బిజినెస్

5 ట్రిలియన్ డాలర్లకు దేశ ఆర్థిక వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాబోయే పదేళ్లలో జిడిపి 7 శాతమైతే సాధ్యమే
కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి జయంత్ సిన్హా
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: రాబోయే పదేళ్లలో స్థిరంగా 7 శాతం వృద్ధిరేటు నమోదైతే భారత ఆర్థిక వ్యవస్థ రెండింతలకుపైగా పెరిగి 5 ట్రిలియన్ డాలర్లను చేరుతుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా శనివారం అన్నారు. ‘జిడిపి వృద్ధిరేటు రాబోయే పదేళ్లలో 7 శాతం తగ్గకుండా నమోదైతే భారత ఆర్థిక వ్యవస్థ విలువ రెండింతలు పెరుగుతుంది. ప్రస్తుతమున్న 2 ట్రిలియన్ డాలర్ల నుంచి 4 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుంది. ఒకవేళ డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ బలపడితే 5 ట్రిలియన్ డాలర్లను తాకుతుంది.’ అని ఇక్కడ జరిగిన ఫిక్కీ ఎజిఎమ్‌లో సిన్హా అన్నారు. జిడిపి 4 ట్రిలియన్ డాలర్లను అందుకుంటే ఈరోజున్న తలసరి ఆదాయం 1,600 డాలర్ల నుంచి 3,500 డాలర్లకు పెరుగుతుందన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల ఆదాయం పెరుగుతుందని చెప్పారు. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరం దేశ జిడిపి వృద్ధికి కాస్త ప్రతికూల పరిస్థితులు ఏర్పడే వీలుండవచ్చని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాన్ని పెంచాలంటూ 7వ వేతన సంఘం చేసిన సిఫార్సులు అమలు, వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌తో జిడిపి వృద్ధికి ఆటంకం కలగవచ్చన్నారు. కాగా, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి), దివాళా పన్నుల అమలుకు తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతనిస్తోందని, వీటిని ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందించుకునేలా శాయశక్తులా ప్రయత్నిస్తున్నామన్నారు. అయితే ఈ పార్లమెంట్ సమావేశాలు బుధవారంతో ముగియనున్నాయి. (చిత్రం) జయంత్ సిన్హా