భక్తి కథలు

శ్రీ సాయి లీలామృతం-51

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక రోజు రాత్రి మరేం ఫర్లేదు అమ్మా. నీకు తప్పక సంతానం కలుగుతుంది అని బాబా చెబుతున్న కల వచ్చింది.
ఆ రోజు ఎందుకో నాకు చాలా కడుపునొప్పి వచ్చింది. నన్ను మా వాళ్ళు డాక్టరు దగ్గరకు తీసుకుని వెళ్లారు. డాక్టరు పరీక్ష చేసి కడుపులో ఏదైనా గడ్డలు ఉన్నాయేమో అని అనుమానించారు. అందరూ శస్త్ర చికిత్స చేసుకోమని సలహా ఇచ్చారు. డాక్టర్లు కూడా అదే చెప్పారు.
నేను వారితో ‘‘ఇది వ్రణం, పుండు కాదు. నాకు బాబా పిల్లలను ఇవ్వబోతున్నాడు. అంతే నాకు పిల్లలు పుడతారు, కనుక నేను శస్తచ్రికిత్స చేసుకోను’’ అని చెప్పాను.
మా వాళ్లంతా నన్ను వింతగా చూశారు. నాకు ఎంతగానో చెప్పాలని చూశారు. కాని నేను ఎవరి మాట వినక కేవలం బాబాను ప్రార్థిసల్తూ 9 మాసాలు ఆగాను. అంతే నాకు పండంటి బిడ్డ పుట్టాడు. అపుడు ఆ బిడ్డను చూసి మావారు మా అత్తగారిల్లు అంతా చాలా సంతోషించారు. ఇలా బాబా ఒక మాట చెప్పారంటే చాలు అది నిజం అవుతుంది. తప్పక మనలందరినీ రక్షించేవాడు బాబానే అని చెప్పిందామె. అవును అని అందరూ తలలూపుతూ మంగళహారతులు పాడారు.
తన వద్దకు వచ్చిన భక్తులకు ఏ కష్టం లేకుండా బాబా చూసుకునేవారు. ఎవరి కోరికను కాదనేవారు కారు. ఒకసారి అన్వర్ ఖాన్ ఖాజీ అనునతడు శిరడీ వచ్చాడు. బాబాను దర్శనం చేసుకున్నాడు. బాబా నేను మా స్వగ్రామంలో మసీదు నిర్మించాలని అనుకుంటున్నాను. నాకు కాస్త డబ్బు సాయం చేయి అని అడిగాడు. బాబా ఏమీ మాట్లాడకుండా వౌనంగా కూర్చున్నారు. మళ్లీ మళ్లీ ఖాన్ డబ్బు గురించి అడుగుతూనే వున్నాడు. ‘‘మసీదు ఎప్పుడు డబ్బు అడగదు. మసీదునే ఇస్తుంది. నీకు కంగారెందుకు. వదిలేయి’’ అన్నారు.
కాని డబ్బు ఇవ్వమని అడగడం ఖాన్ మానలేదు. అక్కడ నింబార్ వృక్షం ఉంది కదా! దాని కింద మూడు అడుగులు తవ్వు నీకు కావల్సిన నిధి వస్తుంది అని బాబా ఖాన్‌కు చెప్పారు. అట్లానే ఆయన వెళ్లి చూస్తే నిధి దొరికింది. ఆ డబ్బులతో ఆయన తలపెట్టిన మసీదు నిర్మాణం పూర్తిచేశాడు. ఒక్కోసారి బాబా అడిగినంత పైకం ఇవ్వకపోయినా డబ్బు కావాలనుకున్న వాళ్ల దగ్గరకు చేరేది. ఇదంతా బాబానే చేస్తున్నాడని భక్తులు అనుకునేవారు. ఒకసారి మిరాన్ అనే వ్యక్తి వచ్చి తనకు అత్యవసరంగా 700 రూపాయలు కావాలని అడిగాడు. బాబా చాలా వౌనంగా కూర్చున్నారు. ఇతడు బాబా ఇస్తాడా లేదా అని ఒకటే బాధపడుతూ కూర్చున్నాడు. అంతలో అక్కడికి బాపూ సాహెబ్ జోగ్ వచ్చాడు. జోగ్‌ను పిలిచి నాకు 700 కావాలని అడిగారు. జోగ్ వెంటనే బాబాకు 700 ఇచ్చాడు. అందులోనుంచి 500 తీసి మిరాన్‌ను పిలిచి ఆయనకు ఇచ్చాడు. అతడు ఒకవైపు ఆనందిస్తూనే మరోవైపు బాబా నాకు కావాల్సింది 700 అంటే నీవు నాకు 500 ఇస్తావే.. మరో రెండు వందలు నేను ఏమి చేయను అన్నాడు. బాబా వౌనంగా దీనిని తీసుకుని వెళ్ళు, మరేం పర్లేదు అన్నారు.
బాబానే ఏదో చేస్తారులే అనుకుని వెంటనే మీరాన్ బయలుదేరాడు. అతడు నీమ్‌గావ్ దగ్గరకు చేరుకునేసరికి ఇక్కడికి ఇర్రన్ షా అను పార్శీ భక్తుడు తారసపడి పరిచయం పెంచుకున్నాడు. అతనికి ఏమీ చెప్పకపోయినా నాకు బాబా కలలో కనిపించి నీకు 200 రూపాయలు ఇమ్మన్నాడు. ఇదిగో తీసుకో అని ఇచ్చాడు. బాబా దయామృతం ఎంతటిదో కదా అని ఎంతో సంతోషించి తనకు బాబా చేసిన మేలును ఇర్రస్ చెప్పాడు మీరాన్. అలా వాళ్లిద్దరూ బాబా గురించి మాట్లాడుకుంటూ ముందుకు వెళ్లారు.
ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. బాబాకు ఎదురుగా వచ్చి చెప్పకపోయినా మనసులో ఏదైనా కోరుకున్నా కూడా వారి కోరికలు తీర్చేవారు.ఆత్మారాముడు బాబా భక్తుడు. సాధుజీవి. కాని అతని భార్య అతనితో తగవులాడుతూ వుండేది. ఎప్పుడూ ఎడ్డెం అంటే తడ్డెం అనేది. అతడు మాత్రం కొన్నాళ్లు పోతే ఆమె తెలుసుకుంటుందిలే అనుకుని తన పని తాను చేసుకునేవాడు. ఒకసారి వారిద్దరికి మాటా మాటా వచ్చి ఆత్మారాముని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఇనే్నళ్లు గడిచినా ఆమె ఇంటికి రావడంలేదు. కొత్తలో ఆత్మారాముడు వెళ్లి ఎంతో చెప్పి చూశాడు. పెద్దలతో చెప్పించాడు. కాని మొండిపట్టు పట్టిన ఆమె ఎంతకీ ఆత్మారాముని మాట వినకుండా పుట్టింట్లోనే వుండిపోయింది. -ఇంకాఉంది

- జంగం శ్రీనివాసులు 837 489 4743