తెలంగాణ

సార్వత్రిక ఎన్నికలకు బిజెపి సన్నథ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12:రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందించినట్టు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ తెలిపారు. ఇందుకోసం 100 కళాబృందాలను ఏర్పాటు చేసి ప్రధాని నరేంద్రమోదీ విజయాలను ప్రచారం చేస్తామని అన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కూడా కథలు, కళారూపాల్లో, నాటికల రూపాల్లో క్షేత్ర స్థాయిలో ప్రచార బృందాలుగా వినియోగిస్తామని ఆయన వెల్లడించారు. సోమవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 19 నుండి 24 వరకూ త్యాగరాయగానసభలో బిజెపి జనచైతన్య కళామండలి ధూం ధాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు.
సామాజిక న్యాయమే లక్ష్యంగా బిజెపికి అనుకూలంగా ప్రచారం చేసేందుకు సామాజిక శ్రేణులు ముందుకు వస్తున్నాయని లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రప్రభుత్వం చేసిన దగాను వారు గుర్తించారని, అన్ని సామాజిక శ్రేణులను బిజెపి సన్నద్ధం చేస్తోందని, అందుకు పార్టీ విస్తృత స్థాయి కార్యాచరణ రూపొందించిందని చెప్పారు. క్షేత్రస్థాయిలో నాయకత్వం సైతం రోజురోజుకూ బలాన్ని పుంజుకుంటూ ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దూసుకుపోతోందని అన్నారు. ప్రభుత్వం తీరు మాత్రం ఆడలేక మద్దెలు ఓడు అన్నట్టు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నా, ఖర్చుపెట్టలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కార్పొరేషన్‌లో పుష్టిగా నిధులు ఉన్నా ఖర్చు పెట్టే స్థితిలో యంత్రాంగం లేదని, సొమ్మున్నా సోయిలేని స్థితిలో ఉందని పేర్కొన్నారు. బడ్జెట్ చివరి త్రైమాసికం అవుతున్నా నిధులు ఖర్చు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రం నుండి పట్టణాల అభివృద్ధికి ఇచ్చిన నిధులు, పెట్టిన ఖర్చు ఎంతో ఒక శే్వతపత్రం విడుదల చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మున్సిపల్ పురపాలక శాఖతో పాటు ఆరోగ్య శాఖ స్థితి కూడా అదే విధంగా ఉందని పేర్కొన్నారు. ఈ నిధులు పెద్ద ఎత్తున ఆరోగ్య మిషన్ నుండి నిధులు వస్తున్నా ఖర్చు పెట్టకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కేంద్రంపై నెపం మోపకుండా కేంద్రం ఇచ్చిన నిధులను తక్షణమే ఖర్చు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్న కళాకారులకు మాత్రమే ఏదో అవకాశం ఇస్తున్నారని ఆరోపించారు. జన చైతన్య కళామండలి తరఫున అట్టడుగున ఉన్న డప్పు కళాకారులు మొదలు మేథోమథనం గావించే కవుల వరకూ అందరినీ ఒక తాటిపైకి తెచ్చి అనేక కార్యక్రమాలతో వారి రచనలతో పార్టీతో మమేకం చేస్తున్నామని అన్నారు. ప్రపంచంలోనే హీరోగా వెలుగుతున్న భారత ప్రధాని నరేంద్రమోదీని స్థానిక ప్రభుత్వం ఆయన ప్రస్తావన లేకుండానే చేయాలని చూస్తోందని పార్టీతో మమేకం కావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.