తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

ఓ రేలా.. రేరేల రేలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమ్మక్క సారమ్మ జాతర దగ్గర పడుతోంది. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో ప్రతి రెండేళ్లకోసారి ఫిబ్రవరిలో జరుగుతుంది. ఈసారి జనవరి 31 నుండి ఫిబ్రవరి 2 వరకు నిర్వహిస్తారు. సమ్మక్క సారమ్మలను దేవతలుగా కోయ ప్రజలు కొలుస్తారు. ఈ జాతరకు పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి గిరిజనులు, ఇతర ప్రజలు తండోపతండాలుగా వస్తారు.
కాలినడకన, ఎడ్లబండలో, ఆటోలలో, లారీల్లో, బస్సుల్లో ప్రయాణించి మేడారం చేరుకుంటారు. సుమారు కోటిమంది ఈ జాతరకు హాజరవుతారు. ఇంత పెద్ద జాతర భారతదేశంలో మరొకటి లేదని భావిస్తారు. అలాంటి జాతరలో సమ్మక్కని, సారాలమ్మని వన దేవతలుగా, వీర నారీమణులుగా కొలుస్తారు.
ఐతే చారిత్రక పాత్రలైనప్పటికీ, వీరి గురించి శాసన, గ్రంథ ఆధారాలు ఎక్కడా లభించడం లేదు. కేవలం కోయ పూజారులైన వడ్డెవారు, పట్టెడవారి వౌఖిక కథనాల వల్ల కొంత చరిత్ర తెలుస్తోంది. ఈ కథనాలను ఆధారం చేసుకు కొంతమంది చిన్నచిన్న పుస్తకాలు రాశారు. ఐతే సమ్మక్క సారాలమ్మ కథ క్రమరీతిలో కథ ఇప్పటివరకు ఎవరూ సేకరించ లేదు.
కోయవారికి ‘డోలీ’లు అనే ఉప తెగ (అర్థివారు) కోయ పురాణాలు చెబుతారు. వీరు అతి ప్రాచీనమైన కోయ తెగ బొమ్మలు (చరిత్ర సంకేతాలు) ఉన్న ‘పగిడెలు’ అనే గుడ్డమీద చిత్రించిన బొమ్మలను చూస్తూ కథని చెబుతారు. మణుగూరు దగ్గర ఉన్న సకినం రామచంద్రయ్య చెప్పిన ‘సమ్మక్క సారమ్మ’ కథ ఆధారంగా కొన్ని విషయాలు ఈ వారం మీ ముందుంచుతాను.
సమ్మక్క సారాలమ్మలను తలుచుకుంటూ ‘మా చక్కనివారులే’ అని ప్రారంభమవుతుంది ‘డోలీ’ కథ. ‘కన్నుమూస్తే యుగములే. కన్ను తెరిస్తే యుగములే’ అని కాలాన్ని గణిస్తున్నారు. కోయల ప్రాచీన చరిత్ర ప్రారంభం నుంచి ఈ కథలో పేర్కొనబడే పాత్ర (సమ్మక్క సారమ్మ)ల కాలంతో సమాప్తమవుతుంది. ఆ రెంటి మధ్య గల కాలాన్ని గణించే పదాలుగా వాటిని పేర్కొన్నారు.
ఈ కథ చెప్పేవాడిని కోయల పడిగె అని పిలవబడే డోలివారు. వీరు కోయలకి ఆర్తివారు. వీరిని ఆడబిడ్డలాంటి వారని అంటారు. ఆడబిడ్డను కాపాడుకోవడం కోయజాతి ధర్మం. ఈ డోలి కథ చెప్పే అతని గోత్రం సకినవాడు. లేకపోతే ఈ కథ, పురాణం, గాథ ఉండదు. అని తనకి తానే ప్రకటిస్తాడు కథలో. అది నిజం కూడా. ‘ఇంతకీ.. సమ్మక్క ఎలా, ఎక్కడ పుట్టింది, ఆదిపర్వంలోకి ఎలా వచ్చింది’ అని ప్రశ్న వేసుకొని దానికి జవాబు చెబుతూ కథని వివరించడం డోలి కథన శైలి. ఆ కథా పాఠ్యాన్ని పాడుతూ ప్రదర్శించడం, శ్రోతల తరఫున ప్రశ్న.. అనుమానం లేవనెత్తించి, దానిని వివరిస్తూ కథ చెప్పే శ్ఘ్ఘూఆజ్యశ పద్ధతి వినూత్న విధానంలో సాగుతూ ఉంటుంది.
డోలీలది - నలుగురు లేదా ఆరుగురితో కూడిన బృందం. కాళ్లకు గజ్జలు కట్టుకుని డోలు వాయిస్తూ ప్రధాన కథకుడు పాడుతుంటే, పక్కన ఉన్నవారు వంత పాడుతుంటారు.
‘‘ఓ.. రేలా రేరేలా రేలరేల రేరేలా రేల’’ అంటూ రాగయుక్తంగా పాట అందుకుంటారు. రాత సాహిత్యంలో పేరాగ్రాఫు మారినట్లుగా సుదీర్ఘ కథలో ఒక ఘట్టం నుండి మరో ఘట్టం, ఒక దృశ్యం నుండి మరో దృశ్యానికి మారినట్లు, ఒక చిన్న ఉదంతం నుండి మరో ఉదంతంలోకి పోయినప్పుడు రేలా రేల అనిగాని, ‘అయ్యాలే’, ‘యమ్మాలే’ అని రాగం అందుకుని రాబోయే కథని సూచిస్తారు. ఆ తరువాత పాటలో చెప్పబడిన విషయాలను శ్రోతలకు అర్థం చేయిస్తూ, వివరిస్తూ వచనంలో చెబుతారు. అది రాతవచనం కాదు. గాన వచనం. ఔ్యఒళ జశ ఒజశజశగా ఉంటుంధి.
ఉదాహరణకి:
‘‘అప్పుడు,
పారెడుగట్టు పర్దాను రాజు లగ్గం పెట్టుకుందామని, అప్పుడు, ఏం చేస్తున్నాడ్ (అని) అంటున్నావ్ గద నాయన! ఆహా...!’’ అని పాడుతూ లయాత్మక శైలిలో ఒక రకంగా గానరీతిలోనే వివరిస్తాడు. ఇలాంటి ఒక వాక్యం తరువాత మరో వాక్యం ఉంటుంది. వచనం చివరలో డోలు, గజ్జల మోత శబ్దం మళ్లీ గానంలోకి దారి తీస్తుంది. ప్రధాన కథకుడు చెప్పే వచనం నుండి మొత్తం బృందం ‘ఓ.. రేలా రేరేల రేరేలయ్యో రేలా’ అంటూ కథకి ఒజశ్ఘఆఖూళ ఆఖశళ సంగీత గానంలోకి ధారి తీస్తుంది. బృందంలోని శరీర కదలికలు, కళాకారుల ఆంగిక హావభావాలు శ్రోతలను ఒక ఆ్ఘశషళలోకి తీసుకుపోతాయి.
ప్రధాన కథకుడు పగిడె పటం చూస్తున్నప్పుడే ప్రాచీన సంకేతాల ఆనవాళ్ల ప్రపంచంలోకి వెళ్లిపోతాడు.
కాలనాళికలోకి మనశ్శరీరాలు, ఆత్మలాంటి ఒక శక్తి అందులోకి జారిపోతుంది. ఆ గతపు మార్మిక లోకపు ద్వారాలు దాటుతూ, దానిని అంతరనేత్రాలతో చూస్తూ గానాన్ని వెలువరిస్తూపోతాడు. కోయ దేవతలు, వీరులను ఆవాహన చేస్తూంటాడు. ఇతర కథాంశాల జోలికి పోకుండా నిర్దిష్టమైన కథాచక్రంలోనే నిబద్ధత కలిగిన చరిత్రకారుడిగా పరిభ్రమిస్తుంటాడు. ఒక్కసారి కథలో పడ్డాడంటే అది పూర్తయ్యేవరకు దాని మాయా, భావనాలోక భౌతికత అతడిని వదలదు. మధ్య మధ్య బృంద సభ్యులు, శ్రోతల నుంచి ఎన్ని అవాంతరాలు వచ్చినా అలా గాన ప్రవాహంలో ఓలలాడుతూ, పాడుతూనే ఉంటాడు. అందుకే కొందరు ఈ మనఃస్థితిని తట్టుకోవడానికి తమ కళ్లముందున్న ఇప్పపూలతో రసాన్ని తీసి దానిని ఆహారంగా దేవతలకి అర్పిస్తారు. వారూ కొంత సేవిస్తారు. ఇప్పపూవు వారి దైవారాధనలో అన్ని పదార్థాలకన్నా, సారాయి వంటి ద్రవ పదార్థాలను ప్రీతికరంగా అర్పిస్తారు. బలి ఇవ్వడమే కాని ఇచ్చిన దానిని వండివార్చిన ఘన పదార్థాల నైవేద్యం తక్కువగానే ఉంటాయి.
డోలీవారు కథ చెబుతున్నప్పుడు శరీరం యావత్తూ లయాత్మక గానశైలి ఆవరించుకుంటుంది. శ్రోతలకి కథ చెప్పడమే డోలీల ముఖ్యమైన బాధ్యత. అంటే చరిత్ర ఘట్టాలను ఒక్కొక్కటే విప్పి చెప్పడం అతని వృత్తి. ధర్మం. - సమ్మక్క భర్త పగిడిద్దరాజుకి, కాకతీయ రాజు ప్రతాపరుద్రుడికి యుద్ధం జరుగుతుంది. కప్పం చెల్లించలేక కోయ దొరలు యుద్ధం చేయవలసి వస్తుంది. ఈ కథలో ఎన్నో చారిత్రక ఘటనలు ఒక్కొక్కటి రీలు తిరుగుతాయి. యుద్ధంలో పగిడిద్ద రాజు ఒరుగుతాడు. బాణాల వరసలో ఉన్న సమ్మక్కకి ఆ విషయం తెలుస్తుంది. భర్తని తీసుకుని బయటకు వస్తుంటుంది. ఆ వర్ణన ఎంతో గొప్పగా ఉంటుంది. అలా ఆమె అయిలాపురం వచ్చింది. ఎలా వచ్చిందంటే - ‘చీపురపుల్ల చీరలో.. ఏడూ మూళ్ల రయికెలె... అవి తల్లిగాని ధరింయించేనో... అలిసిపోయి అయిలా పురం వచ్చిందా’ - అప్పుడు అలా వచ్చి కాసేపు ‘రొప్పు’ (అలసట) తీసింది. భర్తను దగ్గర పెట్టుకుని...
అంగమీద అంగవేస్తూ ఏ తీరగ నడిచిందో ఆ సక్కని తల్లి అంటే, నడుస్తూ ఒక్కొక్క పేరే పెడుతోంది.... ‘నెమళ్లు కూసేది.. నాది మేడారం.. ఒక రోజు వేశానా.. హంసలోరి గట్టాట... అది మేడారమట’ అక్కడకు చేరింది.
ఆవేదన, ఆక్రోశంతో తల్లడిల్లిన సమ్మక్క క్షతగాత్రుడైన భర్తని తీసుకుని పోతున్ది. ‘ఆమె ఏ తీరుగున్నదీ... ఏ వరుసానున్నాదీ... లోకానికి తెల్వదో’... ఇది ఒక తెగ మనఃస్థితికి అద్దం పట్టే వ్యక్తీకరణ. పగిడిద్ద రాజు బతికాడా? మరణించాడా? యుద్ధంలో ఎవరు గెలిచారు అన్న విషయం స్పష్టంగా లేదు. కాని ఆ తరువాతి కథలో...
‘చిలుకూరి గట్టు
సిన్ని మేడారమో
నాగళ్ల పురిగట్టు
అది నంది మేడారమో’
అని సమ్మక్క తల్లి పేర్లు పెట్టింది. అంటే అప్పటికి ఈ పేర్లు లేవని అర్థం. కొత్తగా, అంటే, ఈ యుద్ధం అనంతరం సమ్మక్క అప్పటికప్పుడు పేర్లను పెట్టింది. ఓడినవారు తమ రాజ్యంలోని ప్రదేశాలకు, అదీ యుద్ధం జరిగిన క్షేత్రంలో పేర్లు పెట్టలేరు. కానీ సమ్మక్క అలా పేర్లు పెట్టింది. ఆ తరువాత చెప్పిన చరణాల్లో ఇలా ఉంది -
‘అదిగద నాయన - ఆహా!
దేశాన్ని ఓడించి (కాకతీయ దేశాన్ని, రాజ్యాన్ని ఓడించి
దేశానికి పేర్లు పెట్టింది..
అలా పేర్లు పెట్టినంక ‘అప్పుడు రాజుగారు, సెల్లె నాగులమ్మ, భర్త పగిడిద్ద రాజు ఏమంటున్నాడు. ఎట్లయిన ఫర్వలేదు. మన దేశం మనకు సిక్కిపోయింది. మనకింకేం భయం లేదు. అని కోయరాజులంత రండి, మనకు మాట్లాడాలి అని చెప్పింది.
‘చిలుకలూరి గట్టుకి నేను సిన్ని నడక నడుసుతా’ అని అక్కడకు వెళ్లింది. నేను ఎక్కడ ఉన్నా మిమ్మల్ని కాపాడుతాను అని ఒప్పుకుంది. ‘అప్పుడు భర్త కూడా అదే మాట అన్నాడు’. అక్కడ ఒక సొరంగంలో ఆగిపోయింది. ఇదీ సమ్మక్క చివరి మజిలి.
ఐతే ఆమె బిడ్డ సారలమ్మ. కర్నెపెల్లిలో ఉంది. ఆమె ఎలా ఉంది -
‘అది కుంకుమ పువ్వులో పుట్టింది
అది కుంకుమ పువ్వు సారాలమ్మో
రంగంలో పుట్టింది
రంగమ్మా సారమ్మో
పసుపులో పుట్టింది
ఆమె పచ్చ సారాలమ్మో’
కర్నెపెల్లిలో ఉన్నదా ఆ సారాలమ్మ
దశ పనె్నండు అవతారాలు ఎత్తేనా’
అని పాడుకోవడంతో మహిమాన్విత సమ్మక్క బిడ్డ అయిన సారాలమ్మని కూడా జనం కొలవడం మొదలుపెట్టారు. అందుకే ఇద్దరూ దేవతలు అయనారు. సమ్మక్క పేరు తడమగానే సారమ్మ పేరు వచ్చేస్తుంది. ఇద్దరి పేర్లు కలసి ఒకే పేరుగా తలవడం జరిగినా దశ పనె్నండు అవతారాలలో మాత్రం ‘ఇద్దరు’ అనే భావం ఉంటుంది.
మూడేళ్లకోసారి సమ్మక్క, పగిడిద్దరాజు కల్యాణం జరుగుతుంది. ‘ఇప్పుడు జాతర అంటున్నం. కానీ అప్పుడు అది కల్యాణం గద’
నరరాజులు కోయ రాజులు కలసి కల్యాణం చేస్తారు.
శుద్ధ పౌర్ణమినాడు చిలుకూరి గట్టు నుండి తల్లి సమ్మక్కని తీసుకువస్తారు. ఆ రోజు కోయరాజులు వరసగ ఏడు బట్టీల సారాయి పుచ్చుకుంటారు. పూనకాలు, సంబురాలు చేసుకుంటారు. ఈ తతంగం అంతా వేరు. ఐతే అక్కడ ఎంద దుబ్బలేస్తే అంత సంతోషం అన్నది సమ్మక్క. ఎంత దుబ్బబారినా మంచినీళ్లే తాగాలి. అక్కడ అన్నాలు గిన్నాలు తినొద్దు అని చెప్పింది.
అలా ఎందుకు చెప్పింది?
అది ఒకనాటి యుద్ధరంగం. అక్కడ ఎంతోమంది కోయవీరులు మరణించారు. అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. అంతరించిపోయే కోయజాతి తిరిగి నిలబడ్డది. ఒకనాటి వీరోచిత యుద్ధక్షేత్రానికి, నమోవాకాలు అర్పించడం, వీరులను స్మరించుకోవడం ఉద్దేశంగానే సమ్మక్క సారమ్మ జాతర జరుగుతుంది. ఈ కథ చెప్పుకోవడం కూడా అందుకే. ఏదిఏమైనా కోయల చరిత్రలో ఒక అపూర్వ ఘట్టాన్ని ఆడిపాడే చారిత్రక వీరగాథగా దీనిని పేర్కొనవచ్చు.
కొద్దిపాటి కాల్పినికత ఉన్నా యుగాల ఒక తెగ ఆదివాసీల చరిత్ర మూలాలు ఇందులో ప్రస్ఫుటం.
దీనిపై మరింత శాస్ర్తియ పరిశోధన జరగాలి. చరిత్ర, పురావస్తుశాఖ, జానపద గిరిజన విజ్ఞాన రీతులు, ప్రజల వౌఖిక సాహిత్య సాక్ష్యాధారాలు కలగలిపి చారిత్రక పద్ధతిలో మరింత ముందడుగు వేయాలి. అందుకుగాను ఈ ‘పాఠ్యం’ ఉపయోగపడుతుంది.
లోగడ ప్రచారంలో ఉన్న అనేక ఉదంతాలకు ఈ పార్శ్వం ఒక క్రమరీతిని, చారిత్రక సంఘటనల పరంపరలో అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుంది.

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242