జాతీయ వార్తలు

పెను విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

18మంది రోగులు మృతి
చికిత్స మధ్యలో ఆగిన ఆక్సిజన్
జనరేటర్ రూంలోకి వరదనీరు
చెన్నై ప్రైవేట్ ఆస్పత్రిలో ఘోరం
దర్యాప్తు జరుపుతున్నాం: ఆరోగ్య కార్యదర్శి

చెన్నై, డిసెంబర్ 4: చెన్నై నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షాల కారణంగా వరద నీరు నగరంలోని పేరుమోసిన ప్రైవేట్ ఆస్పత్రి జనరేటర్ గదిని ముంచెత్తింది. దీంతో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి 18మంది రోగులు చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే తమిళనాడు ప్రభుత్వం మాత్రం రోగులు చనిపోవడానికి వెంటిలేటర్ ఫెయిల్ కారణం కాకపోవచ్చని, ఏదేమైనా వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్తోంది. అడయార్ నదికి వరద నీరు పోటెత్తడం ప్రారంభమైన సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొంతమంది రోగులను మనప్పాక్కం ప్రాంతంలో అడయార్ నది ఒడ్డునున్న మద్రాసు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అండ్ ట్రమటాలజీ (ఎంఐఓటి)కి తీసుకురావడం జరిగింది. అయితే విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఫలితంగా వెంటిలేటర్ పని చేయకపోవడంతో 18మంది చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆస్పత్రి జనరేటర్‌పై పని చేస్తూ ఉండిందని, వరద నీరు బేస్‌మెంట్‌లో ఉన్న జనరేటర్ గదిని ముంచేయడంతో జనరేటర్ కూడా పని చేయలేదని, ఫలితంగా రోగులు చనిపోయినట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
అయితే తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి జె రాధాకృష్ణన్ మాత్రం ఈ మరణాలకు కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు. విషమంగా ఉన్న సుమారు 57మంది రోగులను నగరంలోని వివిధ ఆస్పత్రులకు తరలించడం జరిగిందని, వీరిలో 18మంది చనిపోయారని ఆయన చెప్పారు. మరణాలకు కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. వరదలు ప్రారంభమైనప్పుడు ఎంఐఓటి ఆస్పత్రి 575 మంది రోగులకు చికిత్స చేస్తోందని, ఆ సమయంలో విషమ పరిస్థితిలో ఉన్న కనీసం 75మంది రోగులు వెంటిలేటర్‌పై ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం వైపునుంచి ఎలాంటి పొరబాటు లేదని ఆయన చెప్తూ, మరణాలు తమను బాధకు గురిచేస్తున్న మాట నిజమే అయినప్పటికీ రోగులందరు కూడా విద్యుత్, వెంటిలేటర్ వైఫల్యం కారణంగా చనిపోలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం వైపునుంచి ఎలాంటి లోపమూ జరగలేదని, రాష్టవ్య్రాప్తంగా బాధిత ప్రజలకు వీలైనంత సాయం అందించడానికి రాష్ట్ర అధికారులు చర్యలు తీసుకున్నారని రాధాకృష్ణన్ చెప్తూ, మరణాలకు వెంటిలేటర్ వైఫల్యం కారణంగా చెప్పడం తొందరపాటు అవుతుందన్నారు. అంతేకాదు రాష్ట్రంలో పరిస్థితి ఇప్పటికే గంభీరంగా ఉన్నందున జనంలో భయాందోళనలను వ్యాప్తి చేయవద్దని కూడా ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ మరణాలపై రాష్ట్ర హోం కార్యదర్శి కూడా సంతాపం తెలియజేస్తూ, అన్ని ఆస్పత్రుల్లో ప్రజలకు సరైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వీలైనన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు.