తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

గడ్డకట్టిన దినచర్య మారక తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపద చేతిలో మనిషి మరణిస్తున్నాడు. సంపదని సృష్టించే మనిషిని చంపుతున్నాడు. అనారోగ్యకరమైన సంపదని సృష్టించడానికి అనాగరికతను పెంపొందిస్తున్నాడు.
మనిషి నైతికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఉన్నతంగా జీవించడమే నాగరిగత. మానవులందరూ ఒక దశలో సమానంగా, సమాజంలో సంతృప్తికరంగా జీవించడమే నాగరిగకత లక్ష్యం. నాగరిక సమాజం వెల్లివిరియడానికి ఇదే కారణం. బిచ్చగాళ్లు, ఆకలి చావులు, పేదరికం ఒకవైపు, అమోఘ సంపదలు మరోవైపు ఉంటే అది నాగరికత కాదు. ఆ రాజ్యం, ఆ దేశం దశని సాంస్కృతిక ఉచ్ఛస్థితిలో ఉన్నట్టుగా పేర్కొనలేం. ఇప్పుడు మనం నాగరికతలని సృష్టించలేకపోతున్నాం. అనాగరిక దేశాపాలనకే పరిమితం అవుతున్నాం.
గత పాలకులతో సరిసమానం చేసుకొని, వారు చేసినటువంటి తప్పులను మేంచేయడం లేదని చెప్పుకోవడం నాగరికత కాదు. నాగరికతలో సభ్యత, సహజత్వం పునాదిగా ప్రజా జీవన స్థాయి పెంపొందాలి. అలా చూసినట్లయతే జీవన స్థాయికి ఏది గీటురాయి?
సాంకేతికత ఒక్కటే అభివృద్ధి కాదు. అగ్రరాజ్య దాసోహం ముందడుగు కాదు. కొత్త ఆధ్యాత్మిక దేశీ పెట్టుబడిని కృత్రిమంగా ప్రోత్సహించడం పురోభివృద్ధి కాదు.
ఉత్పత్తిలో ప్రజల స్వతంత్ర పాత్ర ఉండేలా చూడాలి. ప్రజలను దిసరికూలీలుగా మార్చేసి, తిండికి అలమటించేలా చేసి, వలసలకు గురిచేసి ముదుసలి తల్లిదండ్రులను ఊర్లో ఉంచి తమ్ముళ్లు పట్టణాల్లో చేరడం అన్నలు మహానగరాలలో మురికివాడలు కావడం బాధాకరం. అది కుటుంబాలు కకావికలం కావడం మాత్రమే. అందరూ కడుపుకింత తిని పనిపాటల్లో పాల్గొనే పరిస్థితిని చేజేతులారా త్రుంచడం ఏపాటి?
సమాజంలో అల్లకల్లోల, అస్తవ్యస్థతలని సృష్టించే పరిస్థితులను చక్కదిద్దని పాలకులు ప్రజల ప్రమేయం లేకుండా పాలిస్తున్నట్టు అవుతుంది.
సంపద సృష్టికి ఒకలెక్క ఉండాలన్నది ప్రాచీన నీతి. రాజరికాలు అంతరించి మొలుచుకొచ్చిన కొత్త భూస్వామ్య విషపు వృక్షాల కౌగిటిలోంచి పెట్టుబడి ముళ్లకంచెలు అంతటా వ్యాపించాయి. దాని బారిన పడని మానవ స్పర్శలు ఏవీ లేవు. మాతృగర్భాల దగ్గర నుండి నెలలు నిండని పసికూనలు వరకు కిలోల చొప్పున అమ్మకం సరుకయ్యారు. ఆధునిక విలాసాల కోసం మనుషులు మళ్లీ బానిసలయ్యారు. స్ర్తిల చరిత్ర ఏమాత్రం మారని హింసల ప్రవాహం.
మొత్తం సమాజం ఘనీభవించిపోతున్నది.
భౌతిక జీవితం, మానసిక లోకంలో యాంత్రికత ఆవరించింది. యంత్ర సంస్కృతి అంటే యౄశ్యఆ్యశక. 3‘‘పాడిందే పాడరా పాచిపండ్ల దాసా’’2 లాగ. 3‘‘ఆడిందే ఆడరా కుంటిమేళం ఆట’’లాగ.
ఇప్పుడు ఒకరి మాట మరొకరికి వినరావడం లేదు. ఒకరి బాధని మరొకరు చూడలేని శక్తిహీనులయ్యారు. ఎవరి తాపత్రయం వారిది. మనిషిని పరచోదిత యంత్రంగా మార్చిన పెట్టుబడి లక్ష్యం నెరవేరాలి. అందుకే అంతటా నిశ్శబ్దం. గుసగుసలు కూడా నేరమే. పదిమంది కూర్చునే రచ్చబండలు, కూలిపోయాయి. రకరకాల పక్షులు గుమికూడే కొమ్మల కింద ఉదయం నలుగురు మనుషులు కలిసి మాట్లాడుకోలేని పరిస్థితి.
ప్రజలను ఇలాగే జీవచ్ఛవాలుగా బతకనిస్తేనే పాలకుల ఆటలు సాగుతాయని ఆ వర్గాలవారి నమ్మిక. అందుకే దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే తీరు సంస్కృతి.
నగరాలు, పల్లెలు అనే తేడాలేదు. ధనికులు, పేద తారతమ్యం లేదు. యజమానులు, కూలీల అంతరం లేదు. స్ర్తిపురుష భేదం లేదు. అంతటా ఆందరి దైనిక జీవితం ఒకేలా యాంత్రికంగా మారింది. ఒకే స్థాయి స్తబ్దత, ఒకే లెవెల్ జడత్వం.
పొలానికి వెళ్లినా, ఫ్యాక్టరీలోకి కాలిడినా, ఉద్యోగి సీట్లో కూర్చున్నా, అధికారిగా పర్యటనలు చేస్తున్నా తేడా లేని అసౌకర్యం. ఏదో దిగులు వెంటాడుతోంది. ఏవో తెలియని భావనల రాపిడిలో మనసు విలవిల. పిల్లల చదువుకు లక్షలు. స్థాయిని బట్టి. ఖర్చు అందరికీ తడిసి మోపెడు. ఏ పిల్లవాడు తన బడిలో సంతోషంగా గడపడం లేదు. అత్యధిక ఫీజు వసూలు చేయడానికి పిల్లలపై అనవసరపు భారాల బండలు మోపడం. అది సరికాదని అనే స్వరం ఏరూపంలోనూ వినపడదు. అసహజ ధోరణిని చూసి సహజంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే స్వరాలు మూసుకుపోతున్న కాలం ఇది.
ఇప్పుడు గొంతు విప్పలేనితనం ఏలుతున్నది. ఇరవైఏళ్ల క్రితం పదిమంది కలసి జోకులు వేసుకునేవారు. హాస్యం వరదలై పారేది. ఇప్పుడు బుల్లితెర నవ్వించాల్సిందే. జీవహాస్యం కాస్తా తెరహాస్యమైంది. కథలు చెప్పే అవ్వల నోళ్లు బిగుసుకుపోయాయి. వినే మనుమలు, మనవరాళ్లు కరవయ్యారు. చానెళ్లలో పిల్లల కార్యక్రమాలు చూసి అలసిపోయిన వారికి స్వాంతన లేదు. రాత్రి అవ్వకథలతో జోగాడిన ప్రాంగణాలు లేవు. దీవిటీ వెలుతుర్లో ఆడిపాడిన తోలుబొమ్మలు, చెక్కబొమ్మలు శిథిలమయ్యాయి. జానపద గిరిజన నాటకాలు వేసే కళాకారులు నగరాల్లో పొద్దంతా మేస్ర్తిపని చేసి రాత్రి గుడుంబా తాగి ఒళ్లు తెలియకుండా జోగుతున్నారు.
ఒక్క కొత్తపాట పుట్టడం లేదు. పదిమంది కలసి ఒక్క నాటకం రూపొందించడం లేదు. అంతా కాపీ. కాపీరైట్.
బృందగానాలు బందు. ప్రేక్షకుల స్పందనపై నిషేధాలు. జనమాధ్యమం కనుమరుగు. పాతకాలం నాటి గుంపు దినచర్య లేదిపుడు. దినం దినంలా లేదు. అదొక శిక్షలా గడిచిపోతున్నది.
ప్రతి జాతికి, ప్రాంతానికి ఒక కనబడని సాంస్కృతిక అవసరం ఉంటుంది. అది పాటలో, పద్యంలో, గానంలో, పండగ పబ్బంలో వ్యక్తం కావాలి. భౌతికంగా, భావనా పరంగా అది బట్టబయలై హృదయాలను శాంతిప జేయాలి. లేనిపక్షంలో అది గుండెపై రాయిలా బరువెక్కి, రక్కి బాధ కలిగిస్తుంది.
ప్రజలు అలసత్వంలో జోగడం పాలకుల పథకం. తమకు తెలియకుండానే తమకైన వృత్తుల్ని జీవనాధారలను, సంపదని, బతికే మార్గాలను కోల్పోవడం ద్వారా జీవచ్ఛవమవుతున్నారు. అలాంటి మనుషులు ఆలోచించలేరు. జడత్వానికి గురవుతారు. తద్వారా సోమరులుగా మారతారు. వీళ్లకు పథకాలు కొత్తగా ప్రవేశపెట్టి వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెప్పుకుంటారు.
నిద్రలేవడం తప్పనిసరి. కాని నిద్రపోవడం కష్టమైన పని. నిదుర క్షణాలను రేపు భయపెడుతున్నది. ఎలాంటి మార్పులేని రేపును ఈడ్చడానికి ఎంతో సమాయత్తం కావలసి వస్తున్నది. ఎలాంటి మజా, 3ఆనందం2 కానరాని తేదీలు ముందున్నవని తెలిసి జీవించే 3ధ్రిల్2 కోల్పోవడం విషాదం. యాంత్రిక భావన సున్నితత్వాలను హరించివేసింది. జీవరహిత సమాజంలో అంతటా గడ్డకట్టిన బతుకు.
మనిషి ఇప్పుడు దినచర్యని చూసి భయపడుతున్నాడు. అది భారమై బరువై కదలాడుతోంది.
ఐనా గతంలోని సమష్టి జీవనంలోని సంతృప్తి తిరిగి వస్తుందని ఆశ. కుటుంబం ఒక్కటై ఉపద్రవాలను ఎదుర్కొనే సత్తా పునరుజ్జీవిస్తుందని ధీమా. గతంలోని దోపిడి, ఆధిపత్యం సమసిపోయి కొత్త సమాజం కోసం ఆరాటం, ఆలోచన జీవించడం పట్ల హామీ కలిగిస్తుంది.
గతం గుదిబండ కాకుండా, దానిని మార్చి సరికొత్త రూపంతో తీర్చిదిద్దాలనే ఉబలాటం పెరిగింది. ఐతే ఏది సరికొత్త మార్గం? ఏయే శక్తుల పునరేకీకరణకి ఏం చేయలనే ఆలోచన కదలాడుతోంది. ప్రజాస్వామిక బీజాలను కాపాడుకుని తమకు అవసరంగా వాటిని సరైన కాలంలో నాటాలనే తాపత్రయం. వ్యక్తిగత నిస్పృహలకు కాలం చెల్లిందని తెలుసుకున్నవారు తమ యాంత్రిక దినచర్యలోనే పావులు కదుపుతున్న శబ్దం. దైనందిన కార్యకలాపాలు జీవించడానికి ఏమాత్రం సహకరించకపోయినా మొత్తం దినచర్యనే సమూలంగా మార్చి కొత్తగా మొదలు పెట్టాలని ఆలోచన.
ఇప్పుడు సమాజం సోమరిగా లేదు. నిద్రలో సైతం పథకం ప్రకారం కదులుతున్నది. స్తబ్దత రాజకీయ పార్టీలను సైతం కుదుపుతోంది. కొత్త ప్రజా రాజకీయాలు బీజాలు అల్‌నినోలోంచి మొలకెత్తడానకి కదులుతున్నాయి.
సున్నితత్వాన్ని, మమతని, మరవని మనిషి, విరామచిహ్నం కాలేని మనిషి, అలసత్వాన్ని బద్దలు కొట్టే మనిషి తన సాటివానితో చేయి కలపడానికి కదులుతున్నాడు. ప్రాకృతిక దినచర్యలోంచి ఒక కొత్త నాగరికతని సృష్టించడానికి ఆలోచిస్తున్నాడు.