భక్తి కథలు

కాశీ ఖండం7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాత్రి అనెడి అరణ్య లతకి కరసాన పట్టించి చికిలీ చేయించిన గండ్రగొడ్డలి, నల్లవారిన సాంద్రాంధకార పరంపర అనే యజ్ఞవాటిక అగ్నిదేవుడి జిహ్వ, తారకలు అనే తెల్ల కలువల అడవిని కోసివేయడం కోసం తూర్పు దిశ ఎత్తిపట్టిన పల్లవాగ్రము, మిన్నుకి మన్నుకి- నిగి నేలలకి- ఏకత్వ శంకని పరిహరింప పాల్పడ్డ అవధి, సృష్టికి కంటి రెప్ప విప్పు, తొలి సంజ నెచ్చెలికాడు, వినతా మహాదేవి ముద్దుకొడుకు కుద్ర, సూర్య రథసారథి, పిచ్చుకుంటు, కట్టెర్రచాయ దేవర అయిన అరుణుడు ప్రాచీదిశా గర్భంలో ఉదయించాడు.
శీతకిరణబింబము వెలవెల వాలి అస్తమయ గిరిమీద అత్తమిల్లింది, ఓషధీవల్లీ మతల్లుల కాంతి వైభవ లక్ష్మి శైథిల్యం చెందింది. సూర్యకాంతమణులలో ఉబికి వెలికి వచ్చిన అగ్ని ప్రత్యుత్థానం చేశాడు.
సాంద్రాంధకారచ్ఛటా పటలం పంచబంగాళమై పారిపోయింది. ఉదయ పర్వత సాను తట గండోపలాలతో రెక్కల మూలభాగాలు నరకుట వల్ల కలిగిన వ్రణాలనుంచి స్రవించిన నెత్తురా అనే విచికిత్స ఉదయించగా కొన్ని భాస్కర కిరణాలు నింగిని ప్రసరించాయి.
విరగకాసిన వెనె్నలలోని తెల్లదనం కొంత క్రొత్త సున్నపురాయి ద్రవం అయింది. చిన్నారి పొన్నారి చిరుచీకటి మషీరసం అయింది. నిద్ర మేల్కొన్న- వికసించిన- పద్మముకుళాల పుప్పొళ్ళు హరిదళం అయింది.
ఎర్రని రంగు కల లేత తొలి సంధ్యారాగం కమనీయమైన జేగురురాయి వర్ణం అయింది. ఈ వర్ణాలు నాలుగు కలసి రాత్రి గడచిపోయిన వెనుక లోకాన్ని చిత్రించు తూలిక చందం అయిన లేలేత నవనీతమైన కొదమ యెండా తూర్పు దిశాకాంతకి అభినవం అయిన మాణిక్యపదకం అయింది.
ప్రాచీదిశాకాంత నిండు గర్భంలో రవి ఉదయించడానికి ప్రసవ దివసాలు ఆసన్నం అవగా, దానికి ముందు బాలాతపం అయిన ఆకాశం ఆ గర్భిణికికి ఇంకిలీకంతో అభ్యంగస్నానం ఆడించింది. తామరలు విరియగా సూర్యకాంతమణుల ధమనుల్లో అగ్నిరాజుకొంది. వెంటనే అంధకారం ఔరుసారు అయింది. కలువ పువ్వులు ముకుళించుకొనిపోయాయి. తూర్పు కొండపైన భాస్కరుడు దేవేంద్రుడి హజారపు సౌధాగ్రంమీది స్వర్ణకలశం మాదిరిగా అందగించింది.
వెనుకటి పాదాల గిట్టల నాడాల కొనలు తూర్పుకొండ సానువు మీద జారిపోకుండా మోపి, తీగలు సాగిన విధంగా అతి దీర్ఘాలైన అంగాలని పగ్గాలు ఒరికొని ఒత్తివుండ, వెల్లకిలపడి వెనుక ప్రక్కకి ఒరగి అసూరుడు తలక్రిందులుగా స్తుతిస్తూ వుండ, ఆలంబం లేక ఆకసంలో స్థల స్పర్శ లేక ధ్వని చేయక చక్రం తిరుగాడుతున్నది.
అంతరిక్షంలోని వాయు ప్రవాహ ఘట్టనంవల్ల కేతనం మీది బంగారు కింకిణులు ధ్వనులు ఒనరిస్తున్నాయి. మెరపు మెరసిన చందంగా సూర్యరథం ఆకాశవీధికి లంఘించింది.
అత్యంత వేగంతో ఏతెంచుతున్న సూర్యరథం ధూర్దండము (పోలుకర్ర) తాకి గ్రహాలు పగిలి పరాగాలు పైకి లేచి నింగి అంతటా వ్యాపిస్తున్నాయి. జెండా గుడ్డ అంచుల చలనమువల్ల పుట్టిన సమీరాల చేత చంద్రబింబం వణికిపోతున్నది.
ఏ విధంగానైనా పట్టుకొని గ్రసించాలనే వాంఛ చేత వెన్నుదన్ని వస్తున్న రాహువు పునఃపొందబడిన చక్ర బాధోపద్రవం కలది అయింది.
అలసిపోయిన హయాల నిట్టూర్పుగాలులచే విధూత మందాకినీ ప్రవాహ జలచరాలు కలవిన్నీ ఆకాశ పథ లంఘన జాంఘాలికాలైన రవి రథ ప్రయాణాలు దక్షిణాయనం అవడవంల్ల మలయదర్దుర గిరుల మీద సాగాయి.

-ఇంకా ఉంది