భక్తి కథలు

కాశీ ఖండం.. 117

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మ దేవుడు నాకీ సుందర రూప లావణ్యాన్ని సౌభాగ్య సంపదని ఎందుకు ఒసగాడు? కులం, శీలం, రూపం, ఆదిగాగల గుణాల్ని పరీక్ష చేసి ఎవరికి నన్ను నేనే ఇచ్చుకోగలను?’’ అని ఈ భంగి దుఃఖభార జనితం అయిన వివేకంతోడి వైరాగ్యం పొంది ఉత్తరాదిత్యుడి సమీపంలో ఉగ్రతపం ఆచరించింది.
నిత్యం నిష్ఠతో ఆ విప్రకన్య సులక్షణ కాశీలోని ఉత్తరాదిత్యుడి పార్శ్వభాగంలో తీవ్ర తపం చేసింది. ఆ విధంగా తపస్సు ఒనరిస్తూ వుండగా ఒక మేక చెలికత్తె లాగువచ్చి స్నేహం చేసింది. దానిపట్ల కలిగిన ప్రేమాతిశయం చేత సులక్షణ ఆ మేకను అల్లారుముద్దుగా చూసుకొంటూ వుంది.
రాత్రివేళ గరిక చిగురులు చర్వణం చేసి చేసి, ఉత్తరాదిత్య కుండంలో తీర్థం ఆడి పగటి నాల్గు జాములున్ను పద్మలోచన అయిన సులక్షణని ఆ నెలమోక వయస్సు మేక వత్సలతతో సేవించసాగింది.
అంత చిరకాలానికి శంకరుడు సాక్షాత్కారం చేసి వరం వేడు అన ఆ సులక్షణ ఆ శివుడికి ప్రణామం ఒనర్చి, ఈ భంగి పలికింది.
‘‘స్మరదమనా! రుూ చిన్న మేకపిల్ల కూర్మి చెలికత్తెలాగు నన్ను విడిచి పెట్టడంలేదు. పరమ శివా! ఈ నోరులేని జంతువుకి మొదట వరం ఇవ్వు. ఆ వెనుక నాకు వరం ప్రసాదించు’’ అని కోరింది.
ఆమె కోరిక ఆలించి శంకరుడు కరుణాసహితం అయిన కడగంటి చూపుతో ఆ సులక్షణని వీక్షించి, పార్వతీ దేవి హృయాభిప్రాయాన్ని అనుసరించి మేకపిల్ల భావి జన్మలో కాశీరాజు పట్టమహిషికి కుమార్తె అయి పుట్టునట్లు వరాన్ని ప్రసాదించాడు. ఆ మేక పిల్ల పేర (బర్కరి-మేక) ఆ ఉత్తరాదిత్య కుండం బర్కరీకుండం అని పేరు పొందింది. సకల గుణానురాగి అయిన గౌరీదేవి సులక్షణని తనకు చెలిమికత్తెగా కైకొని జయ, విజయ, జయంతిక, శుభానంద, సునంద, కౌముది, ఊర్మిళ, చంపకమాల, మలయవాసిని, కర్పూర తిలక, గంధధార శుభ, అశోక విశోక, కమలగంధి, చందన నిశ్వ్వాస, మృగమదోత్తమ, కోకిలాలాస, మధుర భాషిణి, గద్యపద్య నిధి, అనుక్తజ్ఞ ఆదిగాగల చెలికత్తెలను పోలె బాలబ్రహ్మచారిణి అయిన ఆ అళి నీలవేణిని ఆదరించింది. ఇది ఉత్తరాదిత్య మహాత్మ్యం’’ అని వివరంగా విశదం కావించాడు కార్తికేయుడు’’ అని సూతుడు వ్రాక్కుచ్చాడు. అంత నైమిశారణ్యవాసులు ‘‘మహాత్మా! ఇంకా కాశీపుర పంచక్రోశ క్షేత్రంలో వున్న దేవతాస్థానాలు, పుణ్యతీర్థాలు వివరంగా వచించి మమ్మల్ని ధన్యుల్ని చేయవలసింది’’ అని కోరారు.
పంచమాశ్వాసము సమాప్తము

ఆరవ ఆశ్వాసము
అనంతరం ఆ కథకుడు శౌనకాది మహామునులకి ఈ విధంగాను నుడవసాగాడు.
మహాత్మ్యము
యదువంశంలో భూభారాన్ని తొలగించడం కోసం దుష్టదానవుల గర్వం హరించడం కోసమున్ను పద్మనాభుడు అయిన విష్ణుమూర్తి దేవకీ వసుదేవులకి ఉదయించాడు. ద్వారకా పురాధిపతి అయిన ఆ హరి అంతఃపుర సహస్రాలకి లక్ష యెనిమిది వేల నందనుల్ని కాంచాడు. పూజనీయాలైన అష్టమహిషుల్లో ఒకర్తె అయిన జాంబవతి సాంబుడు అను పుత్రుణ్ణి కన్నది. ఆ కుమారుడు సాంబుడు లేబ్రాయంలో వీధిలో ఒకనాడు చెలికాండ్రతో విహారం సల్పుతూ వుంటే ఎక్కడినుంచో నారదుడు ఏతెంచాడు.
ఆట యందలి అత్యంతాసక్తిచేత ఆ మధుకైటభ వైరిసుతుడు సాంఖుడు బ్రహ్మమానస పుత్రుడైన నారదుణ్ణి గౌరవభావంతో గణింపలేకపోయాడు.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి