తెలంగాణ

ఎస్సీ అభివృద్ధి నిధి చట్టం దేశానికి ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: దళితుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ముందెన్నడూ లేని రీతిలో మొట్టమొదటిసారి షెడ్యూల్డు కులాల అభివృద్ధి నిధి చట్టం అమలులోకి తెచ్చిందని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి మంత్రి గంటకండ్ల జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ చట్టం ఇపుడు యావత్ భారతదేశానికి ఒక రోల్‌మోడల్‌గా మారిందని అన్నారు. షెడ్యూల్డు కులాల ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం అమలు తీరుతెన్నులపై సోమవారం ఆయన సచివాలయంలో సమీక్షించారు. చట్టం అమలులోకి తెచ్చిన మొదటి సంవత్సరమే పెద్ద ఎత్తున నిధులు కేటాయించి దళితుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసిందని అన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం 16.32 శాతం అంటే 14375 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఇంత వరకూ 6689 కోట్లు ఖర్చు చేసినట్టు మంత్రి వెల్లడించారు. మొత్తం 197 సంక్షేమ పథకాలతో పాటు 219 ఉప సంక్షేమ పథకాలతో దళితుల అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలు ఇపుడిపుడే సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు.
విద్యను పూర్తి చేసుకున్న దళిత విద్యార్ధులకు ఉద్యోగ, పోటీ పరీక్షల కోసం ఇచ్చే శిక్షణకు ఉద్ధేశించిన స్టడీ సర్కిల్ విస్తరించిన మీదటనే 100 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారని చెప్పారు. మొత్తం 42 శాఖాధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో ఉన్నత విద్య ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ఎస్సీ అభివృద్ధి కార్పొరేషన్ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రసాద్, పాఠశాల విద్య సంచాలకుడు కిషన్, గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్ మోహన్, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్ కరుణాకర్, జిఎం ఆనంద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ను ప్రజలే ఎన్‌కౌంటర్ చేస్తారు
రాష్ట్రప్రభుత్వంపై నిందలు వేసే వారిపై చర్యలు తప్పవని మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు.తమ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్యాంగులు, గ్రూప్‌లు ఎవరి వెంట ఉన్నాయో ప్రజలకు తెలుసని అన్నారు. నల్గొండ జిల్లాలో జరిగిన శ్రీనివాస్ హత్య గురించి, ఎమ్మెల్యే వీరేశంపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని వెంట తిరిగిన వారే శ్రీనివాస్‌ను చంపేసి ఉంటారని ఆయన భార్య చెప్పిన మాటలు వినలేదా అని మంత్రి ప్రశ్నించారు. శ్రీనివాస్‌కు ప్రమాదం ఉందని ఒక్క పిటీషన్ అయినా ఇచ్చారా అని ఆయన నిలదీశారు.

చిత్రం.. షెడ్యూల్డు కులాల ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం అమలు తీరుతెన్నులపై సోమవారం
సచివాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గంటకండ్ల జగదీష్‌రెడ్డి