ఆంధ్రప్రదేశ్‌

తిరుమలకు పోటెత్తిన భక్తకోటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి చేస్తున్నారు. 24 గంటల ముందే భక్తులను క్యూలోకి అనుమతించిన టీటీడీ అన్ని మౌలిక వసతులు కల్పించింది. ఈరోజు స్వామివారిని రికార్టుస్థాయిలో భక్తులు దర్శించుకున్నట్లు తితిదే అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల వరకు 56,698 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు అధికారులు ప్రకటించారు.
క్యూల నిర్మాణంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. భక్తులకు అన్నప్రసాదాలు తీసుకెళ్లేందుకు క్యూలకు ఇరువైపులా స్థలం కేటాయించారు. మరుగుదొడ్లు నిర్మించారు.తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను సమకూర్చారు. పాలు, కాఫీ, టీ ఏర్పాటు చేశారు. మొదటి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 16కంపార్ట్‌మెంట్లు, రెండో క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకే నిండాయి. వైకుంఠంలోకి చేరిన భక్తులకు నిత్యాన్నప్రసాద విభాగం షడ్రషోపేత అన్నప్రసాదాలు అందజేసింది.