తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

తలదించుకోవాల్సింది ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుషుల్లో మానవత్వం అంతరించడానికి కారణాలు అనే్వషించాల్సిన సమయం ఇది.
మానవ సమాజాన్ని మానవీయ కోణంలో నడుపుతామని ప్రతిజ్ఞలు చేస్తున్న ప్రభుత్వ నేతలు, అధికారులు, న్యాయ వ్యవస్థ వంటి పలు రంగాల వైఫల్యంవల్లే మానవీయ భావన తగ్గుతోందా? ఆలోచించాలి.
అమానవీయ సంఘటనలు పెచ్చుపెరుగుతున్నప్పుడు ప్రజలను కాపాడే రాజును నిందిస్తాం. అందుకే చరిత్రలో మంచి రాజులు తక్కువ. చెడ్డరాజులు ఎక్కువ. అధికార మ ధాంథతలో కూరుకుపోయిన రాజావారికి ప్రజలు బాధల్ని వారే కొని తెచ్చుకున్నారని చెప్పడం మామూలే. కాని కొన్ని సంఘటనలు రాజ్యపాలన పట్టిచ్చేవిగా వున్నప్పుడు ఆ రా జుని ప్రజలు ఏడు తరాలు ఆడిపోసుకోవడం కద్దు. అందుకే వందలాది రాజవంశాలు ప్రజాగ్రహానికి గురై బికారులై దే శాలు పట్టారు.
భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన నైజాంరాజు వారసులు అప్పుల్లో కూరుకుపోయి విదేశాలలో తలదాచుకున్నారు. సంపాదించిన సంపద పరులపాలైంది. వందలాదిమంది జమిందార్లు, జాగీర్దార్లు, పాలెగాళ్లు వసూలుచేసిన పన్నులే కొరివి కర్రలై కాల్చేసాయి. విసునూరి దొరవారు, జన్నారెడ్డి ప్రతాపరెడ్డి దొరల వంటివారు ఈ నాటికీ ప్రజాకంటకులే. వారి వల్ల నైజాం ప్రభువుకి అం తిమ ఘడియలు ఆవరించాయి. ఈ రజాకార్ల నాయకుడు ర జ్వీవల్ల అవి త్వరితగతిన చేరాయి. ప్రజలను విస్మరించి న చ్చిన జమిందార్లనే పోషించిన ఆంగ్లేయ ప్రభుత్వాన్ని ప్రజాగ్రహమే భారత్‌ను వదిలి పారిపోయేలా చేసింది
మనుషుల్లో మానవత్వం అంతరించడానికి ప్రభుత్వాలే కారణం. వ్యక్తులు కాదు. అందునా అట్టడుగు మనుషులు అసలే కాదు. ఈ వ్యవస్థను పాలిస్తున్న పాలకులు. వారి కిం ద ప్రభుత్వ యంత్రాంగం. అధికారులు. ఉద్యోగులే. కిందివాళ్లని దండించి పై వారిని కాపాడేదే వర్గ స్వభావం. ఈ స్వ భావం అంతటా వ్యాపించి పోయిన చోట, దానికి అధినాయకుడు ఉన్నచోట ఎవరికి శిక్ష పడాలి? ఆలోచిద్దామా ఓసారి సీరియస్‌గా!
***
గత వారంలో ఒడిశా రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు సంఘటనలను పరిశీలిద్దాం.
ఒడిశాలోని కలహండికి చెందిన గిరిజనుడైన దానామాఝ్రీ అనే అతని భార్య అమాంగ్‌దేవి భవానిపట్నం ప్ర భుత్వ దవాఖానాలో క్షయవ్యాధికి చికిత్స పొందుతూ మరణించింది. ఊరు కాని ఊరిలో ఏం చేయాలో అతనికి పాలుపోలేదు. ఆసుపత్రిలో ఎదుర్కొన్న నియమ నిబంధనలు అప్పటికే కృంగదీసాయి. పైగా తెచ్చుకున్న డబ్బులు మం దులు, ఆమ్యామ్యాలకే సరిపోలేదు. ఆకలి దహించివేస్తున్నది. శవాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి ఏం చేయాలో తెలియ ని అమాయకుడు. ప్రైవేటు వాహనం అద్దెకు తీసుకుని అరవై కిలోమీటర్లు వెళ్లలేని ఆర్థిక స్థోమత అతనిది. ఇక స్వగ్రామం చేరాలంటే కాలినడక ఒక్కటే మార్గం. వైద్యాధికారుల కాళ్ళా వేళ్లాపడినా కనికరించలేదు. నిజానికి ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయిన వారి మృతదేహాలను స్వస్థలాలకు ఉచితంగా చేరేవేసే ప్రత్యేక పథకం 3మహా పారాయణ2 అక్కడ అమ ల్లో ఉంది. ఐనా సహాయం అందించడానికి అధికారులు నిరాకరించారు. చేసేదిలేక శవాన్ని భుజాన వేసుకుని 60 కిలోమీటర్ల నడక ప్రారంభించాడు. పది కిలోమీటర్లు నడిచినా చోద్యం చూస్తుండిపోయారు వాహనదారులు. ఎవరూ పట్టించుకోలేదు. కొందరు మీడియా సిబ్బంది మాఝీ పడుతున్న బాధను జిల్లా కలెక్టరు దృష్టికి తెస్తే మిగిలిన ఏభై కిలోమీటర్ల దూరం అంబులెన్స్ ఏర్పాటైంది.ఆ పది కిలోమీటర్లు నడిచినంత దూరంలో మాఝీ పనె్నండేళ్ల కూతురు ఏడుస్తూనే ఉంది. మామూలుగానే టీవీ ప్రసారాలు చూసి మానవహక్కుల కమిషన్ నివేదిక ఇమ్మని కోరింది.
ఈ ఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే అదే రాష్ట్రం లో ఇలాంటిదే మరో సంఘటన జరిగింది.
సలమని బరిక్ అనే ఎనభై ఏళ్ల ముసలమ్మని సోరో రైల్వేస్టేషన్ దగ్గర గూడ్స్‌రైలు ఢీకొంది. సోరో కమ్యూనిటీ ఆరో గ్య కేంద్రం ఆమె మరణించినట్టు తేల్చి చెప్పింది. ఆమె మృ తదేహాన్ని పోస్టుమార్టం కోసం బాలసోర్‌లోని జిల్లా దవాఖానాకు తరలించడానికి ఒక స్వీపర్‌ను రైల్వే పోలీసులు ఆ దేశించారు. అంబులెన్స్ వసతి లేదు. రైల్వే పోలీసులు తమ స్వంత డబ్బులు పెట్టలేరు. మరే వాహనంలోనైనా తరలిస్తే ఎక్కువ డబ్బు కావాలి. అది ఎవరు భరించాలి? ఏ ప్రభుత్వ శాఖ, ఏ రైల్వే విభాగం దానిని భరించడానికి సిద్ధపడలేదు. అందుకే ఓ కూలీని పిలిచి ఒక చిన్న సంచి ఇచ్చి అందులో శవాన్ని సర్దేసి రెండుకిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రికి తరలించమన్నారు. చేసేది లేక ఆ కూలీ శనాన్ని నడుం వరకు వంచి, సంచిలో ముసలామె శవాన్ని కుక్కి, వెదురుబొంగు తెచ్చి దానికి కట్టి, శవాన్ని చచ్చిన పశువులా వేలాడదీసారు. ఇదంతా కళ్లారా చూస్తూ చేసేది లేక ఆ ముసలామె కొడుకు రబీంద్ర బరిక్ కన్నీరు మున్నీరయ్యాడు. సమాచార మాధ్యమాల్లో ఆ దృశ్యం ప్రసారం అయింది.
మళ్లీ పాత కథే. ఒడిసా మానవహక్కుల కమిషన్ ఇదేమి టా అని అధికారులను వివరణ పంపమని చెప్పింది. అంత తొందర ఏమీ వద్దు. నాలుగు వారాలలోపు నింపాదిగా నివేదిక సమర్పించమని జిల్లా మేజిస్ట్రేట్ ఘనకార్యంగా మీ డియా ప్రతినిధులకు చెప్పాడు.
ఇప్పుడు చెప్పండి? మనుషుల్లో మానవత్వం అంతరించిందా లేదా. ఏ టీవీ చానలైనా ఈ దృశ్యాలు చూసి ఈ ప్రశ్న అడిగితే నూటికి నూరుమంది మానవత్వం నశించిందనే చె బుతారు.
కానీ ఇక్కడ ఆలోచించాల్సిన ముఖ్యమైన అంశాలు ఎ న్నో ఉన్నాయి. ఏమీ ఆలోచించకుండా కిందివర్గం ప్రజలు, మేధావులు కూడా పాలక ప్రభుత్వ అధికార యంత్రాంగం వర్గ స్వభావం, ప్రభావంలోంచే ఆలోచించి, ఏ నేరానికైనా, ఏ ఘోరానికైనా అట్టడుగు మనిషే నేరస్తుడవుతాడని తీర్పునిస్తారు. విప్లవ పంథాలో నడుస్తున్న పోరాటాలలో, సామాజిక మార్పు పేరుతో నడిచే ప్రతిపక్ష పార్టీలలో, పాలక పార్టీల గణాలలో సైతం ఇదే ఆలోచనా విధానం ఉంటుంది. ఇన్‌ఫార్మర్లు ఎప్పుడూ తిండిలేని గిరిజనులే. డబ్బున్న వ్యా పారి, వర్గ శత్రువులైన కరణం, గ్రామ మునసబు, పటేల్, ప ట్వారి వంటి వారు ఇన్‌ఫార్మర్లు కారు. పోలీసులతో సంపూర్ణంగా మిలాఖతైన వాళ్లు ప్రజాద్రోహులు కారు. వారిని భూ స్వామ్య కాలపు విల్లమ్ములు, గొడ్డళ్లు, కత్తులు, కటార్లు ఏమీ చేయలేవు. ఆధునిక మారణాయుధాలైన రివాల్వర్లు, తుపాకులు, ఎకె47లు ఏవీ కాల్చలేవు. అలాంటి వార్త ఒక్కటీ పత్రికలు ప్రకటించవు. ఇలాంటి చావు వార్తలను ప్రచారం చేసే ప్రత్యేక 3విభాగం2 ఏదైనా ఉందా అని అనుమానం వస్తుం ది చాలామందికి. ఐనా ఎవరూ ఎక్కడా ఆ అసహజ మరణా ల తంతు గురించి మాట్లాడరు.
ఒక గిరిజన స్ర్తి అనారోగ్యంతో మరణించింది. నిజానికి దేశంలోంచి టీబీని పారదోలామని గర్వంగా చెప్పుకునే ప్ర భుత్వం దోషిగానిలవాలి. వైద్య సర్వే తప్పని తేలాక వైద్యాధి కారులని దోషులుగా నిలపాలి. టీబీని తగ్గించలేని ప్రభుత్వ ఆసుపత్రిని అభిశంసించాలి. శవాన్ని ఇంటికి చేర్చని అంబులెన్స్ విభాగాన్ని, అధికారులని నేరస్థులుగా ప్రకటించాలి. ఆ నాడు ఉద్యోగ నిర్వహణలో ఉన్న జిల్లా వైద్యాధికారిని బా ధ్యులుగా చేయాలి. అలా చేయం. అలా చేయకపోవడమే అసలు నేరస్థులకు స్వేచ్ఛనివ్వడం. మరి ఎవరిని చేస్తాం. ఆ నాడు జ్వరంతో కాలిపోతున్న అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్షంగా నివేదిక తయారవుతుంది. వాడిని సస్పెండ్ చేస్తాం. అప్పుడుగాని వ్యవస్థ శాంతించదు. ఎవరో ఒకరు హరిజనుడో గిరిజనుడో దగాపడిన సగటు జీవో మన కోసం హతం కావాలి. అంతం కావాలి. అదీ మన మనసులోకి ఇంజెక్టు అయింది. మానవత్వం ఈ కింది వర్గాల ప్రజలలో అంతరించిపోయిందని కేకలు వేయాలి. వారిని వేలెత్తి చూపాలి. మనలో ఎంత మిగిలి ఉందోనన్న నిజం చెప్పకుండా దాచి ఉంచాలి. మనం రక్షింపబడాలి. తప్పులు ఎన్ని చేసినా క్షేమంగా ఉండాలి. మ నం భద్ర పురుషులం. ఉన్నత సామాజిక కులం.
ఎనభై ఏళ్ల సలమని బరిక్ గూడ్స్‌ని ఎందుకు గుద్దుకోవా లి. ఎంత అనాగరికం. ఆమె పట్టాలు దాటుతూ ఇక దాటలేక ఆకలితో సొమ్మసిల్లిందా? లేదా భద్రసమాజం తన ఆకలిని ఇక తీర్చలేదని ప్రభుత్వం తనలాంటి వారికి ఉచిత మరణంగా రైలుపట్టాలు నిర్మించిందని ఆత్మహత్య చేసుకుందా? లేదా మూత్రశాలలు లేకపోవడం మాటుకోసం పట్టాలు ఎక్కిందా. ఆ మూల పట్టాలపై తన అర్ధనగ్న ముసలి దేహా న్ని ఎవరూ చూడకుండా మూత్రశాలని చేసిందా? జవాబు చెప్పడానికి ఇప్పుడు సలమని లేదు. కానీ ఆలోచించే మనుషులు ఉన్నారని ఆమె జీవించినంత కాలం నమ్మింది. ఆ నమ్మికతోనే బతికింది.
ఇచ్చిన చిన్న సంచిలో శవాన్ని కుక్కకడం కష్టం అని తెలిసినా ఆ కూలీ ఎందుకు ఆ పని చేసాడు. చెప్పింది-చేతిలో లాఠీ, భుజంమీద బందూకు. ఒంటినిండా ఖాకీ డ్రెస్. గొంతు నిండా అధికార స్వరం నిండిన పోలీసు. మరి వాడు సంచిని శవం పొడవు సాగదీయలేడు అందుకే శవాన్ని న డుంనుండి వంచక తప్పలేదు. అది వాడి తప్పా. అంత పొడవున్న శవం తప్పా. ఒక స్ర్తి శవంపై పాత బట్ట కప్పలేని వ్యవస్థదా.
ఆలస్యం కాకుండా గూడ్స్ రైలుని ఆపకుండా పంచనామా జరక్కుండా చూసిన మహా ఘనత వహించిన రైల్వే శాఖదా. ఈ మరణం వార్త కాకపోయి ఉంటే అందరూ మ హానుభావులే. మానవత్వ పరిమళం సజీవంగా ఉంచిన మ హోన్నతులే.
రైలు కిందపడిన శవాన్ని అధికారికంగా ఎవరు ఏ శాఖవారు తీసుకెళ్లాల్సివుంది. ఎవరి బాధ్యత అన్న కోణంలో ఆలోచించకపోతే ఒక్క కూలీవాడిదే తప్పు. ఎందుకంటే న యాపైస కూడా ఇవ్వకున్నా మనిషి బాధ్యతగా శవాన్ని రెం డు కిలోమీటర్లు దూరం మోసినందుకు వాడు దోషి. ఈ ఘటనపై ఇచ్చే నివేదికలో వాడు ఒక నేరస్థుడు. నేరం ఎవరు చేసారు దానికి సమూలంగా బాధ్యత వహించాల్సిన అధికారి ఎవరు? అనే కోణం ఎపుడూ మిస్సింగే.మనకు తప్పక అనిపించాలి. ఈ రెండు సంఘటనల్లో మరణించింది మా త్రం ప్రభుత్వ యంత్రాంగం. మనిషిలోని మానవత్వం కా దు. అరవై కిలోమీటర్లు శవాన్ని భుజంపై వేసుకున్న దానా మాంఝీ మనిషే. పది కిలోమీటర్లు చచ్చిన అమ్మ వెనకా, శవాన్ని మోస్తున్న తండ్రి వెనకాల ఏడుస్తూ నడిచి వచ్చిన చిన్నారి కొడుకు రవీంద్ర బరిక్ మనిషే. మానవీయ సంబంధాలకి వారు అపురూప ప్రతీకలు ఇక్కడ దోషి ప్రభుత్వం. దాని ప్రధాన అంగం ఆరోగ్య శాఖ అధికార యంత్రాంగం.
నిజానికి ఈ రెండు చావుల వెనుక సిగ్గుతో తలదించాల్సింది పాలకులు. పాలకవర్గం, ప్రభుత్వ యంత్రాంగంలో మానవీయ కోణం అంతరించింది. న్యాయ వ్యవస్థ, మానవ హక్కుల కమిషన్ నిజంగా నివేదిక ఇమ్మని ఎవరిని అడగాలి? దానామంజీని. రవీంద్ర బంద్‌ని. ఆ రైలు కూలీని. దారంటా ఏమీ చేయలేక కన్నీరు కార్చిన మనుషుల్ని.