భక్తి కథలు

హరివంశం - 57

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడవిలో మదపుటేనుగు చెట్టును నిర్మూలించటానికి కాని, విరచి వేయటానికి కాని ఇష్టపడక క్రీడ కోసం పట్టి ఊపినట్లుగా ఉంది ఆ దృశ్యం. పెద్ద హోరుగాలి వీస్తే అసంఖ్యకంగా చెట్లనుంచి కాయలు రాలిపడిపోయేట్లు, తాటి పండ్లన్నీ వడగండ్లు కురిసినట్లు రాలిపడ్డాయి. అట్లా అవి నేలమీద రాలిపడిపోవడం పెద్ద ధ్వనిని సృష్టించింది. అంతకన్నా గోప బాలుర హర్షధ్వానాలు మింటాయి. సంతోషంతో వాళ్ళు పెద్దగా అరుపులూ, కేకలూ సాగించారు.
ఆ తాటి వనమంతా వాళ్ళ అల్లరి నవ్వులతో ప్రతిధ్వనించింది. అక్కడ పెద్ద కోలాహలం చెలరేగింది. చప్పట్లు, ఒకరినొకరు హెచ్చరించుకోవటాలు, పరుగులు తీయటాలు, ఆ పడిపోవయిన తాటి పండ్లను కుప్పలుగా సేకరించుకోవటాలు పెద్ద సందడి సృష్టించాయి. ఇట్లా తన తాళ వనంలో వచ్చి పెద్ద రొద చేయటంతో అక్కడ, ఆవాసముంటున్న ధేనుకాసురుడు ఆగ్రహోదగ్రుడైనాడు. వెంటనే ఒక పెద్ద గాడిద రూపం ధరించాడు.
అతడి అధీనంలో ఉన్న పెద్ద సంఖ్యలోని రాక్షసులు కూడా గాడిద రూపాలు ధరించి ధేనుకుణ్ణి వెంబడించారు. ఆ గాడిదలు సహస్ర సంఖ్యాకంగా సిద్ధమైనారప్పుడక్కడ. రామకృష్ణులవను తుద ముట్టించాలన్న కడంకతో వీరావేశపరమైంది ఈ గాడిద సేన. ఈ గాడిదల గుంపులను చూసి గోపబాలురు ఎక్కడవాళ్ళక్కడ పరుగులు తీశారు. కొందరు చెట్లు చాటున నక్కారు. అసలే అది చీకటి వనం. ఈ గాడిదలు రేపిన దుమ్ము ధూళితో మరింత చీకటి అలుముకున్నట్లైంది అక్కడ. అవి పెడుతున్న ఓండ్రలు దిగ్గజాల చెవులనే దిమ్మెరపోయేట్లు చేశాయి. వాటి మద జల ధారలు కూడా ఇంకిపోయేట్లు చేశాయి అవి సృష్టించిన కోలాహలం.
ఎవరినో మింగటానికి పోతున్నట్లు నోళ్ళు పెద్దవిగా తెరచుకొని, కనుల నిప్పులు రాజుకునేట్లు చేస్తూ,. తోకలు భయంకరంగా ఆడిస్తూ ఆటోపంగా అవి దూసుకుని ముందుకు వచ్చాయి. ఈ మాయా సైన్యానికంతా అధిపతి ధేనుకుడు. ముందు నడుస్తూ బలదేవుడిపై ఆవేశంగా ఢీకొన్నాడు. బలరాముడి చేతులలో ఆయుధాలేమీ లేకపోయినా ధేనుకాసరుణ్ణి ఏమీ లక్ష్యం చేయలేదు. గార్థ్భాసురుడికి చాలా కోపం వచ్చింది.
గిర్రున వెనక్కు తిరిగి వెనుక కాళ్ళతో బలరాముడి గుండెలపై బలంగా తన్నాడు. ఆ తాపు ఇంకా తనను తాకకముందే వాడి రెండు కాళ్ళు దొరకకబుచ్చుకొని గిరిగిర తిప్పి దూరంగా వేగంగా పడిపోయేట్లు విసరివైచాడు. ఈ వేగానికి వాడు తాటిచెట్లను కొట్టుకుంటూ అవయవాలన్నీ శిథిలంకాగా, అంగాలన్నీ ప్రిదిలిపోగా దూరంగా పోయి పడ్డాడు. ఇట్లా తాటి చెట్లను వాడి శరీరం కొట్టుకొంటూ పోయి పడటంవల్ల తాటి పండ్లు కూడా ఇంకా కొన్ని రాలిపోయినాయి.
కనుగుడ్లు వికృతంగా వెళ్ళుకొనిరాగా శరీరగత ప్రాణుడైనాడు గార్థ్భాసురుడు. అలనాడు రామచంద్ర ప్రభువు ఖరాసురుణ్ణి ఇట్లానే తెగటార్చాడు. బలరాముడి చేతిలో ఈ గాడిద రక్కసి కూడా ఇప్పడట్లానే కడతేరాడు. ఖరుడితో వదలిపెట్టకుండా రామచంద్రుడు ఆ రాక్షసుడి పరివారాన్నంతా సంహరించినట్లే ధేనుకుడి పరివారాన్ని కూడా అందిన వాళ్ళను అందినట్లు వెనక కాళ్ళు పట్టి తాటి చెట్లకు కొట్టి చంపివేశాడు. అపుడు కృష్ణుడు కూడా అన్నకు సహాయం చేశాడు.
ఇంతకుపూర్వం తాటిపండ్లు ఆ నేలమీద నంతా కనపడినట్లు ధేనుకుడి పరివార రాక్షసులైన గార్ద్భ కళేబరాలు నిండిపోయినాయి. అన్నదమ్ములిద్దరి పరాక్రమోత్సాహం చూసి గోప బృందమంతా జేజేలు పెట్టారు. ‘వీళ్ళు సాధారణ మానవులు కారు. ఏదో లోక కార్యార్థం అవతరించిన దేవతలు!

ఇంకాఉంది

-అక్కిరాజు రమాపతిరావు