భక్తి కథలు

కాశీ ఖండం.. 106

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిక్కిలి భయంకరం అయిన అడవి ఏనుగుని అల్లన మాలిమి చేసుకొని మావటివాడు దాని కంఠసీమలో గుదియని అమర్చి, సుఖంగా ఏ కష్టమూ లేకుండా- ఎక్కే విధంగా యోగ సాధకుడు నిరంతరమున్ను స్వభావం చేత నియమించడానికి అలవికాని ప్రాణవాయువుని మచ్చిక చేసుకొని శ్రద్ధతో అవధానతతో నిలుపుకోవాలి.
శరీరంలోని ప్రాణవాయువు ఎడమ నుంచి కుడి మార్గం నుంచి వెలుపలకి ప్రయాణం చేస్తూ వుంటుంది. కనుక యోగ సాధకుడు ప్రాణానిలాన్ని మెల్లగా చంద్రనాడి లేక ఇడానాడిచే పూరించి, సూర్యనాడి లేక పింగళనాడి నుంచి వెలుపలికి విడిచిపెట్టుతాడు.
అగస్త్య మహర్షీ! పద్మాసనం, మయూరాసనం, స్వస్తికాసనం- ఇత్యాది ఆసనాలని అభ్యసించడంవల్ల దేహ దార్థ్యం ఏర్పడుతుంది. ప్రాణవాయువు నియమంగా అభ్యాసం చెయ్యడం కారణంగా పాప సమూహలన్నీ తొలగిపోతాయి. ప్రత్యాహార క్రియని అభ్యసించడం చేత శరీరంలో పావనత్వం సిద్ధిస్తుంది. తర్వాతి అంగమైన ధారగా క్రియయందలి ధురంధర్వతంవల్ల చంచలమైన చిత్తానికి నిశ్చలత్వం ఏర్పడుతుంది. ఐదవ అంగం అయిన ధ్యానం పాటించడంవల్ల ఈశ్వర దర్శనం లభిస్తుంది. చివరి అంగం అయిన సమాధివల్ల సంచిత, ఆగామి, ప్రారబ్దాలనే వ్యాపారంలో అన్ని కర్మలని నిర్మూలించ సమర్థమైన మోక్షాన్ని ఒసగుతుంది.
దహని అంటే- భ్రామణి అంటే- స్తంభని అనగా శమని అనగా- ప్లావని అనగా యోగభ్యాసంవల్ల ఫలించిన మతులు కలవారు ప్రాణవాయువు ధారణలు అయిదు విధాలు అని పలుకుతారు.
ఉడ్డీనముద్రయున్ను మహాముద్రయున్ను, మూలబంధముద్రయున్ను, గగన ముద్రయున్ను, జాలంధర ముద్రయున్ను అని యోగ ముద్రలు అయిదు వున్నవి సుమా!
నాడీ శోధనకు ఇడాపింగళనాడుల సమ్మేళనంలోను (ఇడాపింగళనాడుల సమ్మేళనంలో) రస సంశోషణంలోను మొదటిదైన మహాముద్రకి వినియోగం, కపాల గుహలో జిహ్వను ప్రవేశపెట్టి భ్రూమధ్య ప్రదేశంలో దృష్టిని నిల్పడం ఖేచరీముద్ర. (బ్రహ్మరంధ్రంలో అపాయం లేని చంద్రమండలామృత ధారల నిష్యందనాన్ని ఆస్వాదించడానికి) ఉడ్డీనమైన ప్రాణ హంసను దివారాత్రాలు బంధించడానికి ఉడ్డీనయాన ముద్రయున్ను, నాడీ సమూహాన్ని ధరించడానికి వినియోగించేది జాలంధరీ ముద్ర. అపాన మూలభాగాన్ని బంధించడానికి వినియోగించేది మూల బంధ ముద్ర. ఈ అయిదు ముద్రాబంధాలున్ను సమాధి నిలవడానికి కారణాలు. బిందువుని స్థిరీకరించడానికి హేతువులు.
ఊర్థ్వంలో వున్న ప్రాణవాయువుని క్రిందవున్న అపాన వాయువున్ను, క్రిందవున్న అపాన వాయువుని పైన వున్న ప్రాణవాయువున్ను ఒకదానినొకటి సడలిపోకుండా ఒడిచిపట్టి లాగుతూ వుంటాయి. ఈ ప్రాణగ్రంధి ఎన్ని నాళ్లు వుంటుందో అన్ని నాళ్లు మన శరీరాలు సజీవంగా వుంటాయి. ఎప్పుడయితే ప్రాణగ్రంథి విడిపోవగానే మన శరీరాలు నిర్జీవాలు అవుతాయి.
జీవుడు లేక జీవాత్మ మాటిమాటికిన్ని పడరాని పాట్లు పడుతూ వెలుపలకిని, లోనికిని, లోనికిని ఆరోహణావరోహణలు చేస్తూ ప్రాణపాన వాయువుల చేత సంతతమున్ను క్రిందికినిన్ని మీదికిన్ని లాగబడుతూ వుంటాడు. లేక వుంటుంది.‘హం’ అనే అక్షరంతో వెలుపలకి రావడమున్ను, ‘స’కారంతో లోపలికి పోవడమున్ను చేస్తూ, ‘హంస’ ‘హంస’ అనే ప్రణవాక్షరానికి మూలభూతం అయిన అజపామంత్రంతో రేయింబవళ్లు జీవుడు ఇరవై యొక్క వేల ఆరు నూర్ల మారులు ఉచ్ఛ్వాశ నిశ్వ్వాస రూపంలో జపిస్తాడు.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి