బిజినెస్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఆసియా పసిఫిక్ ప్రాంత
దేశాల్లోని అగ్రగామి పది బిజినెస్ స్కూళ్ల జాబితాలో
మనదేశానికి చెందిన నాలుగు బి- స్కూల్స్‌కు స్థానం
లభించింది. క్యు ఎస్ గ్లోబల్ 200 బిజినెస్ స్కూల్స్
సర్వే నివేదిక ప్రకారం భారతీయ బిజినెస్ స్కూళ్లు
ఈఏడాది అంతర్జాతీయంగా తమ ఖ్యాతిని మరింత
పెంపొందించుకున్నాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని
టాప్ 36 బిజినెస్ స్కూల్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన
11 బి-స్కూళ్లు, భా రత్‌కు చెందిన ఆరు బి-స్కూల్స్
స్థానం దక్కించుకున్నాయి. ఇందులో నాలుగు
భారతీయ బిజినెస్ స్కూళ్లు టాప్ టెన్‌లో నిలిచాయి.
ఆసియా పసిఫిక్ టాప్ టెన్ జాబితాలో ఇండియన్
ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎం-
ఎ)కు రెండో స్థానం, బెంగళూరు ఐఐఎంకు ఐదో స్థానం,
ఇండియన్ స్కూల్‌ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి) కు
ఏడోస్థానం, కోల్‌కతా ఐఐఎంకు ఎనిమిదో స్థానం
దక్కాయి. అలాగే ఎస్‌పి జైన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్
మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్ 16 స్థా నం, ఇండియన్
ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ 21వస్థానంలో
నిలిచాయి.
Add new comment