తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

మంధుల షాపుల్ని మూయించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య మెడికల్ షాపులలో మందుల అమ్మకాలపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వాలు రూపొందించే మందుల విక్రయ విధానంలో ప్రజలు (కొనుగోలుదారులు) ఉన్నారన్న విజ్ఞత కానరావడం లే దు. ఎవరికివారే తమతమ ప్రయోజనాలకోసం కొత్తకొత్త నిబంధనలు రూపొందిస్తున్నారు. ఈ నిబంధనల వల్ల ప్రజలపై ఎలాంటి ప్రభావం పడుతుందనే ఆలోచన చేయడం లేదు. ఈ ఆలోచనతో మందుల విక్రయాల గురించి ఈ వారం నాలుగు మాటలు.
గతకాలపు చట్టాలను ఒక్కసారిగా మార్చి ఈనాటి సాంకేతికతకి అనువర్తింపచేసి ‘అభివృద్ధి’ వైపు అడుగులు వేస్తున్నామని చెప్పుకుంటున్నాం. అలా అనాలోచితంగా చర్యలకు పాలుపడుతున్నాం. దీనివల్ల ఒక రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజలు- ఊరుకాని ఊళ్లల్లో, పల్లె అని చెప్పుకోలేని మారుమూల పల్లెల్లో జీవించే ప్రజలను దృష్టిలో పెట్టుకోకుండా ఉన్నత, మధ్యతరగతి, సంపన్న వర్గాల జీవన శైలికి తగిన విధంగా చట్టాలలో మార్పులు తీసుకురావాలి అనుకోవడంలో అవివేకత దాగి ఉంది. దానిని కప్పిపుచ్చడానికి నియమ నిబంధనల పేరుతో అణచివేత అస్త్రంగా చేసుకొంటున్నది యంత్రాంగం. ఇది సరికాదు. 1940 నాటి కాలమాన పరిస్థితులను బట్టి రూపొందించిన రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ (ఆర్.పి) చట్టం ప్రకారం మందులు అమ్మాలని నిబంధన ఉన్నది.
ఆనాడు మందుల పొట్లాలు కట్టి, సరిపాళ్ళలో మందులు కలిపి రోగులకు ఇచ్చేవారు. వీరినే ‘కాంపౌండర్స్’ అనేవారు. చాలామంది కాంపౌండర్లు డాక్టర్లవద్ద తర్ఫీదు పొందేవారు. ఐదేళ్ళ అనుభవం ఉంటే సరిపోయేది. చాలా దశాబ్దాలు ఫార్మసిస్టు ప్రశే్న ఉత్పన్నం కాలేదు. ఫార్మసిస్టు మందుల తయారీ కంపెనీలోనే అవసరం. నిజానికి అక్కడ ఉన్నారా? కంపెనీలు ఎన్ని మందులు తయారుచేస్తున్నాయ? ఎంతమంది ఫార్మసిస్టులు పనిచేస్తున్నారు? వారందరూ శాస్ర్తియంగా, విద్యలో, జ్ఞానంలో ఫార్మసిస్టులేనా? అని కంపెనీలలో ప్రభుత్వం తనిఖీ చేయాలి. కాని అలా చేయడం లేదు. కానీ డాక్టరు రాసిన చీటీ చూసి మందులు అమ్మే షాపులలో మాత్రం తప్పనిసరిగా ఫార్మసిస్టులు ఉండాలని, లేని పక్షంలో మందుల దుకాణాలను మూసివేస్తామని కొత్త రాష్ట్రంలో ఉత్తర్వులివ్వడం సరైనదేనా? అనేది ప్రశ్న.
నకిలీ విత్తనాలు అమ్మే ఏ ఒక్క నకిలీ విత్తన సంస్థ యాజమాని అరెస్టుకాలేదు. అలాంటి సంస్థ దేనినీ మూసివేయలేదు. అలాగే నకిలీ మందులు, దొంగ లేబుళ్ళు అంటించి అమ్మే కంపెనీలను పట్టుకోలేదు. దొంగ మందుల కంపెనీలతో మిలాఖత్తు అయిన ప్రభుత్వ యంత్రాంగం ప్రజల మరణాలు, అనారోగ్యాల గురించి ఏనాడు దృష్టి సారించలేదు. కాని ఫార్మసిస్టు మాత్రం ఉండాలని ఎందుకు హడావుడి చేస్తున్నది. సరే. ఫార్మసిస్టు ఉండాలనే నిబంధన పెట్టడం, దానిని అమలుచేయడం వరకైతే ఫరవాలేదు. కాని పదినుండి ముప్ఫై రోజుల మందుల షాపులను పట్టుపట్టి మూయించడం ఏమిటి? ఉన్నఫళాన ఈ చిన్న పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాలు ఏమిటి? ఇది ఆలోచించాల్సిన విషయం.
నిజానికి ఔషధ తయారీ, అమ్మకాల రంగం ఎంతో అభివృద్ధి చెందింది. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి జరిగింది. దేశ విదేశాలనుండి ఔషధాల కొనుగోలు జరుగుతోంది. ప్రత్యేక ఆస్పత్రులు నెలకొల్పడం ఇవ్వాళ మామూలైంది. గొలుసుకట్టు ఆస్పత్రుల్ని దేశంలోని పెద్దపెద్ద పట్టణాలలో నిర్మిస్తున్నారు. వాటికి విదేశాల నుండి వైద్యపరీక్ష పరికరాలు, వాటితో పాటుగా అక్కడి వైద్య సేవలు అందుతున్నాయి. అక్కడి నుండి వైద్యులు వచ్చి రోగులను పరీక్షించి వెళ్తున్నారు. ఇక్కడ లభ్యం కాని మందులు అక్కడి నుండి తెప్పించుకుంటున్నారు. గత అర్ధ శతాబ్దంనుండి ఔషధ తయారీ కేంద్రాలు కంపెనీలయ్యాయి. తయారీ కేంద్రాల్లో పరిశోధన, తయారీ విభాగాలు ఉన్నాయి. తయారీలో సురక్షిత ప్యాకింగు, కంపెనీ పేరు, బ్యాచ్ పేరు, తయారీ తేదీ, గడువు తేదీ వంటి ఎన్నో వివరాలు ఉంటాయి. పైగా డాక్టర్ డోసులవారి సూచనలు మందుల చీటీమీద రాస్తాడు. తన పర్యవేక్షణలో వీటిని వాడాలని రోగికి చెబుతాడు. అలాంటి కొత్త విధానంలో మందుల షాపులో ఫార్మసిస్టు అవసరం తగ్గిపోయింది. కాలదోషం పట్టిన ఈ అవసరం మీదే వైద్యశాఖ ఎందుకు పట్టుపడుతుందో తెలియదు.
నిజానికి రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ చట్టం ఆంగ్లేయుల కాలం నాటిది. ఆ చట్టం తుప్పుపట్టిన కత్తి వంటిది. నిజానికి దాని అవసరం ఎంతమాత్రం లేదు. దానివల్ల ప్రస్తుతం భారతదేశంలోని చిన్న, పెద్ద షాపుల అమ్మకాలకి, ప్రజలకి, వైద్యులకి ఏ రూపంలో చూసినా ఫార్మసిస్టు అవసరం లేదు. ఇంటర్ పాసై, ఐదేళ్ళ అనుభవం ఉన్న ఎవరైనా సజావుగా డాక్టర్ చీటీలో రాసిన మందుల్ని ఇవ్వగలరు. డెబ్బై ఏళ్ళ కింది వలస పాలకుల కాపీ చట్టం ఇప్పుడు ఎందుకూ పనికిరాదు. 1969లో అనుభవం ఉన్న ఔషధ విక్రయదారులకే అర్హతగల వ్యక్తి (్ఖ్ఘజచిజళజూ ఔళూఒ్యశ), సఠైన వ్యక్తి (ష్యౄఔజఆళశఆ ఔళూఒ్యశ) ద్వారా అమ్మకాలు జరుపుకునే అనుమతి ఉంటుంది. దానిని పక్కాగా అమలుపరిస్తే సరిపోతుంది. కాని ప్రభుత్వం అలాకాకుండా షాపుల మార్జిన్ తగ్గిస్తూ, ఫార్మసిస్ట్ పర్యవేక్షణ, డాక్టర్ చీటీ తప్పనిసరి వంటి చిన్న చిన్న కారణాల బూచి చూపి షాపులను మూయించాలని ప్రయత్నిస్తున్నది. దీనికి కారణం ఆలోచిస్తే మందుల విక్రయ రంగాన్ని బడా విదేశీ స్వదేశీ బాబుల పరంచేయాలనే లక్ష్యం దాగి ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను ఈ దేశంలోకి ఆహ్వానించడానికి వ్యూహం సిద్ధమైంది. తద్వారా చిన్న, పెద్ద మందుల షాపుల మూసివేత తప్పనిసరి కాగలదు. ఈ షాపులు సజావుగా నడిస్తే గొలుసు షాపుల వర్తకం సాగదు. ఇవ్వాళ ఆస్పత్రులలో విపరీతమైన వైద్య పెట్టుబడి లాభాల కోసమే. సేవాభావం స్థానాన్ని లాభం ఆక్రమించింది. వైద్యరంగం చాలా ముఖ్యమైనది. మనిషి ప్రాణం, జీవితం దానిపై ఆధారపడింది. అందుకే ఆస్పత్రులలో రోగం ఎరగాచూపి, భయభ్రాంతులను చేసి పరీక్షల పేర డబ్బు దండుకోవడం పరిపాటైంది. విపరీతమైన లైసెన్స్‌లేని మందుల తయారీ కేంద్రాలు పెరిగాయి. నకిలీ మందులు, నిషేధ మందులు విచ్చలవిడిగా అమ్ముతుంటే ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. పైగా బహుళ పెట్టుబడుల ఏర్పాటుచేసే కంపెనీలు, విక్రయశాలలు ఇప్పటికే చిన్నాచితక షాపులను మూయించింది. ప్రస్తుతం కొత్తగా మన దేశంలో ఆన్‌లైన్ మందుల విక్రయాలని ప్రోత్సహిస్తున్నది. బడా కంపెనీల ప్రాపకంలో జరిగే ఈ విక్రయాల మతలబులను యం త్రాంగం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
అమెరికాలో ఉన్న య్యజూ ఘశజూ ఖ జూౄజశజఒఆ్ఘఆజ్యశ () వలె మన ధేశంలో ఒక జాతీయ లేదా రాష్టస్థ్రాయిలో సంస్థలు లేకపోవడం వల్ల ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అమెరికాలో ప్రతిరోజు ఎఫ్‌డిఎ నకిలీ మందుల అమ్మకాలను నిలవరించే కార్యక్రమాలు చేబడుతోంది. దోషులను శిక్షించే చట్టాలను రూపొందిస్తున్నది. రోగులను డిస్కౌంట్లతో ఆకర్షించే వెబ్‌సైట్లని తప్పుపడుతున్నది. మందుల అమ్మకాలలో అవినీతికి పాల్పడుతున్న గ్యఖళ తీళఇఒజఆళఒ (ఫోకిరీ వెబ్‌సైట్లని) గురించి ప్రజలలో చైతన్యం తెస్తోంది. అభివృద్ధి చెందిన అమెరికాలోనే ఆన్‌లైన్ మందుల అమ్మకాలలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్లు ఎఫ్‌డిఎ తన సైట్లో నిరంతరం ప్రజలకు తెలియచేస్తున్నది. చట్టబద్ధం కాని ఆన్‌లైన్ ఫార్మసీ షాపులలో కొనుగోలు చేయవద్దని పౌరులను హెచ్చరించింది. కొన్ని సంస్థల మీద చట్టపరంగా చర్యలు తీసుకుంది.
మందుల విక్రయ సంస్థలు తమ గురించి తాము ఎంతో చట్టబద్ధత కలిగి ఉన్నామనే రీతిలో సమాచారం ఇస్తాయి. వీటన్నింటిని నమ్మవద్దని, వాటి పట్ల ఆచితూచి కొనాలని తెలిపింది. ఈ ఆన్‌లైన్ మందుల షాపులవారు కొందరు అదే పనిగా రోగులను ఫోను సంభాషణలోకి దింపి వారి క్రెడిట్‌కార్డు, బ్యాంకుల వివరాలు తెలుసుకుని మోసానికి పాల్పడుతుంటాయి. కేన్సర్ చికిత్స పేరిట నకిలీ మందులు అమ్మే ప్రకటనలు వేలాది ఆన్‌లైన్ మందుల విక్రయ సంస్థలు తమ సైట్లలో పెట్టాయి. ఈ వ్యాపారంలో రోగులు, వినియోగదారులు ఎన్నో కనబడని అపాయాలు (్దజజూజూళశ జఒరీఒ) ఎదుర్కొంటున్నారు. వివిధ సంస్థలు విదేశాలనుండి మార్మిక మందుల పేరుతో, దేశీ చికిత్సా విధానాల పేరుతో, త్వరితగతి చికిత్సలు ఉంటాయని ఇచ్చే భారీ ప్రకటనల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. డబ్బు నష్టపోతున్నారు. ప్రత్యామ్నాయ ఆహారం (జూజళఆ్ఘక ఒఖఔఔజౄళశఆఒ) పేరుతో అమ్మిన వైద్య పదార్థాలు, మందులు అనర్థాలకు దారితీస్తున్నాయని అమెరికా ప్రభుత్వం గుర్తించింది. ఎలాంటి నియంత్రణ లేని మన దేశంలో ఇంకా ఎక్కువ సమస్యలు ఎదుర్కోక తప్పదు. అవినీతికి అడ్డుకట్టవేయలేని యంత్రాంగం వీటిపట్ల ప్రేక్షక పాత్ర వహించక తప్పదు. ముందుగా లక్షలాది మందుల షాపులను మూసివేసే దిశగా చర్యలు ఆపేయాలి. అంతేకాదు, ఆన్‌లైన్ మందుల విక్రయాలపై నిఘా పెంచాలి. అధిక ధరలను అరికట్టి ప్రజల పక్షం వహించి ప్రభుత్వం, వైద్యశాఖలు పనిచేయవలసి ఉంటుంది. మరింత అనారోగ్యకరమైన పరిస్థితులు ఏర్పడకముందే జాగరూకత అవసరం. ఏ విధానంలోనైనా ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా చూడాలి. ఇలాంటి సరికొత్త సమస్యలపై మాట్లాడేవారు తగ్గిపోయారు. ఉన్నవారిలో హైదరాబాద్‌లోని గుండూరం వేణు గోపాలరావు (సెల్: 9246332558) చట్టాల గురించి పోరాటం చేస్తున్నారు. ఎంతో సమాచారం సేకరించి రచనలు చేస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పనిచేసే ప్రజాతంత్ర వాదులు ఈ విషయంపై మాట్లాడాలి. తప్పదు. *

-జయధీర్ తిరుమలరావు jayadhirtr@gmail.com సెల్ : 9951942242