తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

సామాజిక శాస్త్రాన్ని కవిత్వీకరించిన జోగు అంజయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వం ఒక జీవ సామాజిక శాస్త్రం. అవసరానుగుణంగా అది ఎన్నో ఆకారాలెత్తుతుంది. దానికి గుణం, దృష్టి, ఆత్మ ఒక వైపు, శైలి, వ్యక్తీకరణ మరోవైపు రక్షణ వలయంగా నిలుస్తాయి. ఈ రెంటిలో ఏది బలహీనమైనా మరొకటి జాగిలపడుతుంది. కవిత్వ దార్ధ్యత ఈ రెంటి కలయికలోంచి ఉత్పన్నం అవుతుంది.
అవతరించిన తెలంగాణ రాష్ట్రం భౌగోళికం కాదు. అది నూతన కవిత్వానికి, కళకి, సంస్కృతికి పురుటిగుడ్డ. అమ్మ ఒడి. గత కాలపు విలక్షణతలోంచి ఎదిగి, నిటారుగా నిలిచి పిలుస్తున్నది. ఆదినుండి అది జనం నిలిపిన జలతారు ఛత్రం. పాలకుల నీడ పడని విలక్షణ సంప్రదాయం. ఒక పాలకుర్తి సోమన కావచ్చు. ఒక పోతన కావచ్చు. ప్రజాప్రతిఘటన బాటలో వెలసిన తిరుగుబాటు వీరుల వీర గాథాచక్రాలు వినిపిస్తూనే ఉంటాయి.
జాజిరి జాజిరి జాజిరి పాపా అనే పాట కావచ్చు. బండెనుక బండి కట్టి పాట కావచ్చు. మొన్నటి సుద్దాల కావచ్చు. నిన్నటి కాళోజి, గద్దర్‌లు కావచ్చు. ఈనాటి అందెశ్రీ కావచ్చు. ప్రజల దిక్కు నిలిచిన విల్లమ్ములు వీళ్ళు. ఈ సంప్రదాయం ఇంకా, మరింత మొనదేరుతూ ఆలోచింపజేస్తున్నది. అవి ధ్వనులు కావచ్చు. అక్షరాలు కావచ్చు. అత్యాధునిక వచన ప్రక్రియ కావచ్చు. ప్రక్రియ ఏదైతేనేం. పాట, గేయం, వీరగాథ, గాన ప్రదర్శన, కథాగానం .. పేరు ఏమైతేనేం. ఏదైతేనేం... ఐదేళ్ళ క్రితం కలాన్ని, గళాన్ని ప్రజలకు అంకితం చేసిన జోగు అంజయ్య ఒకడు. ఐదేళ్ళలో మూడు కవితా సంకలనాలతో నిటారుగా, నిర్ధిష్టంగా తన లక్ష్యం ప్రకటిస్తూ నిలబడ్డాడు. కవిత్వంలో తన స్థానం ఏమిటని ప్రశ్నిస్తున్నాడు. గత దశాబ్దపు తెలంగాణా జ్ఘశజూఒష్ఘఔళ ని అంజయ్య తన కవిత్వంగా మార్చాడు. అతనిది గలగల శబ్దం కాదు. కుండపోత వలపోత కాదు. అతనిది ష్యశ్పజశషజశ ఔ్యళఆక. అల్లరి కవిత్వం కాధు. అలజడి ఎక్కడా ఉం డదు. కానీ చదివిన పాఠకుడు మాత్రం స్థిమితంగా ఉండడు. అది గ్యారెంటీ. గొడవ కనుపించని భాష. క విత్వం రాయడం కోసం రాసే శైలి కాదు. సాదాసీదాగా, బక్కపలచని చేతులు, పుల్లల్లాంటి వేళ్ళ మధ్య అతి సాధారణ కలం. దానిని పట్టుకున్న వేళ్ళలో సడలని ‘పట్టు’. ఒక స్థిరత. భావాన్ని బలంగా చెప్పగల సమర్థత. తనకితాను నిమిత్తమాత్రంగా కనుపించడం ఒక అనివార్యతనా? అవసరమా? క విత్వ గుణమా? లేక నైజమా? ఆలోచించాలి.
తెలంగాణ కవులు, వారి కవిత్వం చాలా పాళ్ళు ఇలాగే కనుపిస్తుంది. ఇది ఒక ప్రత్యేక గుణం. తీసుకునే వస్తువు తీవ్రమైనదైనా పాఠకుడికి అందించడానికి, అవగతం చేయించడానికి ఎన్నుకున్న శైలి విలక్షణమైనది. డ్ఘౄ జఒ ఇళ్ఘఖఆక అంటారు. డజౄఔళషజఆక జఒ ళ్ఘఆ అని కూఢా అంటారు. సా దాసీదాతనానికి తళతళ లాడటం నేర్పిస్తే ఎలా ఉంటుందో అతని కవిత్వం అలా మెరుస్తుంది. నిజానికి అది మెరుపు కాదు. సామాన్యమైన కవిత్వ శైలి (-్యళఆజష ష్ఘూచిఆ) అతనిది.
కవిత్వ శైలి అనగానే డాంబికత అని అనుకుంటారు. చాలామంది కవుల కవితలో డాంబికత ఎక్కువ. మొదటిసారి చూడ్డానికి ఆ డాంబికత అబ్బో..! అనిపిస్తుంది. ఆ తరువాత తిరిగి చదువుతూపోతే అది కవిత్వం కాదనిపిస్తుంది. నినాదమై భయపెడుతుంది. దృశ్యాలకు దృశ్యాలు చరణాలుగా పేర్చుకుంటూ కవిత్వంలో కవే కనుపిస్తాడు చాలాచోట్ల. కవిత్వం మరుగునపడి కవి కనబడితే దానిని ఏమనాలి. వర్తమాన తెలుగు కవిత్వంలో కవులే కనుపిస్తున్నారు. ఈ కవులలో ఉన్నత, ఉన్నత మధ్యతరగతి పాలక కులాలకు చెందినవారే ఎక్కువ. వాళ్ళ పుస్తకం చేతులో పట్టుకుని చూసినా ఇట్టే తెలసిపోతుంది. వాళ్ళకు వచ్చే పురస్కారాలను, ఇన్‌స్టంట్ కీర్తిని చూసినా కవి పేరుమీదే చెలామణి అవుతున్నారు. కవిత్వ పుస్తకం గుర్తురాదు- కవే గుర్తొస్తాడు. రాజకీయ నాయకునిలాగే కవి మారిపోయాడు. వీరికే అన్నిచోట్ల గుర్తింపులు. నిజానికి ‘గుర్తింపు ’ కవిత్వంలో ప్రస్తావించిన అంశాలకి, వస్తువుకి దక్కాలి. ఆ అంశాల ప్రేరణ పాఠకుడిని విచలితుడిని చేయాలి. అలాంటి కవిత్వం ఎప్పుడూ తక్కువపాళ్ళే వస్తుంది. ఎక్కువ మొత్తంలో పైకి కనుపించేది ఇలాంటి కవులే, వారి కవితా సంకలనాలే.
వీటికి భిన్నంగా సాఫీగా, సూఫీగా కవితాత్మకత అల్లకం కానరావడం లేదు. కవిత్వాన్ని చెరపట్టడంలా కాకుండా దానిని సమగౌరవంతో సమ్మానించాలి. కంటికి, చెవికి ఆ కవిత్వం సుస్పష్టం కావాలి. ఆనాటి గాథాసప్తశతి, చైనా, జపాన్ హైకూలు, దేశవిదేశాల జానపద గీతాలు, సూఫీతత్వ గీతాలు, వేమనలు, జాంబ పురాణాల కవిత్వం వింటే కవిత్వం ఇట్టే తెలిసిపోతుంది. పదే పదే అందులో సంలీనం కావాలని అనిపించాలి. అది మన చుట్టూరా నిశ్శబ్దంగా మోహరించాలి. ఒక అమ్మ ప్రేమలా మనల్ని ఆవరించాలి. అదీ కవిత్వం. అలాంటి కవిత్వం అంజయ్య రాసిన కవిత్వంలో కనుపిస్తుంది.
‘ముఖారవిందం’ సంకలనానికి ముందుమాట రాస్తున్నప్పటికీ, అంజయ్య రాసిన- ‘పల్లేలన్ని మల్లేలాయే’! ఉద్యమ పాటల్ని (2011), కంటి పాప కలగన్నది! (2012) కవితా సంకలనాన్ని ఆధారం చేసుకునే రాస్తున్నాను. ఎందుకంటే అంజయ్య పాటకవి, గేయకవి, అత్యాధునిక వచన ప్రక్రియ కవి. పాట, గేయం పర్యాయ పదం. తెలుగులో మాత్రాఛందస్సులో గురజాడ నుండి లిఖిత రూపంలో మొదలైంది. వివిధ కాలాలలో భావ కవిత్వం (దేవులపల్లి), అభ్యుదయ కవిత్వం (శ్రీశ్రీ) సినీ కవిత (ఆరుద్ర, ఆత్రేయ), వీటిలో దేనికీ చెందకుండా సినారె (నాగార్జునసాగరం వంటి కావ్యాలు) వంటి వారెందరో రాశారు. కాళోజి గేయానే్న ప్రధానం చేసుకుని ‘నా గొడవ’ వరస కవితా సంకలనాలు వెలువరించాడు. ఆ కోవలో ఇప్పుడు అంజయ్య గేయాలు అల్లుతున్నాడు.
వచన కవితలో గేయం నడక, పాటల్లో గేయం వరస లేకుండా ఉండదు. గానయోగ్య గేయం కాకుండా పఠనయోగ్య గేయం అతనికి ఇష్టం. వచన కవితలో సైన్యం గీతచ్ఛాయాలు కనపడతాయి. వెరసి ‘గీతం’ కేంద్రం కాగా అతని కవిత్వం నడుస్తుంది. అతని కవిత్వంలో సెలయేటి గలగలలో నింపుకున్న తళుకుల జాబిల్లి కనుపిస్తుంది. ఎర్రని ఉదయ కాంతులు అలుముకున్న అక్షరాలు కనుపిస్తాయి. ‘ఎర్రమనసు చిన్నబోయింది’ కవితలో వామపక్షం ఎదగక పోవడానికి గల కారణాల గురించి చేసిన ఆలోచనలు సైతం విడమరిచి సుస్పష్టం చేసే విలక్షణ ‘రీతి’ కనుపిస్తుంది.
డెబ్బై ఏళ్ళు గడిచినా / ఏడు పాయలుగా / చీలిపోయింది గాని / జీవ నదిగా మారలేకపోయింది / ఐక్యంగా ఉండలేకపోయింది / అభిమానంగల ప్రజల / ఎదురు చూపులకు/ అర్థం మారినట్లు అయ్యింది. - అని చాలా మామూలుగా రాజకీయ విమర్శ పెట్టాడు. చీలికలే గాని ఐక్యతకు దారి పరచలేని వామపక్షాలు శ్రమజీవి వర్గాలను ఎలా ఐక్యం చేయగలవు? వివిధ ప్రజా సమూహాలను సమిష్టి శక్తిచేయలేకపోతే పాలకవర్గాలను, ప్రభు త్యాగాలను ఎలా ఎదుర్కోగలవని బాధనీ చేశాడు.. బాధ వేదన కాకూడదు. వేదన నిర్వీర్యతకు మారుపేరు.
షరతులు పెట్టుకున్న
సిద్ధాంతము
చదలు పట్టిన తీరుగ
మారుతుందని
కాలానుగుణంగా మార్పులు చేసుకుంటే
మరో చరిత్ర సృష్టిస్తుందని
ప్రజలు చెబుతున్నారు
విశ్వసిస్తున్నారు.
-అని ఒక రిపోర్టర్‌లా కవిత్వం చెప్పే పద్ధతి. ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఆధికారికంగా చెప్పడం. ఇది కవి అనుసరించిన టెక్నిక్. ఈ విధానమే అతని చాలా కవితల్లో కనుపిస్తుంది. దీనిని శైలి అనలేం. కాని ఒక సాహిత్య సాంకేతిక ఏర్పాటు. హెచ్చుతగ్గుల వాదం ఆ దేవుడు సృష్టించింది కాదు. మనుషులు పన్నిన కుట్ర. ఆ మనుషుల్ని సంహరించడం అంటే వర్గ శత్రు నిర్మూలనే. దుష్టశక్తుల్ని సంహరించడాన్ని మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అంగీకరిస్తాయి. అయినప్పుడు వర్గ శత్రు నిర్మూలనకు ఆయుధం ప్రయోగిస్తే తప్పుకాదేమో అంటాడు. ఏది అన్నా అతను అనీ అననట్లుగా అంటాడు. అదే కదా కవిత్వం చేయవలసింది. ‘కంటి పాప కలగన్నది’ సంకలనంలో ప్రారంభ పేజీలో చేసిన కవితా ప్రకటన కూడా ౄజజూ గా అనిపించినా అది ఎంతో తీజజూగా కనుపిస్తుంది. ‘ఓట్ల పడుగు’ కవిత చివరి చరణం-
ఓ నా దేశమా/ కాపాడు నా ప్రజలను/ వేటాడుము ద్రోహులను అని రాశాడు. మొదటి రెండు చరణాలలో మూడు, మూడు పదాలు, మూడో చరణంలో రెండు పదాలతో తన మనసులో సుళ్ళు తిరుగుతున్న సమస్యకు పరిష్కారం ఇచ్చాడు. ‘ఆసుపత్రి నిద్రలో’ కవితలో ఆరు చరణాలలో అమోఘమైన భావాలను వ్యక్తీకరించాడు-
ప్రైవేటు పెద్దదై / సర్కారు చిన్నదై / రోగం మొండిదై / సేవలు తక్కువై / శ్రేయోరాజ్యం చేదెక్కింది / రాజ్యాధికారం రాచపుండైంది.. అనే ఘాటైన వస్తువుని సాదా భాషలో, కవితాత్మక చరణాలలో నింపి అసాధారణ కవిత చేశాడు. ప్రజల పట్ల ప్రేమ, రాజకీయాల పట్ల కోపం, సమాజపు అచేతన పట్ల ఆగ్రహం కలిగిన అంజన్నకు రాబోయే కవిత్వ చరిత్ర స్వాగతం పలుకుతున్నది.
మలి దశ పోరాట కాలంలో సంఘటిత పోరాటాల ఆవశ్యకతని గుర్తించి ‘జనగామ రచయితల సంఘం’ ఏర్పాటు అయ్యింది. దానికి వ్యవస్థాపక కార్యదర్శిగా ఉంటూ రాయడం, చదవడం, ప్రచురణలు తేవడం, కవి సమ్మేళనాలు, సాహిత్య సభలు ఏర్పాటుచేయడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ తీరిక దొరికినప్పుడల్లా మరిచిపోకుండా రాస్తున్నాడు. రాయడం కోసం ఆ పనులన్నింటిని మూసివేయడం లేదు. అందుకే జిల్లాల ఏర్పాటు పట్టికలోంచి జనగామని తీసివేసినందుకు జరసం తరఫున ఎన్నో ఉద్యమాలు చేశాడు. సుమారు ఏడాదిపాటు పోలీసులు 144 సెక్షన్ ఏర్పాటుచేశారు. జరసం అధ్యక్షుడు రత్నాకర్‌రెడ్డిని అరెస్ట్‌చేసినప్పుడు జోగు అంజయ్య నిర్వహించిన పాత్ర మరిచిపోలేనిది. ఆ సందర్భంగా కవితలు, వ్యాసాలు రా శాడు. ఉపన్యాసాలు ఇచ్చాడు. రాజకీయ నేతలతో కలసి ప్రజాఉద్యమాన్ని నడిపాడు. రోజూ వందలాది ఎస్సెమెస్స్‌లు ఇస్తూ జనగామలో అమలవుతున్న నిర్బంధ నిషేధాజ్ఞలను లోకం దృష్టికి తీసుకువచ్చాడు. తెరవే బాధ్యులతో సమావేశం ఏర్పాటుచేయడంలో కీలకపాత్ర పోషించాడు. చివరకు అక్షరం గెలిచింది. మిత్రులతో కలసి సాంస్కృతిక చరిత్రని ఆయుధాలుగా చేసి ప్రజల ఆకాంక్షను రాష్ట్రంగా గుర్తించేట్టు చేశాడు. ఇదీ జోగు అంజయ్య చేసిన పోరాటం. అందుకే అతను సృష్టించిన అక్షరాలు అంతకన్నా వేరేగా ఉండలేవు. అలాగే అతని కవిత్వం. అలాంటి కవిత్వానికి అభినందనలు తెలుపుతున్నాను.
సజీవ సమాజంలో భాగమైన కలం అజీవ కవిత్వాన్ని రాయలేదు. సమాజ శాస్త్రాన్ని నిత్యం ఔపోషన పట్టేవాడు - దాన్ని మార్చడానికి అర్హుడు. అంజయ్య నిత్యం అందుకు పనికివచ్చే సాధనం!
*

-జయధీర్ తిరుమలరావు సెల్ : 9951942242