భక్తి కథలు

కాశీ ఖండం.. 133

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దత్తాత్రేయుడు, భృగుడు, వామనుడు, నరనారాయణుడు, విదారణ నరసింహుడు, గోపీగోవిందుడు, లక్ష్మీనృసింహుడు, శేషమాధవుడు, శంఖమాధవుడు, హయగ్రీవ కేశవుడు, భీష్మకేశవుడు, నిర్వాణ కేశవుడు, త్రిభువన కేశవుడు, జ్ఞానమాధవుడు, శే్వతమాధవుడు, ప్రయాగ మాధవుడు అనే పదహారు దివ్య రూపాలు తాల్చి అనేక ప్రదేశాల్లో వుంటాను. ఈ తీర్థాలన్నీ నా నామధేయ వ్యవహారంతో పిలువబడతాయి.
ఓ అనఘాత్మా! ప్రయత్నించి నీకు ఒక రహస్యాన్ని చెపుతాను. వినవలసింది. ఈ రహస్యాన్ని సజ్జనులకే తప్ప దుర్జనులకి ఎపుడు చెప్పవద్దు. మహాశ్మశాన నగరంలో అంటే కాశీనగరంలో పలు తీర్థాలు వున్నాయి. ఈ తీర్థాలన్నీ గొప్ప మహిమలో మణికర్ణికా తీర్థాన్ని పోలవు. ఇది ముమ్మాటికీ నిక్కం.
మణికర్ణికా ప్రభావ వర్ణనము
మణికర్ణికా తీర్థం కేవల్య లక్ష్మీ సంపన్నం అయిన కాశీపుర లక్ష్మికి చెవిలోని మణులతో కూర్చిన దుద్దు. మణికర్ణికా తీర్థమే చంద్రకళాశేఖరుడైన శివుడికి జలక్రీడలు ఆడే తామరల నడబావి. పాదోదక తీర్థం, పంచనద తీర్థం ఆదిగాల మహాపవిత్ర తీర్థాల కన్నా ఉత్తమం అయినది. వేదములు, పురాణములు, శాస్త్రాలు అనే విద్యలకి అంగడి వీధిలోని మాణిక్యం. పంచమహా పాతకాలు అనే అంధకారాలను ఛేదించే సూర్యమండలం మణికర్ణిక. బ్రహ్మదేవుడి స్వర్ణకమలండలువు పుక్కిట పట్టిన జలాన్ని ధరించినది మణికర్ణిక. అతిశయించే కైవల్య శుభసమూహాలకి గని. అయిదు క్రోసుల మేర కల అవిముక్త క్షేత్రం అనే పద్మంలోని తేనె ప్రవాహం మణికర్ణిక!
బిందుమాధవుడు అనే నామం ధరించిన నాకు అత్యంతమూ ప్రేమపాత్రం. మందాకినీ గగన గంగా మధ్య నాభి చక్రం మణికర్ణిక. నరనారాయణ రూపాన్ని తాల్చిన విష్ణువునయిన నాకు విహారవాటిక. గరుడులు, అకాశ సంచారులు, విద్యాధరులు, కిన్నరులు, గంధర్వులచే సంసేవిత. డుంఠి వినాయకుడు గండభాగ జనిత మదజలం కటువులైన ప్రవాహ జలాలు కలది. నీలకంఠ మకుటాలంకారం అయిన చంద్ర కళానిర్గళిత రోచులచేత చుళికింపబడ్డ జలాలు కలది మణికర్ణిక. మణికర్ణికకి చెందిన తీర్థంలో స్నానమాడిన మానవుడు భ్రూణహత్యాది దురితజాలాన్ని నిమేష మాత్రంలో తొలగించుకోగలడు. కాశీనగరంలో ఎన్ని తీర్థాలు వున్నాయో ఆ అన్నీ కదలివచ్చి మధ్యాహ్నకాలంలో రాశీభూతాలై ప్రతిదినం మణికర్ణికాతీర్థాన్ని ఆశ్రయిస్తాయి.
మధ్యాహ్న సమయం ఆసన్నం కాగా నేను, మన్మథ వైరి శివుడు బ్రహ్మయున్ను సాధ్యసిద్ధ గంధర్వాదులతో మణికర్ణికాతీర్థాన్ని సంసేవిస్తాం. మధ్యాహ్నవేళకి పన్నగేశ్వరులైన వాసుకి, శేషువు స్నానమాడ మణికర్ణికి ఏతెంచుతారు. ఉత్తర వాహిని అయి ప్రవహించే గంగానదికి మణికర్ణిక ఉత్తమ భూషణం. ప్రాతఃకాలంలో నిత్యమూ ‘మణికర్ణిక’ అని ఉచ్చరించే మానవులకి అరచేతి ఉసిరికలు మోక్ష సంపదలు- మణికర్ణిక ఒక దానానికి కోటి దానాల ఫలం ఒసగుతుంది. ఒక పూర్తము (వాపీకూపతటాకాది సప్త సంతానాల్లో ఒక్కటి అయినా) కోటి పూర్తాలతో సమం అయి నరులకి ఫలం ఇస్తుంది. ఒక యాగం కోటి యాగాలు చేసిన ఫలంతో సమాన ఫలం ప్రసాదిస్తుంది. ఒక ధర్మం కోటి ధర్మాల సమయమై నరులకి ఫలం ఒసగుతుంది. ఉదయకాలంలో ఏ మానవుడు మణికర్ణిక ఉదకాల్లో మాఘమాసంలో క్రుంకులిడితాడో ఆ మానవుడికి దేవతలు సేవాంజలులు కిరీటాల ఘటిస్తారు. మణికర్ణికలో హరిశ్చంద్ర తీర్థంలో ఏ మానవుడు ఏకాగ్రతతో పితృతర్పణాలు విడుస్తాడో ఆ మానవుడికి పితరులు శుభ పరంపరలు కలిగిస్తారు. మణికర్ణిక తీర్థతటంలో హరిశ్చంద్రేశ్వరుడు అనే గణనాథుడిని పూజిస్తారు.

- ఇంకా ఉంది