తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ధర్మాన్ని విస్మరిస్తే కవిత్వం వెక్కిరిస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి కవిత ప్రపంచాన్ని కొత్తగా ఊహింపచేస్తుంది. మెరుగు దిద్దుతుంది. అలాంటి కొత్త కవిత అద్దబడినప్పుడల్లా లోకం పూర్వంలా ఉండదు అంటాడు డిలాన్ థామస్. అంటే కవి ఒక కొత్త పళూఒజ్యశ, చిళళజశ ఒజదఆ ఇస్తాఢు. అందుకే కవిత్వానికి అంత గౌరవం. అంతకన్నా ఎక్కువ అనాదరం.
గౌరవం ఎందుకంటే, కవి తన ‘అక్షర ఉత్పత్తి’లో గుర్తింపు, సన్మానం కోరుంటాడు. ప్రతిభావ్యుత్పత్తులుగలవాడికి కీర్తి దానంతట అదే వస్తుంది. అవి తక్కువగా ఉన్నవాడు వాటి కోసం నిరంతరం ప్రయత్నిస్తాడు. అందుకోసం డబ్బున్నవాడి దగ్గరకు, రాజు దగ్గరకు, రాజ్యంలోని అధికారం వైపు పోతుంటాడు. పల్లకీల నుండి, గండబేరుండాల నుండి, ఆస్థాన పదవుల నుండి ఆర్థిక లబ్దికి క్రమంగా చేరువవుతున్నాడు. ఆ రకంగా పేరు ప్రఖ్యాతుల కోసం తన గౌరవాన్ని పణంగా పెడుతున్నాడు. వాటిని చూసి అలాంటి అర్భక కవులు అదేమార్గం పడుతుంటారు. అందుకే అనాదరం.
నిజంగానే ప్రతిభగల కవిని సమాజం ఎప్పుడూ ఆదరిస్తుంది. అలా అతనికి కీర్తి వస్తుంది. అతనిలానే తమకి కీర్తిప్రతిష్ఠలు కావాలని ఆశించేవారు ఎందరో, డబ్బున్నవాడు అప్పుడే కలంపట్టి, మరునాటికే పుస్తకం వేసి, వారం రోజుల్లో పురస్కారం అందుకునే కవులూ కొందరు ఉన్నారు. బీదవర్గాలవారు ఇలాంటి వారిని చూసి తమకూ అలాంటి గుర్తింపు రావాలని ఆశించి ప్రభుత్వ వర్గాల మోచేతి కింద దిగబడుతున్నారు.
నిజానికి ‘కవిత్వం’ శక్తిమంతమైన ప్రక్రియ. అందులో లయ రూపంలో సంగీతం మిళితమై ఉంటుంది. భావ చిత్రణ వర్ణచిత్రం అవుతుంది. కొన్ని కవితల్లో అది స్పష్టమైన ఫొటోగ్రాఫ్. ఐతే ప్రతి కవిత, కవి తన ఆటోగ్రాఫ్‌లాగే ఉండాలనుకుంటాడు. కాని కవిత్వ వ్యవస్థ, పాఠక లోకం కవిలాగే ఆలోచించదు. తనకు కావలసిన రీతిలో స్వీకరిస్తుంది. ఈ రెంటి మధ్య విమర్శకుడు తన పాత్ర తాను పోషిస్తుంటాడు. కవి ఒక్కడే. విమర్శకుడు నిరంతరం. అనేకం. పాఠకలోకం మారుతున్నా, వారిలో నిక్షిప్తమైన గుణాలు తరం నుండి మరో తరానికి అందుతుంటాయి. వర్ణవర్గకుల పునాదిగల భారతదేశంలో కొంతమంది పాలకవర్గ కవులకి ప్రాధాన్యత, కొన్ని రచనలకు కీర్తి లభిస్తుంటుంది. ఈ కీర్తిని, ప్రగతిశీల, ప్రజాదృక్పథం గల రచయితలు కూడా ‘రాజ్యం’ స్వభావం అర్థం చేసుకోవడంలో విఫలమై ఆ విగ్రహాలను మోస్తుంటారు. ఒక నాజర్, సుంకర, సుద్దాల, జాషువా, శివసాగర్, గద్దర్, వంగపండు వంటి కవులని పక్కన పెడుతుంటారు. ఈ వర్గాలకి చెందిన వారికన్నా ఉన్నతవర్గాలవారిని తలపై పెట్టుకుంటారు. కానీ అశేష శ్రోతగణం, పాఠకవర్గం అభిలాష వేరు. తమ గురించి రాసిన వారి కోసం తాపత్రయ పడతారు. కవి కూడా చీకటి కోణాల గురించి, అణచివేసిన సమాజ పొరల్లోని ఆర్తనాదాల గురించి రాయాలని చూస్తాడు. ఎవరికైతే ‘స్వరం’ లేదో వాళ్ల గురించి తన కలం ద్వారా నినదిస్తాడు.
కవిత, కవితలను నివేదికలుగా చేసి ప్రపంచానికి వినిపిస్తాడు. అందుకే ఇలాంటి కవితల్ని నిశ్శబ్ద ఛేదనలుగా గుర్తించాలి. స్తబ్దత అంతరాయ ప్రకటనగానే ఆ కవితల్ని చూడాలి. ఈ కదలికలు, స్వర ఛేదనల భాష ప్రజలకి ఏదో ఓ రూపంలో నిరంతరం అందుతూనే ఉంటుంది. అలాంటి ఒక కొనసాగింపే ‘అగ్నిశిఖ’ అక్షర భగభగలు. ఒక దశాబ్ద కాలంలో అగ్గి కాగడాపై అక్షరాలని వెలిగించి రాబోయే కాలానికి అందించే కొనసాగింపైనాయి అతని కవితలు.
కటుకోఝ్వల రమేష్ తన వంతుగా నూటొక్క కవితల్ని తన పాఠకులకి మొదటి కవితా సంపుటిగా అందిస్తున్నాడు. దశాబ్దాలుగా రాస్తున్న వందలాది కవితల్లోంచి ఏరిన నూరు కవితల్ని ఒకచోట ఇవ్వాళ చేర్చడానికి కారణం. ఏమిటి? తన కవితలు ఎవరి కోసమైతే రాశాడో ఆ ప్రజలకి ‘ఇవ్వాళే’ అందించాలనే సంకల్పం ఎందుకు కలిగింది. ఉండుండి సంకలనం తేవడానికి ఏదో కారణం ఉండి ఉంటుంది. ఆ సంకలనాన్ని సమాజంలో స్తబ్దత ఆవరించుకున్న కాలంలో ‘అగ్నిశిఖ’ అని పేరు పెట్టి, మొదటి కవితగా దానికి స్థానమిచ్చి, అన్ని పేజీలలో, పేజీల అక్షరాలలో, భావాలలో, భావనలో వాడీవేడీ రగిలించడానికి సిద్ధమయ్యాడు. కొత్తగా కవిత రాయడం కాదు. రాసిన కవితల్ని అమ్ముల పొదిలోంచి తీసి దానిని పుస్తక ఆయుధంగా రూపొందించాడు. అందుకే ఇలా అన్నాడు.
పుస్తకం హస్త్భూషణం కాదనీ/ మస్తిష్కానికి నేస్తమనీ
కలాలు గర్జించేవరకు / కవిత్వ బలాలు శాసించే వరకు
నిరంతరం/ పాటై పల్లవిద్దాం
మాటై ముచ్చట పెడదాం / ఆటై అల్లరి చేద్దాం
మనసున మనసై ఘార్ణిల్లటానికి
మనిషిని మనిషిగా పూర్ణించడానికి..
... ...
సొరగుల్లో దాగున్న పుస్తక నేస్తాలతో
కరచాలనం చేద్దాం!
(మనసారా ప్రేమిద్దాం - కవిత)
తనలాగే తన తండ్రి కూడా నిత్యం కవితల్లాంటి ఆభరణాల్ని తయారు చేసి చేసి బతుకు పోరాటంలో అలసిపోయిన దృశ్యం కదలాటను కవిత్వం చేశాడు.
సిరాకు మంటకు / ముఖమంతా ఎర్రబడ్డా
పుస్తల తాడును పేనీ.. పేనీ /
పట్టీలకు గజ్జల్ని అతికీ అతికీ
అస్తమిస్తున్న సూర్యుడయ్యేవాడు - అంటాడు.
కష్టించేవాడు పనికిరాని వాడు. దోచుకునేవాడు ధనికుడు. కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలేవీ అమలు కావడంలేదు. అందుకే ఇప్పుడు జమ్మిచెట్టు మీద దాచిన ‘నాయిన స్మృతులు’ బయటకు తీశాడు.
‘కవిత్వ నావ కావలసిందే’ గేయంలో ఇలా అన్నాడు-
కొన్ని సందర్భాలు
బతుకునంతా ఏకవాక్యం చేస్తుంటాయి
శూన్యం వైపు వేగంగా లాక్కెడతాయి
నిలువెత్తు ధైర్యాన్ని సవాలు చేస్తూ
శిఖండిలా గుచ్చుకుంటూ ఉంటాయి
అప్పుడే గాయాలు గేయాలవ్వాలి!
... ...
ఈ ఆటల పోటుల సంద్రాన్ని
ఆటపాటలతో దాటెయ్యడానికి
నాకూ నీకూ మనందరికీ/ కవిత్వ నావ కావలసిందే!
తన కవిత్వం మీద రమేష్‌కి చాలా నమ్మకం. కవికి అది ఉండాల్సిన తప్పనిసరి గుణం. అది లేకపోతే ఎలాంటి కవిత్వం రాస్తారు? పూర్వ ఆధునికతలోకి దారి తీస్తారు. అక్కడ ఏముంటుంది? ముక్కిన ఇంగువ కట్టిన పాత బట్టల వాసనే. దాన్ని అంటి పెట్టుకున్న దుమ్మూ ధూళిలాంటి పేర్పుల ఛందస్సుల పోరలు. కావ్య భాష సృష్టించిన ఏ తాళం చెవులూ పని చేయని భాష తాళం కప్పలు. అందుకే రమేష్ తన కళ్ల ముందున్న, తాను అనుభవించిన, తాను విభేదించిన, తాను మార్చాలనుకున్న వాటిని ఇతివృత్తం చేసి కవిగా వాటిని అగ్నిశిఖలో కాల్చి మాడ్చి ఒక కొత్త భావనాభరణాల్ని తయారుచేశాడు. వాటిని మనం ఎలా ధరిస్తాం, ఎప్పుడు ఎలా ధరిస్తాం.. అవేవీ ఆలోచించడు. ప్రతి కవిత్వ నగని అగ్నిపునీతం చేసి తాజాగా మనకందిస్తున్నాడు. దానిని ఎలా, ఎంత శక్తిమంతంగా వాడుకోవాలో మన చేతుల్లోనే ఉందంటాడు.
ఈ కవితల్లో సందేహానికి తావులేదు. విచారణాత్మక అనుశీలన నిండుగా ఉంది. వ్యక్తి అనుభవమైన ఆ గుణం అందరి గురించిన ఆవేదన. తన వేదనని సమూహపు స్వభావాన్ని రంగరించడమే రమేష్ తనని తాను విస్తరించుకోవడం. ముడుచుకున్న చేతుల్ని విప్పదీసి ఆలింగనం చేస్తాడు. వీపు మీద కాలిన గాయాలకు మలామా అవుతాడు. నిరాశా నిస్పృహల నుండి అక్షరాలతో తెప్పని చేసి ఆవలి తీరం దాటిస్తాడు.
బాస నీకు దండమే, నా గది గోడకు, ఎవరైనా లైక్ కొట్టండి, మండుతున్న కుంపటి, అక్షరం క్షమించదు బొట్టుపెట్టె వంటి కవితలు. ఒకటికి నాలుగుసార్లు తప్పక చదివించుకునే కవితలు. రమేష్ సమాజంలోని చాలా మంది కవులు తొంగి చూడని బతుకులైన నైట్‌వాచ్‌మన్, మట్టి, తలారి, మగ్గం, గాలిపటం వంటి ఇతివృత్తాల్ని మన ముందుంచుతాడు. అవి మాత్రం మనల్ని అంత త్వరగా వదలవు. ఈ కవి అటు అత్యాధునిక వచనా సంప్రదాయ రూపపు గేయ రీతిని అభిమానిస్తాడు. పక్కపక్కనే రెండు శైలులలో రాసిన గీతాలు పాఠకుడిని యాంత్రిక పఠనం నుండి అప్పుడప్పుడు బయటపడేస్తాయి. గేయ రచనా విధానాన్ని ఎంచుకోవడంలో వచన కవిత రచనా ఆధిపత్యాన్ని తెంచడం కోసమే అనిపిస్తుంది. అట్లని జానపద బాణీల జోలికి పోడు. తన టార్గెట్ పాఠకులే. శ్రోతలు కాదు. ఇంత స్పష్టత ఉన్న కవి. మరి సంకలనం ఎందుకింత ఆలస్యం చేశాడో అర్థంకాదు. మరీ ఏడాదికో రెండు సంకలనాలు వేయమని కాదు. దశాబ్దం పైగా రాస్తున్న పుస్తకం వేయాలన్న ధ్యాస లేకపోవడం ఎందుకో అనిపిస్తుంది. కవితా రచనలో కవిలో దాగి ఉన్న సృజన శక్తికి చిన్నచిన్న కవితల రచన వల్ల పూర్తిగా బయటపడదు. దానికి ఒక పెద్ద కాన్వాస్ కావాలి. అది విస్తృతిలో కావ్యమో, దీర్ఘ కవితో అయితే బాగుంటుంది. ఆ దిశగా ఆలోచనలు సారించవలసి ఉంది.
కవి కవితాగ్ని రగిలించాడు. దానికి కాగడాలు చేయాల్సిన బాధ్యత మనపై పెట్టాడు. కేవలం చదవడంతో సరిపెట్టవద్దని కోరుతున్నాను.

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242