తెలంగాణ

భవన నిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: భవన నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 21 రోజుల్లో అన్ని అనుమతులు జారీ చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను మున్సిపల్‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదేశించారు. విధించిన గడువు దాటిన పక్షంలో రోజుకు రూ.1000 చొప్పున సంబంధిత అధికారిని నుంచి జరిమాన వసూలు చేయనున్నట్టు మంత్రి హెచ్చరించారు. పారిశ్రామిక విధానంలో పరిశ్రమలకు అనుమతుల జారీలో జాప్యం చేస్తే జరిమానా విధించే విధానాన్ని ఆప్పటికే అమలు చేస్తున్నామని మంత్రి గుర్తు చేసారు. ఇదే విధానాన్ని భవన నిర్మాణాల అనుమతులకు కూడా వర్తింప చేయబోతున్నట్టు మంత్రి కెటిఆర్ వివరించారు. ఖైరతాబాద్‌లో ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ కార్యాలయంలో సోమవారం టౌన్ ప్లానింగ్ అధికారులతో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రం ఆవిర్భవించాక మున్సిపల్‌శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. అన్ని మున్సిపాల్టీలలో ఒకే రకమైన విధానాలను (స్టేట్ యూనిఫైడ్ రూల్స్) అమలు చేస్తున్నామన్నారు. మున్సిపల్‌శాఖలో సాధారణ పౌరుడు ఎలాంటి ఇబ్బంది పడకుండా అత్యంత పారదర్శకంగా అన్ని అనుమతులు వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. దరఖాస్తు అందిన వారం రోజుల్లో వాటిని పరిశీలించి ఇంకా ఏవైనా పత్రాలు అవసరం అయితే దరఖాస్తుదారునికి తెలియజేయాలని సూచించారు. భవన నిర్మాణాల అనుమతులకు గతంలో 30 రోజుల గడువు విధించగా దానిని 21 రోజులకు కుదించినట్టు మంత్రి వివరించారు. ఆన్‌లైన్ ద్వారా పౌరులకు అందిస్తున్న సేవలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇక నుంచి ప్రతి మూడు నెలలకోసారి టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం కానున్నట్టు తెలిపారు. టౌన్ ప్లానింగ్ అధికారుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. మున్సిపల్ పాలనలో టౌన్, కంట్రీ పాన్లింగ్ అధికారుల పాత్ర కీలకమైందన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాల్లో రోడ్ల విస్తరణ, అక్రమ నిర్మాణాలను అరికట్టడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని మంత్రి ఆదేశించారు. పట్టణ, నగర ప్రాంతాల్లో లే అవుట్లలో ఖాళీ స్థలాలు కబ్జాలకు గురి కాకుండా కాపాడాలని మంత్రి సూచించారు. అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణను తయారు చేయాలని డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్‌ను మంత్రి ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను వేగవంతంగా క్లియర్ చేయాలని మంత్రి ఆదేశించారు. టౌన్ ప్లానింగ్‌శాఖలో మరింత సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.