రాష్ట్రీయం

తిరుమలకు పోటెత్తిన భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తులకు వైకుంఠ ద్వార దర్శనమిచ్చిన వేంకటేశ్వరస్వామి

తిరుమల, డిసెంబర్ 21: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఇలవైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల పుణ్యక్షేత్రం సోమవారం భక్తులతో పోటెత్తింది. తిరుపతి అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గం గుండా 70 వేలకు పైగా గోవింద మాల భక్తులు, సామాన్య భక్తులు కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. దీంతో సోమవారం ఒక్క రోజే లక్షా 10 వేల మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకొని వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చినా టిటిడి యాజమాన్యం ముందస్తు చేపట్టిన ఏర్పాట్లతో ఎక్కడా చిన్నపాటి తొక్కిసలాటలు కూడా చోటుచేసుకోలేదు.
మంగళవారం ద్వాదశి రోజున కూడా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుండే తిరుమలలో వేచి ఉన్న భక్తులు చేసిన గోవిందనామ స్మరణలతో తిరుమల గిరులు మారుమోగాయి. టిటిడి ఉద్యానవన శాఖ ఆలయంలో, వెలుపల చేపట్టిన ఫల, పుష్పాలంకరణాలు భక్తులను ముగ్ధులను చేశాయి. శ్రీవారి ఆలయ మహద్వారం నుండి బంగారు వాకిలి వరకు, ఉత్తర ద్వారం లోపల కళాత్మకంగా చేపట్టిన పుష్పాలంకరణలు వైకుంఠాన్ని తలపించాయి. విద్యుత్ శాఖ ఆలయ ప్రాకారాలకు ఏర్పాటు చేసిన సప్తవర్ణ విద్యుద్దీపాల కాంతులు తిరుమలలో దేదీప్యమానంగా వెలుగునిచ్చాయి. తెల్లవారు జామున 1 గంట నుండి 3.30 గంటల వరకు ప్రోటోకాల్ పరిధిలో ఉన్న 2980 మందికి స్వామివారి దర్శనం కల్పించిన టిటిడి అనంతరం నిరంతరాయంగా సర్వదర్శనంలో సామాన్య భక్తులను ఆలయంలోకి అనుమతించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చేసిన ఏర్పాట్లతో ప్రతి భక్తుడిలోనూ ఆనందం వ్యక్తమైంది. తెల్లవారు జామున 3.30 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు 11.30 గంటల వ్యవధిలో 52 వేలమందికి పైగా సామాన్య భక్తులు దర్శనం చేసుకోగలిగారు. అనంతరం అర్ధరాత్రి వరకు మరో 60 వేలమంది భక్తులు స్వామివారిని దర్శించుకొన్నారు. దీంతో రికార్డు స్థాయిలో ఒకే రోజులో లక్ష 10 వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకొన్నారు. క్షణం పాటు స్వామిని దర్శించుకొన్న వైకుంఠ ద్వారం (ఉత్తర ద్వారం) ప్రవేశంతో భక్తుల్లో ఆనందం, ఆధ్యాత్మిక చింతన తొణికిసలాడింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు నిర్ణీత సమయం కంటే అర్ధగంట ముందుగా బ్రహ్మ ముహూర్తంలో స్వామి దర్శన భాగ్యం వైకుంఠ ద్వారా ప్రవేశం జరిగిందని సామాన్య భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం వైకుంఠం 1, 2 కాంప్లెక్స్‌లోని 64 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. దాదాపు 4 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. నారాయణగిరి ఉద్యానవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన 9 షెడ్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ దృష్ట్యా విఐపి పాసులను కట్టడి చేయడంతో ఆదివారం నుండి వేచి ఉన్న భక్తులకు సోమవారం సాయంత్రం 6 గంటల లోపే శ్రీవారి దర్శన భాగ్యం కలిగింది.
శ్రీవారిని దర్శించుకొన్న ప్రముఖులు
వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకొన్నారు. అర్ధరాత్రి 1 గంట నుండి ఉదయం 3.30 గంటల వరకు వీరికి శ్రీవారి దర్శన భాగ్యం వైకుంఠ ద్వారం ప్రవేశం టిటిడి కల్పించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌వి రమణ, రంజన్ గొగోయ్‌తో పాటు కేంద్ర మంత్రి సుజనాచౌదరి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు.