంప్రదాయంగా వస్తున్న పత్రికా స్వేచ్ఛ, వాక్‌స్వాతంత్రం వంటి పదజాలం ఇవ్వాళ ప్రాసంగికతను కోల్పోయందని చాలామంది భావన.
అన్ని రంగాలలో పెరిగిన పెట్టుబడి పత్రికా రంగాన్ని సైతం వదల లేదు. పాత పత్రికలు లాభాలకోసం కాదు కనుక నష్టాల బారిన పడి చాలా పత్రికలు (కొన్ని ఆంగ్ల పత్రికలు తప్ప) చాలావరకు మూసుకుపోయాయి. సుమారు నాలుగు దశాబ్దాల కింద మొదలైన కొన్ని పత్రికలు కాలంతో పోటీపడి, గతం మాదిరి కాకుండా సరికొత్త ప్రణాళికతో లాభాలబాట పట్టి, ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిలబడ్డాయి. మరికొన్ని కొత్తగా ఆరంభమయ్యాయి. వాటిలో కొన్ని, కొన్ని దశలలో నిర్దేశించుకున్న లక్ష్యసాధన దిశగా కొన్నివిలువలతో నడిచాయి. మరికొన్ని పత్రికలు రాజకీయార్థిక ప్రయోజనాల అవసరం లోంచి, ఆ కోవ పెట్టుబడి ఆధారంగా వెలువడినాయి.
రెండేళ్ళ క్రితం రాష్ట్ర విభజన జరిగింది. ఆ వెంటనే కొత్త ప్రభుత్వాలు వచ్చాయి. పరిపాలనా పరంగా కొన్ని మార్పులు జరిగాయి. కాని విభజన జరగనిదల్లా ఓ రెండు రంగాలలోనే. ప్రభుత్వపరంగా న్యాయ వ్యవస్థ విభజన ఇంకా జరగలేదు. ప్రైవేటు రంగానికి చెందిన పత్రికా రంగం కూడా చిన్న చిన్న మార్పులతో యధాతథంగా వుండిపోయింది. రాష్ట్ర విభజన కొత్త పత్రికల స్థాపనకు పెద్దగా పురికొల్పలేదు. ఉన్నపత్రికలలోనే నిర్మాణాత్మక, వ్యవస్థాగత మార్పులతో కొనసాగుతున్నాయి. కాని కొందరు ఆ మార్పులే కీలకం అని భావిస్తున్నారు. మనం వ్యక్తుల పరంగా ఆలోచిస్తే వాస్తవాలు కప్పదాటు దాటతాయి. వర్గ దృక్పధంలోంచి చూసే పరిధిని దినపత్రికలన్నీ ఏనాడో దాటిపోయాయి. మానవ లేదా జనం దృక్పధం, ప్రజాస్వామిక ఆలోచనలకి కూడా దూరమయ్యాయి.
ఇవ్వాళ పత్రికలలో ‘రాజకీయం’ ప్రధానం. రాజకీయశక్తుల ప్రాబల్యంతో నడిచే వ్యాపార రంగం సినిమా రంగం, రియల్ ఎస్టేట్ రంగం వంటి వాటికే అధిక ప్రచారం. వ్యాపార రంగం ఉత్పాదకత నుండి దూరమైంది. కార్మిక సంఘాల బెడదనుంచి తప్పించుకోవడం కోసమే కాదు. ఉత్పత్తి ధర, అమ్మే ధరకి మధ్య తేడా ఇట్టే తెలిసిపోయి ‘దోపిడీ’ని బట్టబయలు చేస్తుంది. జాతీయ వ్యాపార దిగ్గజాలు కూడా టెలికామ్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాల వస్తూత్పత్తికే ఎక్కువగా పరిమితం అయ్యాయ. వీటిని వివిధ ప్రాంతాలలో, వివిధ స్థాయిలలో తయారుచేసి రాష్ట్రాల వారీగా అమ్మకం చేస్తారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే భూకబ్జా. లోగడ గుడిసెలు వేసుకోవడానికి ప్రభుత్వ స్థలాలలో పేదలు జెండా పాతేవారు. ఆ పని ఇవాళ ధనిక రాజకీయ నాయకులు చేపట్టాక ఇళ్ళకోసం జాగలు కాదు. కాలనీల నిర్మాణంకోసం భూకబ్జాలకు పాల్పడడం మొదలైంది. చెరువులు, కుంటలు, అడవులు, ఉద్యానవనాలు, కొండలు కోనలు కబ్జాకు గురై రియల్ట్ పదం పనికిరాకుండా పోయింది. ఫార్మా కంపెనీలు ముందు నేలలో, నీళ్ళల్లో, గాలిలో కాలుష్యం వెదజల్లి ఆ తరువాత కేవలం మనుషుల ఆరోగ్యంకోసం మాత్రమే మందులు తయారుచేస్తారు. వీరికి ప్రభుత్వం రైతుల వద్దనుండి భూమి, పారే నదులనుండి నీరు, బ్యాంకుల నుండి అప్పులు అప్పనంగా మంజూరు చేస్తుంది. ఈ వ్యాపార వర్గాలవారు కొన్ని పత్రికలలో వాటాదారులు. కొందరు ఇతర కంపెనీలలో పెట్టుబడిదారులు, మరికొన్ని పత్రికలు కులం, ప్రాంత బలంతో ఏర్పడిన ప్రభుత్వాలకు, రాజకీయ శక్తులకు అండగా ఉంటాయి. అంటే పర్యావరణం, ప్రజాదృక్పధం, పత్రికల పాలసీల ఎజెండాలో అతి తక్కువ స్థానం ఇవ్వబడుతున్నది. ప్రాంత, మత, కుల పరిధుల్లోనే పత్రికలు నడుస్తున్నాయి. ఒక్క జెండర్ సమస్య మాత్రమే ఈ విషయంలో తలెత్తదు. అది కేవలం సాహిత్య రంగానికే పరిమితం. అక్కడ కూడా పై వర్గాలవారిదే పెత్తనం.
ఈ నేపథ్యంలో వాక్ స్వాతంత్య్రం, పత్రికాస్వేచ్ఛ వంటి పదాల అవసరం లేకుండాపోయింది. ఎప్పుడైనా వాటాల తేడా వస్తే తప్ప స్వేచ్ఛ పదం కనబడదు. ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ, యాజమాన్యాల స్వేచ్ఛే. వార్తారచన, ప్రచురణలో నైతికత లోపించాక ఈ పదాలకు అర్థాలు మారాయి. వాక్ స్వేచ్ఛ ప్రజలకోసం. పత్రికా స్వేచ్ఛ యాజమాన్యాల కోసం. నిజానికి యాజమాన్యం అనే పదం బదులు యజమాని అనాలి. పత్రికలకు ఇప్పుడు ఎనలేని స్వేచ్ఛ వచ్చింది. పత్రికాధిపతులు ఈ స్వేచ్ఛవల్ల తమ సంపదని తామర తంపరగా అభివృద్ధి చేసుకుంటున్నారు. తమ వర్గాలకి గిట్టని, తమ ప్రయోజనాలకు భంగం వాటిల్లే అనేక వార్తలను నిశ్శబ్దం చేస్తున్నారు. ఇలాంటి వార్తలు మారుమూల గ్రామాలనుండి నగరాల దాకా అప్రకటిత నిషేధాజ్ఞలకు గురవుతున్నాయి. ఒకటి రెండు పత్రికలు అప్పుడప్పుడు కొన్ని వార్తలను అనివార్యంగా ప్రకటించవచ్చు. కానీ మొత్తంగా చూస్తే, గత కాలంతో పోలిస్తే అంత ఆరోగ్యకరమైన వాతావరణం కానరాదు. గజదఆ ఆ్య జశఛ్య్ఘిౄఆజ్యశ ఘషఆని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు పాటిస్తున్నా గజదఆ ఆ్య ళఛిఖఒళ అన్న సూత్రాన్ని మాత్రం అన్ని పత్రికలు అమలుచేస్తున్నాయి. ప్రభుత్వాల సెన్సార్ పైకి కనబడుతుంది. కానీ, ఇప్పుడది అమలులో కానరావడం లేదు. కానీ పత్రికలలో విధించిన వార్తల సెన్సార్‌కి అంతు ఉండదు. పైకి కనిపించదు.
ఇప్పుడు ఈ ‘సెన్సార్’ తంతుని ప్రభుత్వం తన యంత్రాంగం ద్వారా నడిపించడం లేదు. పత్రికల ద్వారానే నడిపించడం కొత్త ధోరణి. తెలంగాణాలో జరిగిన ఆయుత చండీయాగం పత్రికా రంగంలో ఒక సరికొత్త కొండగుర్తు. దైవం ఇచ్చిన వరాల మాట ఏమిటో గాని, ఇరువర్గాల మధ్య జరిగిన మాటల మూటల పంపకాలు ఏమోగానీ పత్రికలు మారాయి. పిల్లీ ఎలుకల మధ్య గల సహజ ఘర్షణ ఇప్పుడు ఎంత వెతికినా కనబడదు. గత నాలుగైదు నెలల నుండి చాలా పత్రికలు ప్రభుత్వ ప్రకటనల సారాన్ని వార్తలుగా మలుస్తున్నాయి. సిద్ధించిన ఈ ఒక్క అవకాశంతో రాజకీయ నాయకులలో దాగిన నియంతల స్వభావం బట్టబయలవుతోంది. దాంతో ప్రభుత్వాల జనవ్యతిరేక స్వభావం కూడా గణనీయంగా పెరిగింది. ఎన్నికలముందున్న స్నేహ స్వరం పులిలా గాండ్రిస్తున్నది.
మనది అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. మనదేశంలో వాక్ స్వేచ్ఛ 179 దేశాలతో పోలిస్తే మనది 140వ స్థానంలో నిలిచిందని 2016 నాటి తాజా నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరింత దిగజారి ఎరిత్రియా, తుర్కెమెనిస్తాన్, సిరియా, వియత్నాం, చైనా, సూడాన్ వంటి నియంత దేశాల స్థాయికి దిగజారిపోవచ్చని ఒక అంచనా.
నిజానికి చిళళజ్యూౄ యచి ఆ్దళ ఔళఒఒ, చిళళ ఔళఒఒ, ఔళఒఒ చిళళజ్యూౄ వేరు వేరు. ఇప్పుడు నడుస్తున్నది మొదటిది. అది పత్రికాధిపతులకు సంబంధించినది. ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ అనడంలో ‘ప్రెస్’ అనే పదం కేవలం పత్రికలకే వర్తిస్తుంది. కానీ దానిని వార్తా మాధ్యమంగా భావిస్తే ఇతరత్రా చేరతాయి. ఏది ఏమైనా టీవి చానళ్లు మనం మాట్లాడుకునే పరిధిలోకి తెలుగులో వచ్చే వీలు అంతగా కనిపించడం లేదు. చానళ్లు వినోదానికే ఎక్కువగా పరిమితం అయ్యాయ. ప్రెస్ అనే పదానికి వార్తాపత్రికల అచ్చు, ఆ రంగపు వార్తా వ్యవస్థ, యాజమాన్యం అనే పరిధి చాలా భాషల పరిశీలనల వల్ల అర్థం అవుతున్నది. ‘ది ఎండ్ ఆఫ్ ది ప్రెస్ ఫ్రీడం’ అంశంపై గ్రంథం రాసిన డామియన్ టాంబినే అనే అతను ఇలాంటి పరిస్థితులను చూసి ‘చిళళజ్యూౄ యచి ఆ్దళ ఔళఒఒ జఒ ఖ్ఘ్ఘూశఆళళజూ యశక ఆ్య ఆ్ద్యఒళ త్ద్యీ యతీశ యశళ’’ అని రాశాఢు. చాలా దేశాల్లో పత్రికా స్వేచ్ఛ జన మాధ్యమాలవల్ల మానవ హక్కులలో భాగంగా ఉంది. నిర్దిష్టమైన నిబంధనలు, రూల్స్ ఏవీ లేవు. నిజానికి ళళజ్యూౄ, జజఇళూఆక వంటి పదాల అన్వయింపులో కూడా క్లిష్టత ఏర్పడింది. ప్రజల హక్కులకు సంబంధించినవిగా కాకుండా ఈ పదాలను సాధారణీకరించి యాజమాన్యాలకు వర్తించే విధంగా మారడం గమనించాలి.
నిజానికి ‘స్వేచ్ఛ’ ఎవరికి? వార్తలకా? వార్తా పత్రికలకా, సంపాదకులకా, పత్రిక యజమానులకా, పాత్రికేయులకా, పాఠకులకా?
ఇప్పుడు ‘పాఠకుడు’ నిర్వచనం కూడా మారింది. పాఠకులు ప్రజలలో భాగం. కానీ సాధారణీకరించిన నిర్వచనాల ప్రకారం పాఠకులు ధనికులైనా కావచ్చు, యజమాని కూడా కావచ్చు. కాబట్టి ముందు మనం ఈ పదాలను ప్రజాస్వామీకరించగలగాలి. వాటిని ప్రచారం చేయగలగాలి. కానీ పత్రికలు అందుకోసం సహకరిస్తాయా? జార్జి గోండెజ్ పేర్కొన్నట్లు పత్రికలు ముందుకు రావు. వచ్చినట్లు కనిపించినా ప్రజాదృక్పధంలో ప్రచారం కల్పించవు. కొత్త ప్రభుత్వాలు ప్రకటనలు ఇస్తూ రాయబడని ఆంక్ష ఒకటి పెట్టింది. అదేమంటే ఆ ప్రకటనలకు సంబంధించి రెండు పెద్ద వార్తలు, పత్రికలు వార్తల రూపంలో రాయాలి. ఆయా మంత్రులు లేదా అధికారుల వార్తా పాఠం ఉన్నది ఉన్నట్టుగా ప్రచురించాలి. ఈ ధోరణిని ముక్తకంఠంతో పత్రికలు నిరాకరించాలి. కానీ జరిగిందేమిటి? ఒక్కొక్కరు... అందరూ అందుకు అంగీకరించి వత్తాసు పలికేశారు. నిజానికి ఆ అవసరం లేకుండానే పత్రికల వార్తల్ని ప్రభుత్వ పంథాలోకి మార్చేయడం ప్రజలు ఎపుడో గమనించారు. అమరావతి, మల్లన్నసాగర్ వంటి పథకాలను ప్రభుత్వం ప్రజలపై పగబట్టినట్లుగా, మొండిగా అమలు పరచడం, అందుకు అడ్డుపడే ప్రజలను జైళ్లకు పంపడం కళ్లారా చూస్తున్నదే.
ఒక విచిత్రం ఏమంటే గత కొద్ది రోజులనుండి వీటిపై వచ్చిన వార్తలు, సంపాదకీయ పేజీ వ్యాసాలు చాలావరకు ప్రభుత్వ పంథాని ప్రతిబింబించేవే. ప్రజల తరఫు వార్తలు, వ్యాసాలు చాలా తక్కువ శాతం ఉండడం ఉదాహరణగా పేర్కొనవచ్చు.
రాబోయే కాలాలలో ఇలాంటి కవరేజీలను అధ్యయనం చేసి పత్రికల పాత్రను బేరీజు వేస్తే పత్రికా స్వేచ్ఛ అంటే ఏమిటో ప్రజలకు ఇట్టే తెలిసిపోతుంది.