అవికా ఛాన్స్ కొట్టేసిన కుమారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య టాలీవుడ్‌లో యువ హీరోయిన్ల హవా ఎక్కువైంది. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఒకరిని మించి మరొకరు గట్టి పోటీ ఇస్తూ అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. తాజాగా ఓ సినిమాలో హీరోయిన్‌గా అవికాగోర్‌కు వచ్చిన అవకాశాన్ని కొట్టేసింది ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ హెబాపటేల్. ఆ సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుని హాట్ హాట్ అందాలతో యువ హృదయాలని అలరించిన హెబాకు ఇపుడు టాలీవుడ్‌లో అవకాశాల జోరు పెరిగింది. ప్రస్తుతం పలు సినిమా అవకాశాలు వస్తున్న ఈమెకు మరోసారి రాజ్‌తరుణ్ సరసన నటించే అవకాశం దక్కింది. మంచు విష్ణు, రాజ్‌తరుణ్‌లు హీరోలుగా రూపొందనున్న సినిమాలో రాజ్‌తరుణ్‌కు జోడీగా మొదట అవికాగోర్‌ను అనుకున్నారు. కానీ ఇప్పుడామె ప్లేసులో హెబాపటేల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది.