Others

ట్రెండ్ మార్చండయ్యా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా ప్రేక్షకాదరణ పొందాలంటే కథలో నవ్యత, కథనంలో పటుత్వం ఉండాలే తప్ప.. భారీ బడ్జెట్, పెద్ద హీరోలు, విదేశాల్లో చిత్రీకరణ కాదని ఎప్పటికప్పుడు నిరూపితమవుతూనే ఉంది. పెద్ద హీరోలు నటించిన పలు చిత్రాలు బాక్సాఫీసువద్ద బోల్తాకొడితే, పిల్ల హీరోలు పెద్ద విజయాలను నమోదు చేసి సవాల్ విసురుతున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అదుపులో లేని చిత్ర నిర్మాణ వ్యయం. ఒక పెద్ద చిత్రం నిర్మాణానికి అయ్యే ఖర్చులో సగానికి పైగా సినిమాలో నటిస్తున్న వారికి, సాంకేతిక నిపుణులకు పారితోషికాలు ఇవ్వడానికే సరిపోతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం క్రేజున్న హీరోలుగా ఉన్నవారు సోమరితనానికి బాగా అలవాటుపడినట్టుగా కనిపిస్తోంది. వీరు తక్కువ సినిమాలు చేస్తూ, తాము నటించిన సినిమాలు హిట్ లేదా ఫట్‌లకు సంబంధం లేకుండా ఎక్కువ పారితోషికం తీసుకోవడానికే ఇష్టపడుతున్నారు. మిగిలిన సమయంలో ఇతర వ్యాపకాలు లేదా వ్యాపారాల నిర్వహణలో మునిగి తేలుతున్నారు.
గతంలో ఎన్టీఆర్, ఎఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి తదితరులు ఎక్కువ సినిమాల్లో నటించేవారు. దీని కారణంగా, తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడు కళకళలాడుతూ ఉండేది. సినీ రంగానికి చెందిన కళాకారులు, సాంకేతిక నిపుణులకు చేతినిండా పనుండేది. అయితే, ప్రస్తుతం పెద్ద హీరోల ట్రెండ్ మారింది. ఏడాదికి ఒకటీ లేదా రెండు సినిమాల్లో మాత్రమే నటిస్తూ, తమ సినిమాలకు భారీగా ఖర్చు చేయిస్తున్నారు. సదరు సినిమా విజయవంతమైతే ఫర్వాలేదు. పరాజయం పాలైతే మాత్రం సదరు సినిమాను కొనుగోలు చేసిన పంపిణీదారులు, హైర్‌లు వేసినవారు తీవ్రంగా నష్టపోతున్నారు. అంతేకాకుండా పెద్ద హీరోల సినిమాల విడుదలకు ముందు, సదరు చిత్రం గురించి ఒక హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. దీనివల్ల చిత్రంమీద ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటున్నాయి. చివరకు సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా లేకపోతే, సదరు చిత్రం బాక్సాఫీసు వద్ద వెలవెలపోతోంది. హీరోలకు ఈమధ్యకాలంలో రికార్డ్‌ల పిచ్చి బాగా ముదిరిందన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. దీని కారణంగా సినిమాను ఎక్కువ థియేటర్లలో విడుదల చేయిస్తున్నారు. ఇది పంపిణీదారులకు ఒకవిధంగా మేలు చేస్తోంది. పెద్ద సినిమాను ఎక్కువ థియేటర్లలో విడుదల చేయడంవలన ఓపెనింగ్ కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. గతంలో సినిమాను ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలంటే ఎక్కువ ప్రింట్లు తీయాల్సి వచ్చేది. ఒక్కొక్క ప్రింటు 60 నుంచి 70 వేల వరకూ అయ్యేది. యుఎఫ్‌ఓ వచ్చిన తరువాత నిర్మాతలకు ప్రింట్లు ఖర్చు తగ్గిపోయింది. యుఎఫ్‌ఓకు అద్దెకడితే ఎన్ని షోలు కావాలంటే అన్ని షోలు శాటిలైట్ ద్వారా అందచేస్తారు.
హీరోల పారితోషికాలు ఎక్కువవ్వడంతో సినిమా నిర్మాణ వ్యయం పెరుగుతోంది. తమ సినిమాను అన్ని కోట్లు ఖర్చుచేసి రూపొందించామని విస్తృత ప్రచారం చేస్తున్నారు. తీరా సినిమా విడుదలైన తరువాత సినిమాలో ఖర్చేమీ కనిపించదు. ప్రేక్షకులు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని విషయాలు సులభంగా తెలుసుకోగలుగుతున్నారు. నిర్మాతలు తమ సినిమా బడ్జెట్‌లో అధిక శాతం పారితోషికాలకే ఖర్చైందని బహిరంగంగా చెప్పుకోలేని పరిస్థితి. దీంతో ప్రేక్షకులు -నిర్మాతలు తక్కువ ఖర్చుపెట్టి ఎక్కువ ఖర్చుచేసినట్టు గొప్పలు పోతున్నారని భావిస్తున్నారు.
అదే సమయంలో బుల్లితెర కూడ సినిమాల పాలిట పెనుభూతంగా మారింది. సినిమా టిక్కెట్ల ధరలు బాగా పెరిగాయి. బుల్లితెరలో శాటిలైట్ ఛానల్స్ పోటీలుపడి మనోరంజకమైన కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయి. ప్రతి సినిమా మూడునెలల లోపే ఏదొక ఛానల్‌లో ప్రసారమవుతోంది. దీంతో వందల రూపాయలు ఖర్చుచేసి సినిమా హాల్‌కు వెళ్ళడంకన్నా ఇంట్లోనే బుల్లితెరను నమ్ముకోవడం మంచిదనే భావనలో పలువురు ఉన్నారు. వీడియో పైరసీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో సినిమా ఒక్కటే ప్రజలకు వినోద సాధనం. కానీ, నేడు ప్రత్యామ్నాయంగా బుల్లితెర, ఇంటర్నెట్‌లు ఉన్నాయి. అందువల్లనే ప్రజలు వినోదం కోసం ముందు బుల్లితెర, తరువాత ఇంటర్నెట్ చివరగా థియేటర్‌ను ఆశ్రయిస్తున్నారు. ప్రజలను తిరిగి సినిమా థియేటర్లకు రప్పించాలంటే పెద్ద హీరోలు తమ పారితోషికాన్ని తగ్గించుకొని, నవ్యతతో కూడిన ఎక్కువ చిత్రాల్లో నటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ భవిష్యత్ సదరు పరిశ్రమకు చెందినవారి చేతుల్లోనే ఉందనేది నగ్నసత్యం.

-పి మస్తాన్‌రావు