తెలంగాణ

అదానీ, అంబానీలకే మోదీ సర్కారు సేవ్ఘ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: ప్రధాని నరేంద్ర మోదీ కుబేరులైన ఆదానీ, అంబానీల మేలు కోసం కృషి చేస్తున్నారు తప్ప కార్మికుల సంక్షేమం, పేదల బాగోగుల కోసం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఎఐసిసి ప్రధాన కార్సదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సి కుంతియా విమర్శించారు. సోమవారం నారాయణగూడలోని ఐఎన్‌టియుసి కార్యాలయంలో కార్మిక సంఘాల నేతలతో ఆర్‌సి కుంతియా, టి.పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు జి. సంజీవ రెడ్డి తదితరులు సమావేశమై కార్మికుల సమస్యలు, జాతీయ ఉపాధి హామీ పనుల కూలీలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కుంతియా ప్రసంగిస్తూ తమ పార్టీ అధికారంలో ఉన్న కార్మికుల సంక్షేమం కోసం చేసిన చట్టాలను ప్రధాని మోదీ నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం తాము అనేక చట్టాలు చేశామని, వివిధ పథకాలు చేపట్టామని ఆయన తెలిపారు. దేశంలోని అసంఘటిత కార్మికులంతా ఏకమైతే కేంద్రం దిగి రావాల్సిందేనని అన్నారు.
టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ మహాత్మా గాంధీ నరేగా పథకం గ్రామీణ ప్రాంతాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చిందన్నారు. నిరుపేదలకు సామాజిక భద్రత, కనీస పని కల్పించాలనే ఉద్ధేశ్యంతో ప్రవేశపెట్టిన ఈ చట్టం అన్ని వర్గాలకూ అండగా ఉంటుదన్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించడం దురదృష్టకరమని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో మార్పుకు శ్రీకారం చుట్టిందన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం చట్టాన్ని సమగ్రంగా, సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టం ప్రకారం 15 రోజుల్లో ఇవ్వాల్సిన కూలీ డబ్బులను ఇంకా చెల్లించడం లేదన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు జోక్యం చేసుకుని నిర్ణీత గడువులోగా కూలీ డబ్బులు ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. నరేగా చట్ట ప్రకారం రావాల్సిన వాటిపై అసెంబ్లీలో, బయటా తాము ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు జి. సంజీవరెడ్డి ప్రసంగిస్తూ కేసీఆర్ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ కూలీలకు సకాలంలో ఇప్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయరాదని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.