రాష్ట్రీయం

రాయితీ వడ్డీ రుణాల పేరుతో రూ. 10 కోట్లు టోకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇద్దరి అరెస్టు రూ. 12లక్షల నగదు స్వాధీనం
హైదరాబాద్, నవంబర్ 28: తక్కువ వడ్డీ, వడ్డీలేని రుణాలు ఇస్తామంటూ అమాయకులను మోసగించి రూ. 10కోట్ల మేరకు టోకరా వేసి బిచాణా ఎత్తేసిన ఓ ఫైనాన్స్ కంపెనీకి చెందిన ఇద్దరిని సైబరాబాద్ క్రైం డికెక్టివ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిసిఎస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..2013లో సందీప్ అగర్వాల్, ముఖేష్‌లు ఉత్తరప్రదేశ్ నోయిడాలో వాల్యూ యాడెడ్ కార్డు ప్రైవేటు లిమిటెడ్‌ను స్థాపించారు.
సంస్థ డైరెక్టర్‌గా సందీప్ అగర్వాల్(29), ఆథరైజ్డ్ డైరెక్టర్‌గా ముఖేష్ (32) కొనసాగుతున్నారు. తక్కువ వడ్డీ, వడ్డీలేని రుణాలంటూ ప్రచారంతో వ్యాపారం చేసేందుకు పథకం వేశారు. మహిపాల్ యాదవ్ సింగ్ అనే వ్యాపారికి చెందిన మై ఇనె్వస్ట్ గురూజీ ప్రైవేటు లిమిటెడ్‌ను అడ్డుపెట్టుకొని ఆ సంస్థకు చెందిన సిబ్బందితో దేశవ్యాప్తంగావున్న వినియోగదారుల వివరాలను సేకరించారు. తక్కువ వడ్డీ, వడ్డీలేని రుణం, స్యూరిటీ లేకుండా రుణాలిస్తామంటూ ప్రచారం చేశారు. దీంతో వందలాది మంది అమాయకులు మై ఇనె్వస్ట్ గురూజీ సర్వీసెస్‌పై నమ్మకంతో వాల్యూ యాడెడ్ కార్డు ప్రైవేటు లిమిటెడ్ పేరుతో రుణాల కోసం కొంత మొత్తాన్ని డిపాజిట్‌గా చెక్కులు పంపించారు.
రూ. 15వేల నుంచి రూ. 50వేల దాకా రుణాలు మంజూరైనట్టు కొందరికి నకిలీ మంజూరు పత్రాలను పంపించారు. తమ ఫైనాన్స్ సంస్థ ఆర్‌బిఐ ఆమోదంతో ఐదు లక్షల వరకు రుణాలిస్తుందని వ్యాపారులను నమ్మించారు. దీంతో తెలంగాణ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సుమారు వెయ్యిమంది రుణాల కోసం పెద్ద మొత్తాల్లో డిపాజిట్లు చెల్లించారు. రుణాలకు ఆశపడిన అమాయకులనుంచి సేకరించిన మొత్తం రూ. 10కోట్లతో సంస్థ బోర్డు తిప్పేసి బిచాణా ఎత్తేసింది. మోసపోయిన వినియోగదారులు క్రైం డిటెక్టివ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిపాల్ యాదవ్‌ను గత సెప్టెంబర్‌లో అరెస్టు చేయగా శుక్రవారం ఢిల్లీలో సందీప్ అగర్వాల్, ముఖేష్‌లను అదుపులో తీసుకొని వారి నుంచి రూ. 12లక్షల నగదుతోపాటు, రూ.1,51,49,675లను వివిధ బ్యాంకుల్లో ఫ్రీజ్ చేశారు. అదుపులోకి తీసుకున్న నిందితులను హైదరాబాద్‌కు తీసుకువచ్చినట్టు డిటెక్టివ్ పోలీసులు తెలిపారు. వీరిపై చీటింగ్ కేసులతోపాటు పిడి యాక్టు కూడా ప్రయోగించనున్నట్టు పోలీసులు తెలిపారు.