తెలంగాణ

‘కారు’ ఎక్కేసిన టిడిపి ఎమ్మెల్యే వివేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: టిడిపికి చెందిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ మంగళవారం ఉదయం తెలంగాణ సిఎం కెసిఆర్ సమక్షంలో తెరాస పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సిఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన వివేక్‌కు కండువా కప్పి పార్టీలోకి కెసిఆర్ ఆహ్వానించారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో నగర ప్రజల అభిమానాన్ని తెరాస చూరగొందని, కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రభావితుడినై ప్రజలకు మరింతగా సేవ చేసేందుకు తాను తెరాసలో చేరుతున్నట్లు వివేక్ తెలిపారు. కాగా, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిడిపి తరఫున గెలిచిన ఏకైక కార్పొరేటర్ శ్రీనివాసరావు (కెపిహెచ్‌బి కాలనీ), ఆ పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సి.ఎం.ను కలిసేందుకు అపాయింట్‌మెంట్ తీసుకున్నట్లు తెలిసింది.