తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ఆదివాసీల అపురూప సాహిత్య నిర్మాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచన చేసే వ్యక్తి ముఖ్యం కాదు. రచన ముఖ్యం. రచన కలిగించే చైతన్యం మరీ ముఖ్యం అని అంటారు మహా శే్వతాదేవి.
మన దేశంలో రచయిత ముఖ్యం. ఆ రచయిత దృక్కోణంనుంచి సమీక్షకుడు, విమర్శకుడు పరిశోధకుడు వగైరాలు గింగిరాలు తిరుగుతారు. పదే పదే చక్కర్లు కొట్టి 3బట్టతలకీ మోకాలుకీ2 లింకు పెడతారు. వర్గ కుల సమాజంలో ఈ ధోరణి ప్రబలిపోయి రచన లోని విలక్షణత పక్కకు పడిపోతుంది.
ఉదాహరణగా తెలుగులో చలం, శ్రీశ్రీలను పేర్కొనవచ్చు. ప్రగతిశీల వాదులు ఇంకా వీరిని తలకెత్తుకుని క్వింటాళ్ల బరువు నిరంతరం మోస్తున్నారు. అలా మోసేవారు ఒక రచనని విమర్శనాత్మకంగా చూడలేని దుస్థితికి గురవుతారు. ఇది ప్రగతిశీల ధోరణికి వ్యతిరేకం. అయినా నాలుగు తరాల నుండి అలా భుజాలు పులిసేలా రచయితలను మోయడం ఇంకా ఆపలేదు. ఇలాంటివారిని చూసి అందుకే మహాశే్వతాదేవి ఈ ధోరణిని నిర్ద్వంద్వంగా ఖండించింది. రచనని చదవాలి. రచయితలను కాదు అని పలుమార్లు పలు పత్రికల్లో చెప్పింది. అయినా బెంగాలీ ప్రగతిశీలవాదులు ఇంకా రచయతలకే పల్లకీలు మోస్తూనే ఉన్నారు. నన్ను కాదు నా పాఠ్యాన్ని చూడండని పదే పదే ఆమె చెప్పింది.
1926లో ఢాకాలో పుట్టి, 1947లో వివాహం చే సుకున్నారు. భర్త బెంగాలీలో పేరుపొందిన నాటక రచయిత. అతని పేరు బిజోన్ భట్టాచార్య. ఇతను ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. ఐతే కొన్ని కారణాలవల్ల పధ్నాలుగేళ్ల తరువాత ఇద్దరు విడాకులు తీసుకున్నారు.
శే్వతాదేవి తండ్రి సుప్రసిద్ధ రచయిత మనీష్ ఘటక్. ఆమె బాబాయి రిత్విక్ ఘటక్. అతను సుప్రసిద్ధ చలనచిత్ర దర్శకుడు. సినిమా వ్యాకరణాన్ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు. సత్యజిత్‌రేకి పూర్తిగా వ్యతిరేకం. తల్లి ధరిత్రీదేవి సామాజిక కార్యకర్త. అలాంటిసాహిత్య కళాస్రష్టల కుటుంబంలో మహాశే్వత పుట్టింది.
పుట్టిన మూడు దశాబ్దాలకి కలం పట్టి ‘ఝానే్సర్‌రాణి అనే పుస్తకం రాశారు. రెండేళ్ల కింద తన’ కొడుకు మరణించేవరకు సాహిత్య రంగంలో చురుగ్గా ఉన్నారు.
28 జులై 2016 నాడు మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిముషాలకు మరణించేవరకు మహాశే్వతాదేవి (91) తనదైన నమ్మకాలను, విశ్వాసాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసేవారు. ఆమెది బలమైన వ్యక్తిత్వం. తాను నమ్మిన విషయాలనే రాసింది. తాను చూసిన విషయాలనే చెప్పింది. ఏ సిద్ధాంతం, ఎంత గొప్పదైనా అది ప్రజల బతుకుల ముందు మారాల్సిందేనని నమ్మింది.
భారతదేశంలో వుంటూ ఆమె గాంధీ సిద్ధాంతాలను అనుసరించలేదు. మార్క్సిజాన్ని ఉన్నదున్నట్టుగా ఏనాడూ ఆమోదించలేదు. వారి పట్ల చాలా జాగ్రత్త వహించింది. అరణ్యేర్ అధికార్, హజార్ చౌరాసీకా మా, అగ్నిగర్భ్ వంటి రచనలను పరిశీలించి చూస్తే ఆమెలో దాగిన ఒక బలమైన వ్యక్తిత్వం అవగతం అవుతుంది.
రచనలో, ఇతివృత్తంలో యాంత్రికంగా చెప్పే వర్గ ఆలోచనలకందని, సమాజంలోని అట్టడుగు లోకంలోని మనుషుల బతుకులనే ఆమె స్వీకరించింది. మామూలుగా పైకి కనిపించే ప్రగతిశీల రచయితల ఆదివాసీ వ్యధలను ఆమె తన కథా వస్తువుగా తీసుకోలేదు. అంతకన్నా లోతుగా వారి జీవితాలలోని కోణాలను ఆవిష్కరించి కొత్త వరవడి సృష్టించింది. కుప్రిన్ వంటి రష్యన్ మహారచయితలకు ఆనాడు సాధ్యమైనట్టుగా ఆదివాసీల బతుకు కోణాలను శే్వతాదేవి ఈ నేల మీద ప్రత్యక్షంగా చూసింది. రచనలుగా చేసింది. ఊహాత్మక రచనని ఆమె నిరాకరించింది. 3‘శిశు’4 రచన చదివితే మనసు ద్రవించని పాఠకులు ఉండరు. గాయత్రి సి. స్పివాన్, శే్వతాదేవిపై రాసిన వ్యాసంలో 3శే్వతాదేవిలో ఒక తెలియని విధ్వంసకారి వుంది. వినిర్మాణవాది వుంది. ఆమె తెలిసో తెలియకో ఇతివృత్తం స్వీకరించడంనుండి రచన పూర్తి అయ్యే వరకు ఈ లక్షణాలు బలంగా కనిపిస్తూ వుంటాయి2 అని రాసింది. సిద్ధాంత చట్రాల కావల ఆమె ఆలోచిస్తుంది. వెలుగుచూడని మానవజీవన విధానాలను ఆమె ఒడిసి పట్టుకుంటుంది. నృశాస్తవ్రేత్తలు చూడని కోణాలను అక్షరీకరిస్తుంది.
3‘ద్రౌపది’2 కథలో పోలీసు ఆఫీసర్ బలవంతంగా బట్టలు విప్పి చేసిన బలత్కారాన్ని ఆ ఆదివాసీ మహిళ తనదైన రీతిలో ప్రతిఘటించిన తీరు చిత్రించిన విధానం పాఠకులను విస్మయపరుస్తుంది. ఈ ప్రతిఘటన వర్గ పోరాటాల దృష్టిలో, సామాజిక కోణాల అవగాహనకు ఏ రూపంలోను అందదని విమర్శకుల భావన. అది కేవలం ఒక ఆదివాసీ స్ర్తియే అలా ప్రతిఘటించగలదు. దానిని ఒక స్ర్తిగా శే్వతాదేవి మాత్రమే అంత బలంగా చిత్రించగలదు అని వారు అంటారు.
రాజకీయ కోణాల వెలుగులోంచి రాసే రచయితల రచనలు ఎందుకు యాంత్రికంగా వుంటాయో, శే్వతాదేవి రచనలు ఎందుకు సజీవంగా వుంటాయో ఆలోచించాలి. ఇది ఆమె రచనలు విసిరిన సవాలు.3శిశు4రచనలో ‘కువ’2 ఆదివాసీ సమాజం ప్రతిచర్య- ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసింది. వారి దరికి చేరని సంక్షేమ ఫలాలపై ఒక సాహిత్య వజ్రాయుధాన్ని రచయిత్రి ఎక్కుపెట్టింది. ఆ ఆదివాసీ పిల్లలు పౌష్టికాహార లోపంతో ఎత్తు పెరగరు. పొట్టిగా మరగుజ్జుల్లా వుంటారు. అవయవాలు సైతం గిడసబారి, బానల్లాంటి పొట్టలతో చూడ్డానికి వికృతంగా పెరుగుతారు. వారికి బియ్యం పప్పుఉప్పు అందించాల్సిన యంత్రాంగం తమ పని తాము నిర్వర్తించకపోవడం వల్ల తలఎత్తిన విపత్కర పరిస్థితి ఇది. అక్కడకు వెళ్లిన అధికారులు కొందరు మాయం అవుతుంటారు. వారు ఎక్కడ ఉన్నది ఎలా ఉన్నది తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. కొందరు పిచ్చివాళ్లుగా కనుపించారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక మంచి ఆఫీసర్ జరిగిందేమిటో తెలుసుకుందామని అక్కడికి బయలుదేరతాడు.
3‘కువి’2 ఆదివాసీలు జీవించే లోతట్టు అటవీ ప్రాంతంలో పదుల సంఖ్య పైగా ఆహారలోపంతో పెరిగిన, దిగంబరులైన మరుగుజ్జులు మీదపడి రక్కి గిల్లి ఆహార పదార్ధాలు లాక్కుంటారు. ఈ అధికారులకు తమ దిగంబర శరీరాలను రాస్తూ అతని చుట్టు వలయంగా కేకలు వేస్తూ తిరుగుతారు. వారిది అరుపుల భాష. ఆ భాష వీరికి రాదు. అరచినా గీపెట్టినా వారు ఏమాత్రం ఖాతరు చేయరు. ఆ అధికారికి మిగతా అధికారులు ఏమయ్యారో అప్పుడు తెలిసి వస్తుంది.
ఈకథ జర్మన్ డైరక్టర్ వెర్మన్ హెర్జోగ్‌ని తలపింపచేస్తుంది. మరుగుజ్జులతో తీసిన సినిమా మన మదిలో తిరగాడుతుంది. ఇది చలనచిత్ర దృశ్యం .కాని శే్వతాదేవిది అక్షర చిత్రం. హెర్జోగ్ కన్నా ఎన్నో రెట్లు భయంకరంగా ప్రభావం చూపుతుందీ రచన. ఈ శైలి ఆమెకు తన బాబాయి రుత్విక్ ఘటక్‌నుండి సంక్రమించినట్టు అనుపిస్తుంది. ఘటక్ చిత్రాలు పచ్చి వాస్తవిక చిత్రాలు (బ్రూటల్ రియాల్టీ). ఆ చిత్రాలలోని పాత్రలు కూడా ఎలాంటి సభ్యత సంస్కారం లేకుండా తామున్న కఠోర వాస్తవికతలోంచే కనబడతాయి. ఆ భాష కూడా చాలా క్రూడ్‌గా కావాలని వుంచుతాడు. అది ఒక రకంగా రెబల్ ఇన్ ఆర్ట్.
సంప్రదాయ ప్రగతి శీలం చూడని సామాజిక వాస్తవికతని శే్వతాదేవి చూసారు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా గ్రామీణ ఆదివాసీ అటవీ ప్రాంతాలకు వెళ్లి ఆసక్తికరమైన జీవితాలను, సంఘటనలను పరిశీలించి రాసారు. వివిధ సమూహాలకు చెందిన సామాజిక కోణాలను, అనుభవాలను పొందిన ఆమె రచనలలో అవి ప్రతిబింబించాయి. ఆ రకంగా కాల్పనికతలోంచి కాకుండా సహజత, వాస్తవికతలోంచి ఆమె అక్షరాలు పదునుదేరాయి. ఇలాంటి వైవిధ్యత, శక్తిని సాహిత్య అకాడమీలు సైతం గుర్తించక తప్పలేదు.
1996లో 3అరణ్యేర్ అధికార్2 రచనకు జ్ఞాన్‌పీఠ్ వచ్చింది. ఆదివాసీలలో అక్షరాస్యత పెంచినందుకు 1997లో రామన్ మెగసేసే అవార్డునిచ్చారు. ఆమె మూడు రచనలు 3హజార్ చౌరాసియాకిమా4, 3రుడాలి2, గాంగోర్ అనే కథని 3చోలీకే పీఛే2 సినిమాలు వచ్చాయి.
భారతీయ ప్రగతి సాహిత్యానికి కొత్త రంగు రుచి అద్దిన ఆమె పద్మ అవార్డులుకూడా పొందారు. ఐనా ఆమె ప్రజల స్వరంగా , ఒక సాహిత్య కార్యకర్తగానే ఉండిపోవడానికి మొగ్గు చూపారు. విభిన్న అస్తిత్వాలను మార్క్సీకరించడానికి ప్రయత్నంలో సఫలమయ్యారు. ఆమె ఆదివాసీ సమస్యలను మార్క్సీకరించిన విధానం ఎంతో విలక్షణమైనది. రొడ్డకొట్టుడు మార్క్సిస్టులకు సాధ్యంకాని పని అది. శాంతినికేతన్‌లో చదువు ఆమెను విద్యావంతురాలిని చేస్తే ఆదివాసీ జన జీవన క్షేత్రం జ్ఞానవంతురాలిని చేసింది.
రచయిత్రిగా మార్చింది. సృజనాత్మక రచనలతో శక్తిని సమకూర్చడం ఆదివాసీల క్షేత్రానుభవం వల్ల మాత్రమే సాధ్యం అయిందని చెబుతుంటారు. ఆరాం కుర్చీ రచయితలు గొప్ప శిల్పం ప్రదర్శించవచ్చు. కాని ఆ శిల్పం తత్కాలం. అది జీవ రహిత అలంకరణ మాత్రమే అంటుంది ఆమె.
ఆమె రచనలు ఆంగ్లంలోకే కాదు. అనేక భారతీయ భాషల్లోకి అనువదించబడినాయి. తెలుగులో ఆమె అనేక రచనలు వెలువడినాయి. ఇంతటి పాఠకాదరణ గల రచయిత్రి మరొకరు లేరు. శే్వతాదేవి స్వతంత్ర రచయిత్రి. స్వతంత్ర మేధావి. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటు రచయితగా అనన్యమైన కృషి సాగించింది.
ఆధునిక కాలంలో జీవిస్తూ ఆధునిక, అత్యాధునిక చట్టాలను బద్దలు కొట్టింది.వినిర్మాణాన్ని పాశ్చాత్య లక్షణంగా కాక, దానిని భారతీయ సంప్రదాయంనుండి పెంపుచేసింది. శే్వతాదేవి ఒక మహా ప్రయోగం. భారతీయ సాహిత్యానికి కొత్త కోణం. ఆమె లేకపోతే ఆదివాసులే కాదు-సాహిత్య జీవులూ అనాధలు అయినట్టుగా భావిస్తారు. ఆమె లేని లోటు ఎవరూ తీర్చలేరు. ఇది నిజమైన నిజం.