బిజినెస్

మదనపల్లె మార్కెట్‌ను ముంచెత్తిన మహారాష్ట్ర టమోటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అడ్డుకున్న రైతులు * అధికారులు, వ్యాపారులతో వాగ్వాదం
* ఉద్రిక్తతల మధ్య ఆగిన వేలం పాటలు

మదనపల్లె, నవంబర్ 23: మదనపల్లె మార్కెట్‌ను మహారాష్ట్ర టమోటా ముంచెత్తుతోంది. టమోటా కు విపరీతమైన గిరాకీ ఏర్పడిన నేపథ్యంలో అధికారులు మహరాష్ట్ర నుంచి టమోటా దిగుమతికి అనుమతివ్వడం మార్కెట్‌లో ఉద్రిక్తత కు దారితీసింది. మార్కెట్‌లో టమోటా ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది వ్యాపారులకు అధికారులు అనుమతినివ్వడంతో మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున టమోటా నిల్వలు మదనపల్లె మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఫలితంగా స్థానిక రైతులు తమకు అన్యాయం జరుగుతోందంటూ సోమవారం వ్యాపారులు, అధికారులతో వాదనకు దిగారు. లారీల అద్దాలను పగులగొట్టి విధ్వంసం సృష్టించారు. నిరసన వ్యక్తం చేశారు. కాగా, ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలీసుల సమక్షంలో వ్యాపారులు, రైతులతో చర్చలు జరపగా, పరిస్థితి అదుపులోకి వచ్చింది. వర్షాల వల్ల కాని ఇతర కారణాల వల్లకాని మొదటివారంలో కిలో టమోటా రూ. 25, రెండవ వారంలో రూ. 55, ఆపై ఇటీవల 100 రూపాయల ధర పలికిన విషయం తెలిసిందే. దీంతో రైతులు సంతోషిస్తుండగా, అనంతపురం, కర్నాటకలో టమోటాలు అధికంగా దిగుబడి కావడంతో కిలో ధర రూ. 56కు పడిపోయింది. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్ర రాయపూర్ మార్కెట్‌లో 30 కిలోల క్రేట్ టమోటా రూ. 350 నుంచి రూ. 450 పలుకుతున్న విషయం తెలుసుకున్న మండీ యజమానులు గత వారం రోజులుగా మహారాష్ట్ర నుంచి ప్రతిరోజు 200 టన్నుల టమోటా మదనపల్లె మార్కెట్‌కు దిగుమతి చేసుకుని చిత్తూరు జిల్లా టమోటాలతో కలిపి వేలం పాటలు నిర్వహిస్తున్నారు. దీంతో తమకు నష్టం వాటిల్లుతోందంటూ మదనపల్లె రైతులు ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే సోమవారం మదనపల్లె మార్కెట్‌కు మహారాష్ట్ర, అనంతపురం నుంచి వస్తున్న టమోటా లారీలను జాతీయ రహదారిపైనే అడ్డుకుని, లారీల అద్దాలను ధ్వంసం చేశారు. మార్కెట్ యార్డు తలుపులు మూసేసి, వేలం పాటలు బహిష్కరించి ఆందోళన నిర్వహించారు. ఈ సమయంలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో విషయం తెలుసుకున్న స్థానిక సిఐ హనుమంత నాయక్, టిడిపి నాయకుడు మల్లికార్జున నాయుడు, మార్కెట్‌కార్యాలయంలో మండీ యజమానులు, రైతులతో చర్చించారు. ఇతర రాష్ట్రాల నుంచి టమోటా దిగుమతి చేయడం చట్టవ్యతిరేకమని, ఇలాచేస్తున్న మండీ యజమానుల అనుమతి రద్దు చేస్తామని ఇన్‌చార్జ్ సెక్రటరీ జగదీష్ హెచ్చరించారు. దీంతో సమస్య సద్దుమణిగింది. అనంతరం మధ్యా హ్నం రెండు గంటల ప్రాంతంలో వేలం పాటలు నిర్వహించగా, 10కిలోల టమోటా మొదటి రకం రూ. 440, రెండవ రకం రూ. 365, మూడవరకం రూ. 280 పలికింది. కాగా, పశ్చిమ ప్రాంతాల నుంచి 35 టన్నుల టమోటా మహారాష్ట్ర నుంచి 110 టన్నుల టమోటా దిగుమతి అయ్యాయి.