బిజినెస్

త్వరలో గుంటూరు-గుంతకల్లు మధ్య విద్యుత్ రైళ్ల పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఫిబ్రవరి 11 : గుంటూరు-గుంతకల్లు మార్గంలో అతి త్వరలోనే విద్యుత్ రైళ్లు పరుగులు పెట్టే అవకాశాలు ఉన్నాయని సీనియర్ డీఈ శ్రీనివాస్ తెలిపారు. అందుకనుగుణంగా గుంటూరు-గుంతకల్లు మధ్య 429 కి.మీ దూరం ఉన్న రైలు మార్గంలో విద్యుదీకరణ పనులను పూర్తి చేశారు. అలాగే పాణ్యం-దిగువమెట్ట మధ్య 60 కి.మీ మేర విద్యుదీకరణ పనులను పూర్తి చేసి ఆదివారం విద్యుత్ రైలింజన్‌తో ట్రయల్ రన్ నిర్వహిచంగా విజయవంతమైంది. పాణ్యం-దిగువమెట్ట మధ్య నల్లమల అడవుల్లో రెండు టనె్నల్స్ ఉన్నాయి. ఆయా టనె్నల్స్‌లో విద్యుదీకరణ పనులు చేపట్టడంలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ విజయవంతంగా పూర్తిచేయడం వల్ల విద్యుత్ రైలింజన్ ఇబ్బంది లేకుండా పరుగులు పెట్టింది. ట్రయల్ రన్ నిర్వహించిన రైలింజన్ దిగువమెట్ట రైల్వేస్టేషన్ చేరుకున్న విద్యుత్ రైలింజన్ నడిపిన అధికారులు, సిబ్బంది, సంబరాలు చేసుకున్నారు.
ట్రయల్ రన్‌లో సీనియర్ ఎలక్ట్రికల్ డీఈ శ్రీనివాస్, డీఈఈ దినేష్‌రెడ్డి, లోకో పైలెట్ సురేష్, ఇన్‌స్పెక్టర్ కొండబాబు పాల్గొన్నారు.