భక్తి కథలు

కాశీ ఖండం.. 174

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజీవలోచనా! శిష్యులు, నేను కలిసి ఆశ్రమంలోని శిలామఠంలో అన్ని భిక్షాపాత్రలలోని భిక్షాన్నాలు రాశిగా పోస్తాము.
పాయసం, అప్పాలు లేక అరిసెలు, పప్పు మొదలైన పదార్థాలు కలిసిపోయి కలగూరగంప కాగా వేర్వేరుగా విభజించి, అన్ని పదార్థాలలోని అర్థ్భాగం అతిథులకీ అభ్యాగతులకీ పాత్రలలో నింపి ప్రక్కగా పెట్టి వుంచుతాము. మిగిలిన సగమున్ను గంగాజలాల్లో ప్రక్షాళితం చేసి తర తమ్య వ్యత్యాసము అనుసరించి- వృద్ధులు ముందుండు రీతిగా క్రమంగా బంతి తీర్చి, ప్రీతితో అమృతాయతాం అని నేను ముందుగా ప్రాణహుతులు కైకొంటాను. అది చూసి నా శిష్యులు ప్రాణాగ్ని హోత్రం చేస్తారు. ఈ వ్రతం ఇంతకాలంగా ఈ విధంగానే చెల్లిపోతోంది.
అమ్మా! ఏమి చెప్పమంటావు. ఇటువంటి మహాద్భుతం ఇంతకుపూర్వం ఎప్పుడూ వినము. ఎప్పుడూ చూసి వుండము. ఒట్టుపెట్టిన విధంగా కాశీపురంలో భిక్షాన్నం పుట్టలేదు. నీ అడుగులపైన ఒట్టు- నిజంగా విన్నవిస్తున్నాను. నిన్నటి దినం మొదలుకొని మేమందరం శూన్యులం అయి నిట్ట్రుప వాసాలు వుంటున్నాము.
తరీళేక్షణా! శిష్యులు డస్సిపోయి అవురుసవురయి (బాధపడిపోయి), భిక్షాపాత్రలు, తాము కాశీనగరంలో అన్నానికి త్రోవకానక, ఉపాయం లేక తిరుగాడుతూ వుండగా, ఆ శిష్యులు ఏమయిపోతే నాకేమి? కించిత్తయినా ఓరిమి లేక నేనొక్కడనే నీ గృహంలో ఏ విధంగా భుజించగలను?
సూర్యుడు అస్తమించబోతున్నాడు. మరి నేను కాక ఛాత్రులు పదివేలమంది వున్నారు. వ్రతం విడిచిపెట్టి భుజించడం ఉచితం కాదు. నేను కూడ మాకు నిన్నటి దినానికి మరుసటి రోజు (్భజనం లేదని భావం)- యధార్థం సుమా!’’
అని వ్యాసుడు పలుకగా విని ఆ చంద్రానన దహాసం కావించి, ‘‘మంచిది. మునివర్యా! నువ్వు నీ శిష్య బృందాన్ని వెంటపెట్టుకొని శీఘ్రంగా రావలసింది- విశ్వనాథుడి కరుణాతిరేకం చేత ఎందరు అతిథులు చనుదెంచినా, కామధేనువు వశమై వున్నట్లు అనంతములైన కోరిన పదార్థాలనన్నిటినీ పెట్టుతాను’’ అని చెప్పగా ‘‘మహాప్రసాదం’’ అని వేదవ్యాసుడు శిష్యులను వెంట పెట్టుకొని గంగానదికి చని, స్నానం, ఆచమనం, అనుష్ఠానం మొదలైనవి ఆచరించి ఏతెంచారు.
గొడుగు పావకోళ్ల గిలకలు ధ్వనులు చెయ్యగా ఆ చంద్రబింబ సంకాశ వదన ఎదురుగా ఏతెంచి, శిష్య సమేతంగా పరాశరాత్మజుని బంతిని భోజనశాలలో సాగించింది.
తరువాత ఆ విశాలాక్షీదేవి మహిమవల్ల ఆ మహామునీశ్వరుల ముందర బంగారు వనె్న అరటి ఆకు పాత్రలలో చిత్ర విచిత్రంగా వంటకాలు ప్రత్యక్షం అయాయి. అపూపాలు, లడ్డులు, ఇడ్డెనలు, కుడుములు లేక మోదకలు, అప్పాలు, నిప్పట్లు, జిల్లేడుకాయలు, దోసెలు, గోధుమ పిండిలో పాలు పోసి వండిన పిండివంటలు, అంగరపూనెలు, జంతికలు, జొత్తరులు, చక్కిలాలు, మణుగుపువ్వులు, మరమరాల వుండలు, చెరకు ముక్కలు, ముద్దఖర్జూరం, ద్రాక్షలు, కొబ్బరికాయలు, పనసపండ్లు, నేరేడు పళ్లు, మామిడి పళ్లు, గజనిమ్మపళ్లు, దానిమ్మలు, వెలగపండ్లు, రేగుఫలాలు, గసగసాలు, పెసరపప్పు పులగాలు, చెరకుబెల్లాలు, అరిసెలు, తామరతూడు వరుగులు, చిలగడ దుంపలు, పల్చని వ్యంజనాలు, బులుపలు, పుల్లని వరుగులు, అప్పడాలు, పప్పులు, రొట్టెలు, చాపట్లు, పాయసాలు, దోసకాయలు, కాకరకాయలు, గుమ్మడికాయలు, నిష్పావకాలు, పొట్లకాయలు, బీరకాయలు, ఆనపకాయలు, మునగకాడలు, ఉదుంబరాలు, వంకాయలు, దొండకాయలు, పచ్చి తామర దుద్దులు, కంద దుంపలు, అరటిదూటలు, చారులు, తీపి కూరలు... ఇంకా ఏమి ఉన్నాయంటే...

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి