Others

ట్రేడ్‌టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈవారం కూడా బాక్సాఫీసు దగ్గర బోరు చిత్రాల హోరే వినిపించింది. శ్రీకాంత్ కథానాయకుడుగా వీడికి దూకుడెక్కువ, నిఖిల్ శంకరాభరణం, యవ్వనం ఒక ఫాంటసీ, బంగారు పాదం, సితార, శ్రీకంఠ మహిమలు చిత్రాలు ఈవారం విడుదలయ్యాయి. కానీ చాలా చిత్రాలకు థియేటర్లు దొరకలేదు. దొరక్కపోయినా పర్లేదు విడుదల చేసేస్తామని చేసినట్లున్నారు. ఈవారం విడుదలైన ఏ చిత్రమూ సరైన ఆదరణ పొందలేదు. దూకుడు తక్కువై శ్రీకాంత్, మంచి సినిమా పేరును పాడుచేసి నిఖిల్ అప్రతిష్ఠను మూటకట్టుకున్నారు. ఇక యవ్వనం ఒక ఫాంటసీ, సితార చిత్రాల గురించి చెప్పుకోకూడదు. బంగారుపాదం, శ్రీకంఠ మహిమలు ఏ థియేటర్లో ఉన్నాయో తెలియని పరిస్థితి. అలా ఈవారం బాక్సాఫీసు వెలవెలపోయింది.