క్రీడాభూమి

స్కాటిష్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్ పోరాటానికి తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లాస్గో, నవంబర్ 21: స్కాటిష్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్ పోరాటానికి తెరపడింది. పురుషుల సింగిల్స్‌లో ఆనంద్ పవార్, డబుల్స్‌లో మనూ అత్రి, సుమీత్ రెడ్డి జోడీ పరాజయాలను ఎదుర్కోవడంతో టోర్నీ నుంచి భారత్ నిష్క్రమించింది. అంతకు ముందు జరిగిన మ్యాచ్‌లో జర్మనీ ఆటగాడు డైటర్ డొమ్కేను ఓడించిన పవార్‌కు టాప్ సీడ్ హన్స్ క్రిస్టియన్ విటింగస్ (డెన్మార్క్) రూపంలో సవాలు ఎదురైంది. కడ వరకూ తీవ్రంగా పోరాడిన పవార్ 21-12, 10-21, 13-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. పురుషుల డబుల్స్‌లో మనూ, సుమీత్ జోడీపై ఇంగ్లాండ్‌కు చెందిన ఆండ్రూ ఎలిస్, పీటర్ మిల్స్ జోడీ 21-17, 21-15 ఆధిక్యంతో గెలిచింది.