తెలంగాణ

22న బిసి విథ్యార్థి, యువజన బహిరంగ సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: బిసి విద్యార్థి, యువజన బహిరంగ సభను ఈ నెల 22న తిరుపతిలో నిర్వహించనున్నట్లు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు. బహిరంగ సభకు సంబంధించిన డిమాండ్ల పత్రాన్ని కృష్ణయ్య, బిసి లెజిస్లేచర్ కమిటీ చైర్మన్ వి. గంగాధర్ గౌడ్ సోమవారం ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్నట్లు ఫీజు రీ-యంబర్స్‌మెంట్ పథకాన్ని, విదేశీ విద్య నిధి పథకాన్ని జాతీయ స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదించనున్నట్లు చెప్పారు. విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసం వికాసానికి దోహదపడుతుందన్నారు. తద్వారా విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసం వికాసానికి దోహద పడుతుందని వారు తెలిపారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు, ఆంధ్ర ప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న లక్షా 50 వేల ఉద్యోగాలను, కేంద్రంలో ఖాళీగా ఉన్న 14 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు భూపిష్ సాగర్, బిసి విద్యార్థి సంఘం జాతీయ కార్యదర్శి గజేందర్, బిసి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు సి. రాజేందర్, బిసి యువజన సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షడు ఎస్. రామలింగం, బిసి లెజిస్లేచర్ కమిటీ సభ్యులు చింత ప్రభాకర్, బాలసాని లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.