Others

ట్రేడ్ టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి సీజన్ తఠువాత ఆ స్థాయిలో చెప్పుకోదగ్గ చిత్రం ఒక్కటీ రాలేదు. దీంతో గత చిత్రాలనే ప్రేక్షకుడు గుర్తు చేసుకుంటున్నాడు. సంక్రాంతి నాటి చిత్రాలకే ఇంకా బాక్సాఫీస్ ఓటు పడుతోంది. ఇక ఎప్పటినుంచో ఊరించిన సునీల్ ‘కృష్ణాష్టమి’ ఈ వారం విడుదలైంది. ఆది పినిశెట్టి హీరోగా ‘మలుపు’ చిత్రమూ ప్రేక్షకుల ముందుకొచ్చింది. వీటి మధ్యలో మరో చిన్న చిత్రం ‘ప్రేమికులపై పిహెచ్‌డి’ కూడా ఆడియన్స్ జడ్జిమెంట్ కోరుతూ వచ్చింది. ఈ చిత్రాలేవీ ప్రేక్షకులను మురిపించలేకపోయాయి. హీరో అవతారం ఎత్తిన తరువాత కొద్ది సినిమాలుగా వరుస ఫ్లాప్‌లు అందుకుంటున్న సునీల్‌కు కృష్ణాష్టమి ఏమాత్రం మేలు చేసేదిగా కనిపించటం లేదు. పది సినిమాల్లోని సన్నివేశాలతో ఒక్క సినిమాగా చుట్టేశారన్న అపవాదు ఎదుర్కోవాల్సి వస్తోంది. ‘మలుపు’ చిత్రం వౌత్‌టాక్ బాగున్నా, ఆదికి ఎలాంటి కొత్త మలుపు ఇవ్వలేకపోయింది. ఈ జనరేషన్‌కు తగిన టైటిల్ కాకపోవడం కూడా ఇందుకో కారణమని అంటున్నారు. ప్రస్తావించుకోదగ్గ సినిమాగా ప్రేమికులపై పిహెచ్‌డి లేదని అంటున్నారు.