మహబూబ్‌నగర్

హరిత ట్రిబ్యునల్ హెచ్చరించినా ఆగని పత్తి జిన్నింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, నవంబర్ 29: భారతదేశంలోనే ఎక్కడలేని విధంగా నడిగడ్డ ప్రాంతంలో సీడ్‌విత్తనోత్పత్తి పంటను ఈ ప్రాంత రైతాంగం పండిస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో జిన్నింగ్ మిల్లులు, డిలీంటింగ్ మిల్లులు పుట్టగోడుగుల్లా పుట్టుకొచ్చాయి. దేశంలోని అన్నిరాష్ట్రాల్లో పత్తివిత్తనాలపై జరిగే యాసిడ్‌ప్రయోగాన్ని నిషేదం విధించడంతో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో పండించిన విత్తనాలన్నింటిని గద్వాల ప్రాంతానికి తరలించి ఇక్కడ గాడ సల్ఫూరిక్ ఆమ్లంతో విత్తనాలపై ఉన్న దూదిని తొలగించేందుకు చేస్తున్న ప్రక్రియలో వేలాది లీటర్ల యాసిడ్ భూగర్భంలో కలుస్తోంది. గద్వాల పట్టణం చుట్టు వెలసిన ఈ జిన్నింగ్ మిల్లుల ద్వారా తాగునీటి పథకాలు, భూగర్భజలాలు తీవ్ర కలుషితవౌతున్నాయని ఆందోళనచెందుతూ మున్సిపల్ పాలకులు పర్యావరణ పరిరక్షణ సమితి, మానవహక్కుల సంఘాన్ని కలిసిన సంగతి విధితమే. పట్టణానికి సమీపంలో ఉన్న నాలుగు జిన్నింగ్ మిల్లుల్లో డీలింటింగ్ ఎట్టిపరిస్థిత్లో జరపరాదని అధికారులు హెచ్చరించినట్లు తెలిసింది. అదేవిధంగా మరో 14 జిన్నింగ్ మిల్లులకు పర్యావరణ అధికారుల నియమనిబంధనల ప్రకారం యాసిడ్ ప్రయోగం జరుపుకోవచ్చని తెలిపినట్లు వారు తెలిపారు. ఓవర్‌హెడ్ ట్యాంకును నిర్మించి యాసిడ్ ప్రయోగం జరిగిన తరువాత ఆ నీటిని ట్యాంక్‌కు ఎక్కించాలని అక్కడి నుంచి ట్యాంకర్ల ద్వారా హైదరాబాద్‌లోని ఫ్యాక్టరీల వ్యర్థాలను తరలించే ప్రాంతానికి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలిసింది. జిన్నింగ్ యజమానులు లిఖితపూర్వకంగా అన్ని అనుమతులతో జిన్నింగ్ నడుపుతామని హామి ఇవ్వాలని అధికారులు హెచ్చరించినట్లు తెలిసింది. ఇప్పటికే అధికారుల ఫిర్యాదులను, హెచ్చరికలను బట్టదాఖలుచేస్తూ 60శాతం పత్తి విత్తనాన్ని జిన్నింగ్ యజమానులు యాసిడ్ ప్రయోగం చేస్తున్నారని పర్యావరణ పరిరక్షణ సమితి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు న్యాయవాధి పూజారిశ్రీ్ధర్ తెలిపారు. గత మూడు రోజుల క్రితం చెన్నైలోని హరిత ట్రిబునల్ గాఢ సల్ఫూరిక్ ఆమ్లం విధానంపై కనె్నర్ర చేసింది. వెంటనే జిన్నింగ్ మిల్లులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికి ఈ ప్రాంతానికి చెందిన మిల్లు యజమానులు రాజకీయ పార్టీల ముసుగులో ట్రిబునల్ ఆదేశాలను భేఖాతర్ చేస్తూ యదేశ్చగా సల్ఫూరిక్ ఆమ్ల ప్రయోగాన్ని జరుపుతున్నట్లు పలువురు పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది కర్ణాటక ప్రాంతంలో ముందస్తు సీడ్ విత్తనోత్పత్తి పంట రావడంతో అక్కడి విత్తనాలను గద్వాల ప్రాంతంలోని జిన్నింగ్ మిల్లుల్లో డిలింటింగ్ చేస్తూ గద్వాల ప్రాంత పరిసరాల్లో సల్ఫూరిక్ ఆమ్లాలను వెదజల్లుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అధికారులకు ఈ ప్రాంత మిల్లుల యజమానులు సవాల్ విసురుతూ యదేశ్చగా జిన్నింగ్ కొనసాగిస్తూ పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్నారని పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.