రాష్ట్రీయం

ట్రాన్స్‌ఫార్మర్లు, దస్త్రాలను ఆన్‌లైన్‌లో ఎందుకు మంజూరు చేయకూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, నవంబర్ 30: రైతులకు అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లు, దస్త్రాలను ఆన్‌లైన్‌లో ఎందుకు మంజూరు చేయకూడదని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగింది. వీటి కోసం రైతులు ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు ఇవ్వాలా అని అని వ్యాఖ్యానించింది. మహబూబ్‌నగర్ జిల్లాలో రెవెన్యూ, ట్రెజరీ, ట్రాన్స్‌కో శాఖల్లో నెలకొన్న అవినీతిపై వార్తాపత్రికల్లో ప్రచురితమైన వార్తల ఆధారంగా చేపట్టిన కేసు సోమవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బోసేల్, జస్టిస్ ఎస్‌వి భట్‌తో కూడిన ధర్మాసనం ‘ఒక వైపు ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతూనే, మరో చేత్తో పట్టారు పాస్‌పుస్తకం జారీకి రూ.2 వేలు, విద్యుత్ ట్రాన్స్‌పార్మర్‌కు రూ.4 వేలు’ అంటూ లంచాలు నిర్ణయించి వసూలు చేయడం ఏమిటని వ్యాఖ్యానించింది. ఇలాంటి అవినీతి చర్యల వల్ల రైతులు మరింత కుంగిపోతారని తెలిపింది. ఇలాంటి అవినీతిని నిర్మూలించేందుకు ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది మాట్లాడుతూ కోర్టు సూచించిన సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాననని తెలిపారు. అనంతరం ఈ కేసును రెండు వారాల పాటు వాయిదా వేసింది.