భక్తి కథలు

కాశీ ఖండం.. 69

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది ఏ లోకం? మిక్కుటంగా అచ్చెరువు గొల్పుతూ వుంది?’’ అని ప్రశ్నించాడు. అంత విష్ణ్భుటులు సుశీల పుణ్యశీలురు శివశర్మతో ఈ పగిది వచింపసాగారు.
‘‘మధురాపట్టణం ద్విజప్రవరా! శివశర్మా! వేదములు, షట్ఛాస్త్రాలు, ఆగమాలు అనే జలధికి చంద్రోదయా! ఇది చంద్రలోకం. ఈ ప్రోలుని చంద్రుడు తన కిరణాంకూర శిఖా నిర్గత సుధానిధులతో భాస్కర తీక్షణ కిరణ సంతప్తమైన ఈ విశ్వాన్ని రక్షిస్తూ ఏలుతూ వుంటాడు.
సృష్టి ప్రారంభకాలంలో బ్రహ్మదేవుడు తన నేత్రాలనుంచి మరీచి ప్రజాపతిని, హృదయనుంచి భృగుప్రజాపతిని, శిరస్సునుంచి అంగిరసుడిని, ఉదా నుంచి పులస్త్య బ్రహ్మని, వ్యానం నుంచి పులహప్రజాపతిని ప్రాణం నుంచి దక్ష ప్రజాపతిని, అపానం నుంచి క్రతువునీ, శ్రోత్రం నుంచి అత్రి ప్రజాపతినిన్ని, సమానం నుంచి వశిష్ఠుని, సంకల్పం నుంచి ధర్మప్రజాపతిని సృష్టించాడు. ఆ ప్రజాపతులందరిలో అత్రి మునీశ్వరుడు మూడు వేల దివ్య సంవత్సరాలు సాటిరాని నిశ్చలభావంతో తపస్సు కావించాడు. అది మిక్కిలి ఆశ్చర్యజనకం! ఆ అత్రి మహాముని తేజోరస ప్రవాహం ఊర్థ్వ ముఖమై బ్రహ్మ రంధ్రాన్ని తాకు విధంగా పైకి ఎగసింది.
బ్రహ్మ రంధాన్ని తాకేటట్లు ఊర్థ్వంగా ఎగబ్రాకి ఆ ఇంద్రియం నేత్ర గోళాలలోకి ఓడికలు కట్టింది. నేత్రగోళాలు అంచులు దిగువార నిండుగా క్రమ్మి ఆ ముని వీర్యం వెండి మాదిరి తెల్లని కాంతితో దశదిశలా పడి ధారలై ప్రవహించింది. గంగా ప్రవాహం మాదిరి స్రవిస్తూన్న ఆ తేజస్సును తాల్చి పది దిక్కులున్ను గర్భవతులు అయాయి. ఆ దిక్కులు నవమాసాలు మోసి పూర్ణగర్భలయి ప్రసవించే మాసం సమీపించగా ఆ గర్భభారాన్ని భరించే శక్తి లేక- చాలక- వడకి వడకి ధరణి పయిన వ్రాలిపోయాయి. ఆ దిశా దేవతల గర్భములనుంచి ఉప్పతిల్లిన వీర్యం కరుడుకట్టి చంద్రుడయింది. తర్వాత సకల జగద్ధితంగా పద్మసంభవుడి ఆన తలదాల్చి అతడి దివ్య రథం అధిరోహించి పద్దెనిమిది దీవుల్లోను సంచరించి తనకు తానుగా వృద్ధి పొందింది. ఆ చంద్రుడి తేజఃప్రసరణం కారణంగా సకల లోకోపకారకాలైన నదీ నదాలు ఉద్భవించాయి. ఆ వడువున సంచరించి ఆ అమృత కిరణుడు అవిముక్త స్థానంలో చంద్రేశ్వరుడు అనే పేర చంద్రవౌళీశ్వర స్వామిని తన పేర ప్రతిష్ఠించాడు. ఆ స్వామి చెంత అమృతోదము అనే కుండాన్ని నిర్మించి ఆ కుండం అంచున అనేక దేవతా సంవత్సరాలు తపస్సు సలిపాడు. సదాశివుడి కరుణవల్ల ఓషధులకి, జలాలకి, విప్రులకి రాజు అయినాడు. ఆ పరమ శివానుగ్రహన ఆ శీతకిరణుడు గంగ తరంగిణికి వాసస్థలం అయిన స్మరహరుడి జటాజూటాగ్రమందు చేరి మల్లికా కుసుమ గుచ్ఛము ఠేవను హవణిల్లుతున్నాడు. ఆ అపరాధానికి హిమాంశుడు ఆమె ప్రణయ కలహాన్ని ఒలగించు తరిని పార్వతీ ఏవి సుందర చరణార వింద నఖములతో తడి ఆరని క్రొత్తలత్తుక పూత అంటి యెడ యెడ పాటల వర్ణాన్ని పొందుతూ వుంటుంది. పెద్దకాలం కాశీక్షేత్రంలో తపస్సు ఒనర్చిన హేతువు వల్ల కలిగిన బహుళక్లేశం పోవుటకా అనేటట్లు సమస్త కువలయ మండలానికి ఏకచ్ఛత్రాధిపత్యం వహించి రాజసంతో పరిపాలించాడు.
అనంతరం ఆ వారణాసిలో బ్రహ్మ, అత్రి, భృగుడు- ఈ మువ్వురున్ను ఋత్విక్కులనుగాను, శ్రీమహావిష్ణువుణ్ణి సదస్యుడిగాను ఎన్నుకొన్నారు. సిని, కుహువు, ధ్యుతి, పుష్టి, ప్రభ, వసు, కీర్తి, ధృతి, లక్ష్మి- పేరుల తొమ్మండుగురు ధర్మపత్నులతో ఉమామహేశ్వర ప్రీతికై రాజసూయయాగం ఒనర్చారు.
-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి