బిజినెస్

శ్రీసిటీ సెజ్‌లో బెల్జియం దూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, మార్చి 17: నెల్లూరు-చిత్తూరు జిల్లాల సరిహద్దులో ఉన్న శ్రీసిటీ సెజ్‌ను గురువారం బెల్జియం వాణిజ్య దూత డాక్టర్ భర్త్ డి గూఫ్ పర్యటించారు. ఈయనను ఎండి రవీంద్రా సన్నారెడ్డి ఘన స్వాగతం పలికి శ్రీసిటీలో ఏర్పాటైన వివిధ పారిశ్రామిక వసతుల గురించి సాధించిన ప్రగతిని వివరించారు. ప్రపంచ స్థాయి పారిశ్రామిక వసతులతో పాటు శ్రీసిటీ వ్యాపారానికి అత్యంత అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేసి ఉందని, అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన పలు పరిశ్రమలు శ్రీసిటీనే తమ పెట్టు బడులకు గమ్యంగా ఎంచుకొంటున్నాయని తెలిపారు. బెల్జియం దేశానికి చెందిన వెర్నీరన్ సంస్థ కూడా శ్రీసిటీలో ఉందని భర్త్‌కు వివించారు. శ్రీసిటీలోని పారిశ్రామిక ప్రగతిని పరిశీలించి తమ దేశం నుండి వ్యాపార పెట్టుబడులకు గల అవకాశాల గురించి తెలుసుకొనేందుకు ముఖ్య ఉద్దేశమన్నారు. శ్రీసిటీలోని పలు పరిశ్రమలను పరిశీలించిన ఆయన నిర్మాణ దశలో ఉన్న వెర్మీరన్ సంస్థను తిలకించారు. ఈ సంస్థ వికలాంగులకు ఉపయోగించే చక్రాల కుర్చీలు, నడక పరికరాలు, వైద్యశాలలో రోగులకు వాడే ప్రత్యేక మంచాలను తయారు చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీసిటీ రూపకల్పన పలు ప్రత్యేకతలను సంతరించుకొందని, ప్రపంచ స్థాయి గుర్తింపు పొంది ఉందని, ఇక్కడ ఏర్పాటు చేసిన వసతులు, అందిస్తున్న సహకారాల పట్ల వెర్మీరన్ సంస్థ కూడా సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. ఈ సందర్భంగా రవీంద్రా సన్నారెడ్డి మాట్లాడుతూ బెల్జియం దేశ వాణిజ్య దూత శ్రీసిటీకి రావడం తమకెంతో సంతోషాన్ని కలిగించిందని, ఈ పర్యటన ఫలితంగా ఆ ఆదేశం నుండి మరిన్ని పెట్టు బడులు వచ్చే అవకాశాలున్నాయన్నారు.