భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-49

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంతు మీతో ఎవరూ రాలేదండీ మీరొక్కరే వచ్చారు అని చెప్పాడు. అదేంటి నేను నాకు తెలిసిన లాయర్‌తో కలిసి వచ్చానే అని మళ్లీ ఆలోచనలో పడ్డాడు.
సరే అని ఇద్దరూ బాబా దగ్గరకు బయలుదేరారు.
రేగేని చూడగానే ‘‘ఇంత జరిగినా ఇంకా అనుమానమేనా.. ఆ గుర్నాథం నేను కాదా. ఇంకా నీ అనుమానం తీరకపోతే నేనే ఏమి చెయ్యను’ అన్నాడు బాబా.
అసలు సంగతి అర్థం అయిన రేగే కన్నీళ్లతో బాబాకు నమస్కరించి ‘‘బాబా మీకు నాపై ఎంత దయ, మీరే వచ్చి నన్ను తీసుకుని ఇంత దూరం వస్తారా. పైగా నా గురించి ఇంత చేస్తారా’ అన్నాడు.
నా భక్తులను నేను రక్షింకోకపోతే ఎవరు రక్షిస్తారు. కూర్చోండి, మన మతిమరుపు బల్వంత్ సిన్హా వస్తున్నాడు అన్నాడు బాబా.
ఈయన ఎవరా అని హేమాదిపంతు, రేగే చూస్తున్నారు.
అంతలో ఒక భజన బృందం వచ్చింది. బాబా దర్శనం చేసుకున్నారు. అంతా ఓ ఇరవై మంది ఉన్నారు.
అందరూ కూర్చున్నారు. వారిలో ఒకాయన స్థిమితంగా కూర్చోకుండా వాకిలి వైపు చూస్తున్నాడు.
అంతలో బాబా ‘‘బల్వంత్ కూర్చో! నిన్ను వెళ్లవద్దు అన్నాడు కాని ఆయనే వస్తున్నాడులే! నీకు ఎలానూ కనిపిస్తాడు. స్థిమితంగా కూర్చో’ అన్నాడు.
ఆ బల్వంత్ లేచి ‘స్వామీ! మీకు నా పేరు ఎలా తెలుసు’ అన్నాడు.
‘అట్లాగే తెలుసు కానీ అయినా మమల్తదార్ నా గురించి నీతో మోసగాడని నిన్ను వెళ్లవద్దని చెప్పాడు కదా. మరి ఆయనకు చెప్పకుండా నీవెందుకు ఒక్కడివే వచ్చేసావు’ అన్నారు.
‘అవును బాబా! అతడు నన్ను శిరిడీకి వెళ్లవద్దని చెపుతూనే వున్నాడు. కాని ఇదంతా మీకు ఎలా తెలుసో నాకు అర్థం కాకుండా వుంది’ అన్నాడు.
‘అదిగో అటు చూడు నీ మమల్తదార్ వస్తున్నాడు’ అన్నాడు బాబా.
నిజంగానే ఇందాక తనతో మాట్లాడిన మనిషి రావడం చూసి ఈ బాబా దగ్గర ఏదో మహిమ వుందని అనుకున్నాడు బల్వంత్.
మహిమలు ఏమీ లేవు కాని కాసేపు ఏమీ ఆలోచించకుండా కూర్చోవయ్యా అన్నాడు బాబా.
‘అయ్యబాబోయ్, నా మనసంతా తెలిసిపోతోంది’ అని బల్వంత్ బాబాను చూస్తూ కూర్చున్నాడు. బాబా కూడా ఇంకేమీ మాట్లాడక వౌనంగా ఉండిపోయారు.
అంతలో ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. అతని చేతులనిండా గులాబీ పూలు, స్వీట్లు ఉన్నాయి. అవి బాబా దగ్గర పెట్టి ‘‘బాబా నాకు నీవే దిక్కు. నన్ను రక్షించాలి’ అని అన్నాడు. నాకు ఏం తెలీదు. నీవే నన్ను అన్ని విధాలా కాపాడు అంటూ చేతులెత్తి నమస్కరించాడు.
‘నీవేమో చక్కగా నమస్కారాలు చేసి పూలు పండ్లు ఇచ్చి నిన్ను కాపాడమంటావు. కాని నీ దగ్గరకు ఎవరైనా వచ్చి నా గురించి అడగకపోయినా నన్ను మోసగాడినని నా దగ్గరికి ఎవరినీ వెళ్లవద్దని చెబుతుంటావు కదా. మరి నిన్ను నేను ఎందుకు కాపాడాలి?’ అన్నాడు.
అపుడు వారికందరికి ఇందాకటి సంభాషణకు ఇపుడు జరుగుతున్న దానికి సంబంధం ఉన్నట్లుగా కనిపించి అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
‘బాబా నేను నీ గురించి ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. ఎందుకు నన్ను అనుమానిస్తున్నావు’ అన్నాడు అతడు.
బల్వంత్ లేచి వచ్చి నేను నీకు తెలుసు కదా. నేను నీ దగ్గరకు వస్తే నీవు శిరిడీ వెళ్లవద్దని బాబా వట్టి మోసగాడివని నాకే చెప్పావు కదా. మళ్లీ కాదని చెప్తావేమి అన్నాడు.
ఓ అదా, బాబా అసలు ఇతడికి మీ మీద నమ్మకం ఉందా లేదా అని అనుమానించి అడిగాను అన్నాడు.
బాబా నవ్వుతూ తమరు అడిగి కనుక్కోనక్కర్లేదు. నాపైన ప్రేమ ఉన్నా భక్తి ఉన్నా అసలు ఏమీ లేకపోయినా నేనే అందరినీ కాపాడుతాను. నా దగ్గరకు ఎవరు రావాలో వారిని నేను పిలుచుకుంటాను. దానికి నీ సహాయం అక్కర్లేదు అని గట్టిగా చెప్పారు.
తప్పు అయిపోయింది బాబా ఇంకెప్పుడూ నేను ఇలా తప్పులు చేయను. నన్ను క్షమించు అని పదే పదే అడిగాడు. తప్పులు చేయకు అదే చాలు. మళ్లీ చేసి నా దగ్గరకు రాకు అని చెప్పారు.
నేను ఎప్పుడూ అబద్ధాలు చెప్పను అని చెప్పాడు అతడు.
అలా ఆ రోజు గడిచిపోయింది.
కొన్నాళ్లకు శిరిడీకి చంద్రాబాయి బోర్కర్ అనునామె వచ్చింది. బాబాను ఎంతో భక్తిగా సేవించేదామె. కొన్నాళ్లు శిరిడీలో ఉండి తర్వాత ఆమె తన గ్రామానికి వెళ్లిపోయింది. శిరిడీకి వచ్చిన ఆడాళ్లు.. అక్కడే ఉన్న ఆడాళ్లు అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేవారు. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743