హైదరాబాద్

సర్కారు నిర్ణయం.. సర్వత్రా హర్షణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సిటీలో తెరాసకు పెరుగుతున్న ఆదరణ
హైదరాబాద్, డిసెంబర్ 3: మహానగర పాలక సంస్థ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రభుత్వం వరుసగా తాయిలాలను ప్రకటిస్తోంది. ఇప్పటికే మహానగరం పరిధిలో రూ. 1200లోపు ఆస్తిపన్ను చెల్లిస్తున్న ఇంటి యజమానులకు వార్షిక పన్నును రూ. 101కు కుదించిన సర్కారు తాజాగా మరో రెండు వరాలను ప్రకటించింది. మహానగరంలోని మురికివాడల్లో నివసించే పేద ప్రజల విద్యుత్, తాగునీటి బకాయిలను మాఫీ చేస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గురువారం చేసిన ప్రకటన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉద్యమ సమయంలో ప్రకటించిన విధంగానే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేలు జరుగుతుందన్న భావన నిజమైందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
కానీ ఇప్పటికే ఏటా పన్నును రూ. 1200 నుంచి రూ. 101కు కుదించటం, ఇపుడు తాజాగా దీనికి తోడు ఇపుడు జలమండలి, విద్యుత్ శాఖల తరపున కూడా సిఎం బకాయిలు మాఫీ చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల కొన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తూనే, మహానగరానికి అత్యవసర సేవలు, పౌరసేవలు అందించే వివిధ విభాగాలకు కోట్లాది రూపాయల నష్టం ఏర్పడటం మంచి పరిణామం కాదనే వాదన సైతం ఉంది. ఈ విభాగాల్లో జిహెచ్‌ఎంసి ఆర్థికంగా పరిపుష్టిగానే ఉన్నా, జలమండలి మాత్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే! ఎన్నికల సందర్భంగా పేదలను ఆకట్టుకునేందుకే ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ గ్రేటర్ హైదరాబాద్‌లోని 1475 మురికివాడల ప్రజలు మాత్రం ఈ నిర్ణయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ తాజాగా బిల్లుల బకాయిల మాఫీ నిర్ణయాన్ని తీసుకున్న ముఖ్యమంత్రి, దాన్ని గ్రేటర్ ఎన్నికల తర్వాత అమలు చేస్తామని ప్రకటించటం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.