బిజినెస్

టాప్-10 స్థిరమైన సంస్థల్లో ఆర్‌ఐఎల్, టాటా మోటార్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్), వేదాంత, మహీంద్ర అండ్ మహీంద్ర, టాటా మోటార్స్, విప్రో తదితర కార్పొరేట్ దిగ్గజాలు భారత్‌లో అత్యంత స్థిరమైన సంస్థలుగా తేలింది. సిఐఐ-ఐటిసి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ సర్వే ప్రకారం టాప్-10 సంస్థల్లో ఐటిసి, టాటా పవర్, టాటా కెమికల్స్, హిందుస్థాన్ జింక్, ఎసిసి సంస్థలకూ చోటు దక్కింది. కాగా, 20 రంగాలకు చెందిన మొత్తం 100 సంస్థల్లో ఈ సర్వేకు పూర్తిగా సమాచారమిచ్చి సహకరించినది కేవలం 18 సంస్థలే. మరో రెండు సంస్థలు పాక్షికంగా సహకరిస్తే, మిగతా సంస్థలు స్పందించలేదని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ క్రమంలో 10 సంస్థలకు సస్టెయినబుల్ ప్లస్ ప్లాటినమ్, 7 సస్టెయినబుల్ ప్లస్ గోల్డ్, 83 సస్టెయినబుల్ ప్లస్ బ్రాంజ్ హోదాలను దక్కించుకున్నాయి.