భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా -62

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయ్యప్ప స్వామి హారతి
ఓం ఓం ఓంకార రూపునకు
మంగళం జయమంగళం
నాద బిందు కళాతీత
గురుమూరితకి మంగళం జయ మంగళం
మందహాస భక్తవరదునకు
మంగళం జయమంగళం
పూర్ణాపుష్కళ నాధునకు;
భూతనాథునకు మంగళం జయమంగళం!
హారతి అందరూ భక్తిగా కళ్లకద్దుకున్నారు! తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు! అంతవరకు నిశ్శబ్దంగా కూర్చుని, కల్లు మూసుకుని అయ్యప్ప ధ్యానంలో నిమగ్నమై వుండిన వావరు, కొచ్చుకడత్త, కరప్ప, మల్లన్, విల్లన్‌లు ఒక్కసారిగా లేచి ‘‘స్వామియే శరణం! మిత్రా! నిన్ను విడిచి ఇక మేము వుండలేము! మమ్మల్ని నీలో చేర్చుకో స్వామీ!’’ అని పెద్దగా అంటూ నేలపై ఒరిగిపోయారు! వారి జవాత్మలు విడుదలై పరమాత్మలో విలీనమైనాయి!
అందరూ ఆ హఠాత్పరిణామానికి ముందు నిర్ఘాంతపోయినా కొద్దిసేపటికి తేరుకున్నారు! పూజారులు ఈ విధంగా చెప్పారు!
నవవిధ భక్తులు
‘‘ఈ నలుగురు అయ్యప్పకు ఆప్తమిత్రులు! ఆ స్వామిని మిత్రునిగా భావించి ఎప్పుడూ ఆయన దగ్గరే వుండాలని ఆశించడం కూడా భక్తి మార్గాలలో ఒకటి! ప్రజలారా! మీ కందరికీ తెలుసో లేదో మరి! మేము చెప్పేది జాగ్రత్తగా వినండి! భగవంతుని ఆరాధించి ఆ స్వామిని చేరుకోవడానికి నవ విధ (తొమ్మిది) భక్తి మార్గాలలు పురాణాలలో చెప్పబడ్డాయి. వాటిలో సఖ్యత్వం (స్నేహం, మైత్రి) ఆ స్వామిని సేవించడం ఒక మార్గం! పూర్వం విభీషణుడు, సుగ్రీవుడు స్వామితో మైత్రి చేసి ఆ మార్గాన తరించారు!
మిగిలిన ఎనిమిది మార్గాల గూర్చి చెబుతాము, వినండి!
1.శ్రవణం (వినడం) ద్వారా భగవంతుని ఆరాధించవచ్చును! భగవంతుని గూర్చి, ఆ స్వామి లీలల గూర్చి పెద్దలు చెబుతుంటే వినడం ద్వారా నక్త్భివం హృదయాలలో బలపడి ఆ మార్గాన స్వామిని సేవించడం జరుగుతుంది! పరీక్ష్మిన్మహారాజు వారం రోజులపాటు భాగవత పురాణాన్ని విని తరించిన విషయం మీకందరికీ తెలుసు కదా!
2.దాస్యం (సేవ చేయడం కింకరునిలాగా) భగవంతుని సేవించడం ఎంతటి పుణ్య ప్రదమో దాసాంజనేయస్వామి లోకాలకు తాను స్వయంగా ఆచరించి తెలియచెప్పాడు! ‘నన్ను నీ కింకరునిగా (సేవకునిగా) స్వీకరించు, వేరే ఏమీ అవసరం లేదు’ అని వేడుకుంటూ స్వామిని చేరుకోవడం ఒక భక్తిమార్గం!
3.వందనం- నమస్కరించడం కూడా ఒక భక్తిమార్గమే! పదే పదే నమస్కరిస్తూ ధ్యానించడంవల్ల భగవంతుని అనుగ్రహం సిద్ధిస్తుంది!
4.అర్చనం - షోడఓవపచారాలతో అర్చించడంమీదే భక్తిమార్గాన్ని సామాన్యంగా భక్తులందరూ అనుసరిస్తుంటారు!
5.సంకీర్తనం- స్వామి లీలలను పాడుతూ తరించడం! దీన్ని భజన అని కూడా అంటారు! స్వామి మీద పాటలు రాసి, వాటిని పాడుతూ, వాటిలో తాదాత్మ్యం చెందిన ఆనందానుభూతిని పొందడం ఒక భక్తి మార్గంగా చెప్పబడింది!
6.పాదసేవనం- స్వామి పాదాలను వత్తతూ ఆనందానుభూతి చెందడం! ఆ భాగ్యం అందరికి సులభంగా లభించేది కాదు! అయినా భక్తి మార్గంలో ఆ విధంగా పాదసేవనం చేస్తున్నట్లు అనుభూతి చెందవచ్చును! ఇది ఒక మార్గం! పరమ భాగోవోత్తములు అనుసరించేది!
7.స్మరణం- ఎల్లప్పుడూ స్వామి నామాన్ని స్మరిస్తూ (్ధ్యనిస్తూ) వుండటం వల్ల భగవదనుగ్రహం లభిస్తుంది! ‘నామస్మరణ ధన్యోపాయం’ (నామస్మరణ జన్మ ధన్యత్వం పొందే ఉపాయం) అని చెప్పబడింది! అందుకే నిరంతరం అయ్యప్ప నామస్మరణ చేస్తూ వుండటంవల్ల క్రమంగా ఆ భక్తి మార్గం మిమ్మల్ని స్వామి సన్నిధికి చేరుస్తుంది!
8.ఆత్మ నివేదనం- జీవాత్మను పరమాత్మకు నివేదన చేయడం భక్తి పరాకాష్టను తెలుపుతుంది! నా సర్వస్వాన్ని నీకు అర్పిస్తున్నాను! నాకే కోర్కెలు లేవు! నన్ను నీలో ఐక్యం చేసుకో! అని ఎప్పుడైతే నిర్మలమైన మనస్సును స్వామికి అర్పణ కావిస్తారో వాల్లను తనలో ఐక్యం చేసుకుని ముక్తిని ప్రసాదిస్తాడు భగవంతుడు! ఈ విధంగా స్ర్తిలు ఆత్మ నివేదన చేయడాన్ని ‘మధురభక్తి’ మార్గమని గూడా అంటారు!
స్ర్తి రూపంలోని జీవాత్మను పురుష రూపంలో ఊహించుకుంటూ ఆత్మనివేదన చేసి ముక్తి పొందడానికి గోపికలను ఉదాహరణగా చెప్పుకోవచ్చును! వాళ్లు నిర్మల హృదయాలతో శ్రీకృష్ణునిలో తాదాత్మ్యం చెందాలని కోరుకున్నందువల్ల వాళ్లందరికి ముకితని అనుఘ్రహించాడు శ్రీకృష్ణపరమాత్మ! భక్తులారా! మీకు సందర్భం వచ్చింది గనుక నవ విధ భక్తుల గూర్చి తెలియజెప్పాము! ఈ నలుగురు సఖ్య భక్తిమార్గంలో అయ్యప్పస్వామిలో ఐక్యమైనారు! వాళ్లు ధన్యజీవులు! వీళ్లకు దహన సంస్కారాలు కావించి పంపా నదిలో తర్పణాలు విడవండి! మీరందరూ మీకు అనుకూలమైన మార్గాలలో అయ్యప్పస్వామిని ఆరాధించి ధన్యులు కండి!’’ పూజారులు చెప్పిన విషయాలను ఏకాగ్రతతో, భక్తిశ్రద్ధలతో విన్నారు రాజులు, ప్రజలు గూడా!

-ఇంకా ఉంది

-డా. టి. కళ్యాణీ సచ్చిదానందం