భక్తి కథలు

కాశీ ఖండం.. 141

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతేకాదు, శత్రు జయ భాసురుడైన ఆ గజాసురుడు కాశీ పట్టణంలోని భారీ భూతేశ్వరుడి ప్రకార గోపుర ప్రాంగణాల్లో మదజలధారలు వర్షిస్తాడు. ఖఖోల్కాదిత్య, భవన ప్రాంత మహావృక్ష శాఖతో తన గండ భాగాన్ని ఒరసుకొంటాడు. తన తొండంతో గండూషించిన నీటి తుంపురులతో ద్రుమి చండేశ్వరుణ్ణి తొప్పదోగిస్తాడు. శంకుకర్ణేశ్వర స్థాన మాణిక్య వేదికతో వప్రక్రీడలాడతాడు. ప్రమథులు పారిపోగా పారిపోవగా వెన్ను దవిలి వేటాడుతాడు. భూతాలు కళవళపడిపోయే రీతిగా గర్జన కావిస్తాడు. ఎదురులేక కాశీపురంలో ఇచ్చవచ్చిన రీతిగా చెలరేగిపోసాగాడు.
గజాసురుడీవిధంగా చెలరేగి సంచరించి గజి బిజి చెయ్యగా ప్రజలు భయంకపితులై తామరాకుపైని నీటిలాగు కలత చెందారు. చలించిపోయారు.
గర్వాంధకారంతో కన్నుగానక ఈ గతి గజాసురుడు పరాక్రమాటోపంతో చివ్వకు చేయిసాచిన్నీ, కయ్యానికి కాలుద్రవ్వియున్ను తన్ను సమీపించగా కన్నుల నవ్వుల వెనె్నలలు కురుస్తూ కాశికా పురాధీశ్వరుడు శ్రీ విశే్వశ్వరుడు రాక్షస సేనలకు ప్రళయకాలం అయిన త్రిశూలాన్ని అత్యంతవేగంతో విసరాడు.
కోటి రవితేజభాసమానం అయిన ఆ త్రిశూలాయుధం గజాసురుడి కుంభస్థలంలో నాటుకొని ఆ రాక్షసేంద్రుడి రక్త్ధారలతోనే పాపాల్ని బిందువు కూడా మిగులకుండా స్రవింపచేసి తిరిగి శివుడి కడకు ఏతెంచింది.
అంత ఆ రాక్షస రాజు గజాసురుడు విశుద్ధాంతరంగంతో విరూపాక్ష దేవుణ్ణి బహువిధాల ప్రస్తుతించాడు. అప్పుడు విశే్వశ్వర శ్రీమన్మహాదేవుడు ప్రసన్నుడయి ‘‘గజాసురా! వరం వేడుకో’’ అని పలికాడు. దనుజరాజు మృత్యుంజయుడితో ‘‘పుట్టిన జీవులన్నింటికి మరణాలు నియతాలు, తప్పనిసరి. నాబోటి ధన్యుడు ఎవడు వున్నాడు? చరాచరమైన బ్రహ్మదేవుడి సృష్టికి పట్ట్భాషిక్తుడివి అయిన రాజువి. వినమ్రులైన దేవతల శిరోమకుట మణికాంతులచే ప్రకాశించే నీ పాదద్వందం- నా అవసానాకాలంలో కనుగొనగంటిని.
నువ్వు దయాశరధివి. నీ త్రిశూలాయుధంతో చీల్చిన ఒడలి చర్మాన్ని పచ్చడంగా ధరించి వుండు. నెత్తురు బొట్లు ఉట్టిపడుతూ వుండగా నువ్వు ఆ చర్మాన్ని తాల్చాలి.
అంధకాసుర భంజనా! నీకు నా పయిన దయాగుణం కనక వుంటే నీ మూపుమీద నా ఒడలి తోలు ఎన్నడు పాయక వుండే రీతిని చూడు. అది దుర్వాసనలు ప్రసరింపక, కురుకుగాక, చిరుగక వెండికొండపై వినీల మేఘ శకలం భాతిని నా తోలుతిత్తి వుండాలి. నేను నిన్ను కోరే వరం ఇదే సుమా! అనుగ్రహించు స్వామీ!’’ అని వేడుకొన్నాడు.
అంతశ్రీత దయాళువైన పినాకపాణి గజాసురుడు వేడిన వరం ప్రసాదం చేసి, అంధకారసుర వైరి కృత్తివాసుడు అయాడు. అది హేతువుగా ఆ తీర్థం కృత్తివాసతీర్థం అనే ఖ్యాతిలో అలరారింది. విషమం అయిన సంసారం అనే దురితం యొక్క విషాన్ని విరచడానికి విషవైద్యుడివంటిదయి, ఆకాశగంగా తీరంలో పరమ ప్రఖ్యాతిని వహించింది. ఇవికాక అనంత తీర్థాల విషయం ఆకర్ణించవలసింది.
కలహంస తీర్థాది మహాత్మ్యము
అగస్త్యమునీశ్వరా! ఆశ్చర్యకరమైన ఒక విషయాన్ని ఆలించు. ఆకాశవీధిలో రెండు కాకుల కా, కా ధ్వనులు తమ్ము కనుగొనేటట్లు చెయ్యగా కోలాహలంతో క్రూరంగా పోరాడి సరస్సులో పడిపోయి, లోకం సకలమూ వీక్షింపగా కల హంసలుగా మారిపోయారు. (నల్లని కాళ్లు, నల్లని ముక్కు కల హంసలు కలహంసలు) కాశీక్షేత్ర ప్రభావాల ఔన్నత్యాలు ఈ విధమైనవి సుమా! కాకులు కలహంసలుగా మారిన ఈ తీర్థం కలహంస తీర్థంగా పేరుపొందింది.
ఇంకాఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి