అంతర్జాతీయం

మరో వివాదంలో ట్రంప్ భార్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ మరో వివాదంలో ఇరుకున్నారు. రెండు దశాబ్దాల క్రితం ఓ మేగజైన్కు నగ్నంగా పోజిచ్చినప్పటి మెలానియా ఫొటోలను న్యూయార్క్ పోస్ట్ ఇటీవల ప్రచురించగా, 1995లో ఆమె అమెరికాకు వచ్చినప్పుడు వీసా నిబంధనలు ఉల్లంఘించారని తాజాగా ఆరోపణలు వచ్చాయి. అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తామని, వీసా నిబంధనలను మార్చాలని ప్రధానంగా ప్రచారం చేస్తున్న ట్రంప్ శిబిరానికిది ఇబ్బందికరంగా మారింది. మెలానియా స్వదేశం స్లొవేనియా. ట్రంప్కు ఆమె మూడో భార్య. 2005లో ఫ్లోరిడాలోని తన రిసార్ట్లో ట్రంప్ ఆమెను పెళ్లి చేసుకున్నారు. అమెరికాకు వచ్చినప్పుడు వీసా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలను తోసిపుచ్చిన మెలానియా, ఏ టైప్ వీసా ఉపయోగించారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.