రాష్ట్రీయం

హిందూధర్మ పరిరక్షణే శ్రీరామరక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విహెచ్‌పి అంతర్జాతీయ కార్యాధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా

గుంటూరు, డిసెంబర్ 4: ప్రపంచంలోని ప్రతి దేశం మెజార్టీ మత భావనలకు అనుగుణంగా చట్టాలు, పాలన కొనసాగిస్తున్నాయని, అయితే 80 శాతానికిపైగా హిందువులు ఉన్న దేశంలో సెక్యులర్ ముసుగులో హిందువుల పట్ల తీవ్ర వివక్ష కొనసాగుతోందని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యాధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా విమర్శించారు. శుక్రవారం గుంటూరు నగర పర్యటనలో భాగంగా శ్యామలానగర్ సంతోషిమాత దేవాలయాన్ని సందర్శించిన అనంతరం విలేఖర్లతో తొగాడియా మాట్లాడారు. నైతికత, ధర్మాన్ని అర్థం చేసుకోలేని కుహనా మేధావులు హిందువులను శత్రువులుగా, అరాచకవాదులుగా చిత్రీకరించడం దేశ భవిష్యత్తుకు మంచిది కాదన్నారు.మైనార్టీలను సంతోషపరిచే నేతలు మెజార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్యల పట్ల ఏనాడూ నోరు మెదకలేకపోయారన్నారు. హిందూ దేవతలను, నమ్మకాలను, ఆచారాలను విమర్శించడం వారికున్న స్వాతంత్య్రం, రాజ్యాంగ హక్కులు, మెజార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీయడం కాదా అంటూ ప్రశ్నించారు. మైనార్టీలను సంతృప్తిపరుస్తున్న నాయకులు, రాజకీయ పార్టీలకు విహెచ్‌పి తప్పక సమాధానం చెబుతుందని హెచ్చరించారు. దేశంలోని ప్రతిహిందువూ తాను హిందువునని గర్వంగా చెప్పుకోవడం ద్వారానే దేశంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తుయన్నారు.