భక్తి కథలు

కాశీ ఖండం.. 154

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన సాటివాళ్లకి భయపడి ఇల్లు పాడుపెట్టి దాగుకొనపోతే మనతోటి యిండ్లవాళ్లు నవ్విపోరా? వెరపు చెందడానికి అది పిట్టయా? దయ్యమా?
అదీ పక్షియే. నేనూ పక్షినే. పెసరగింజకి పెసరగింజ తక్కువ అవుతుందా? ఓసి అబలా! ఇటుచూడు. ఆ డేగ పొగరుని నా వక్రమైన ముక్కుపుటాగ్రాలతో పొడిచి పొడిచి అణచివేస్తాను.
మగ కపోతం ఈ కరణి వాకొనగా ‘‘్ధర్మోజయతి’’ అని ఆడు పావురం ఊరక వుంది. అంత మరుసటి నాటి రేపకడ ఆ శే్యనం త్రివిష్టపేశ్వరుడి ఆలయ భవనంమీద బయలువెడలే వాకిలిని కాచుకొని పొంచి వుంది. పావురాల జంట సంచారార్థం దిక్కులకి వెడలపోగా- తన ఉక్కు దండం వంటి ముక్కుతో అంకుశాలని పోలిన కాలి నఖాగ్రాలతో ఆ కపోత దంపతుల్ని ఒడిసిపట్టి కరచిన్నీ నొక్కిపట్టిన్ని ఒక ఏకాంత ప్రదేశంలో భక్షింపగోరి అంతరిక్షంలో దవ్వుగా కొంపోయింది. అంత చేసేది లేక ఏ దిక్కుకిపోతున్నదీ తెలియక చీకాకుపడ్డా, తెలివితేటలు కల ఆడు పావురం తన భర్తని నిశ్చలంగా కనుగొని డేగ కాలుని కరవమని కనుసైగ చేసింది.
వెంటనే దిటవుతో గురితప్పక డేగ కాలివ్రేలుని పోతు పావురం గట్టిగా కరచింది. తీవ్ర వేదనకి ఓర్వలేక ఛీత్కారమూ, కాలిని విదిలించడం ఏకకాలంలో ఆ డేగ చేసింది. ఆ సందులో పావురాల జంట డేగ పట్టు నించి విడివడి నిరుపమాన రయంతో పారిపోయాయి.
ఆ విధంగా పారిపోయి ఒక్క యెడ కలుసుకొని, బలవద్విరోధానికి వెరచి, కాశిలో వసింపవెరి, సరయూ తీరంలోని అయోధ్యా నగరంలో పెద్దకాలం దాంపత్య జీవితం గడిపినాయి. అనంతర జన్మలో మందార నామక విద్యాధరుడూ, రత్నావళి నామ నాగకన్య అయి పుట్టి, జాతి స్మరణ కలవి కావడంవల్ల ఆ పావురాలు దంపతులై కాలక్రమంలో త్రివిష్టపేశ్వరుణ్ణి కొల్చి ముక్తి పొందాయి. ఇది త్రివిష్టపేశ్వర మహాత్మ్యం.
కేదారేశ్వర మహత్మ్యము
వింధ్యగర్వాపహారీ! ఆదికాలంలో పరమేశ్వరుడు గౌరికి ఆనతిచ్చిన క్రమంగా చెప్పుతాను. సావధానతతో విను. కాశీనగరంలోని కేదారేశ్వర లింగం మహిమ ఆలించు.
బహు జన్మ సంచిత పాప సంఘాతాలు కేదారేశ్వర స్మరణంవల్ల తొలగిపోతాయి. నశిస్తాయి. సాయంకాల ప్రాతఃకాలాల్లో కేదారేశ్వర స్మరణం సమస్త కల్మషహరం. ప్రభాతవేళ మర్త్యుడు దశహర అనే పేరు వున్న గంగా ప్రవాహ జలంలో స్నానం ఆచరించి, పరంజ్యోతిస్స రూపమూ, మునీంద్ర ధాతవ్యమూ, శాశ్వతమూ అయిన కేదారేశ్వర లింగాన్ని ప్రీతితో చేరి అర్చించి అభీష్టార్థాల సంసిద్ధుల్ని పొందుతాడు. తొల్లి రథంతర కల్పంలో వశిష్ఠుడు అనే బ్రాహ్మణుడు హిరణ్యగర్భాచార్యుడనే గురువువల్ల పాశుపద తీక్ష పొంది కేదారేశ్వరుణ్ణి సేవించుకొని మోక్షం పడశాడు.
ఏ తీర్థంలో మంచుకొండగారాముచూలి పార్వతి సాయంకాలాల్లో చిరుబంతి పసవుతో స్నానమాడుతుందో, నరుడు ఏ పవిత్ర తీర్థంలోని జలం ఉద్ధరిణెడు సేవించి, జఠర పిఠరంలో శివలింగాన్ని ధరిస్తాడో, పుణ్య తీర్థంలో వినువీధిని పోరాడి వశం తప్పి కూలిపడి వాయసాలు హంసలు అయినాయో, అమృతప్రవాహ అనే పేరుగల నది, భాగీరథీనదికి చెలికత్తె అయి ప్రవహిస్తుందో ఆ పుణ్యస్థలం విముక్త వధువు కంఠహారలతికయో- ఆ దివ్య కేదారేశ్వర లింగ తీర్థ్భూమి నదీనద వాపిపల్వల హ్రదాలతో సమగ్రమయిన ఆ కేదారేశ్వర తీర్థం కాశీ అనే ఉద్యాన వనానికి ద్రాక్షపందిరి.
ఆ కేదారేశ్వర స్థానంలో గౌరీకుండం, గౌరీతీర్థం, అమృతస్రవాతీర్థం, మానసతీర్థం, కలహంస తీర్థం, ఆదిగాగల పలు తీర్థాలు వున్నాయి.

-ఇంకా ఉంది

-శ్రీపాద కృష్ణమూర్తి