జాతీయ వార్తలు

మంత్రితో వాగ్వాదం ఫలితం.. మహిళా ఐపిఎస్ బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, నవంబర్ 28: హర్యానాలో మంత్రితో వాదనకు దిగిన మహిళా ఐపిఎస్ అధికారిణి సంగీత్ కలియాపై రాష్ట్ర ప్రభుత్వం వేటువేసింది. శుక్రవారం ఇక్కడ జరిగిన జిల్లా ప్రజా సమస్యలు, పరిష్కారం నిమిత్తం జరిగిన సమావేశంలో హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్‌కు ఫతేహాద్ ఎస్పీ సంగీత్ కలియాకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. అక్రమ మద్యానికి సంబంధించి చర్చపై మాట్లాడిన మంత్రి అధికారుల అలసత్వం వల్లే మద్యం ఏరులేపారుతోందని విజ్ ధ్వజమెత్తారు. సమావేశంలోనే ఉన్న ఎస్పీ కలియా జోక్యం చేసుకుంటూ తాము సమర్థవంతంగానే పనిచేస్తున్నామని చెప్పారు. అలాగే వ్యాపారులపై చర్యలు తీసుకుని రికార్డు స్థాయిలో కేసులు నమోదు చేసినట్టు ఎస్‌పి బుదులిచ్చారు. వెంటనే మంత్రి మద్యం వ్యాపారులతో పోలీసులకు సంబంధాలున్నట్టు ఆరోపణలు వస్తున్నాయని మండిపడ్డారు. దీనితో పోలీసు అధికారిణి ఏకీభవించకుండా ‘ఇది ప్రభుత్వ వ్యవహారం.. మద్యం లెసెన్సులు మంజూరు చేసి వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నది ప్రభుత్వమే’ అని కలియా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఆగ్రహం కట్టలుతెంచుకున్న మంత్రి ఎస్‌పిని సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవల్సిందిగా ఆదేశించారు. దీనికి ఆమె అంగీకరించకపోవడం, సమావేశంలోనే ఉన్న ప్రభుత్వం అధికారులు మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరికి మంత్రే సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియో టేప్ సోషల్ మీడియాలో సంచలనం రేపింది. మంత్రి ఆదేశాలను బేఖాతరు చేశారంటూ ఐపిఎస్ అధికారిణి సంగీత్ కలియాను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీకి సంబంధించి తదుపరి ఉత్తర్వులు రావాల్సి ఉంది. అంతకుముందు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటనపై విచారించి బాధ్యులపై చర్య తీసుకుంటామని ప్రకటించారు. ఇలా ఉండగా మహిళా అధికారిణి పట్ల అవమానకరంగా మాట్లాడిన వైద్య, ఆరోగ్య మంత్రి అనిల్ విజ్‌పై చర్య తీసుకోవాలని ప్రతిపక్షాలు, వివిధ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. విజ్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ పిఎల్ పునియా విజ్ఞప్తి చేశారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి మహిళ పట్ల అందులోనూ ఐపిఎస్ పట్ల అమర్యాదగా వ్యవహరించం సిగ్గుచేటని మాజీ ముఖ్యమంత్రి భుపీందర్ సింగ్ హూడా విమర్శించారు. కాగా గతంలోనూ మంత్రి విజ్ సొంత ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. శక్రవారం నాటి సంఘటపై మంత్రి మాట్లాడుతూ ‘అన్ని విషయాలూ సిఎంతో మాట్లాడాను. పనిచేయని అధికారులను వదిలిపెట్టేదిలేదు’ అని హెచ్చరించారు.