తెలంగాణ

తెలంగాణలో 14 సబ్ జైళ్లు మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: తెలంగాణ వ్యాప్తంగా 14 సబ్ జైళ్లను మూసివేస్తున్నట్లు జైళ్ల శాఖ డైరక్టర్ జనరల్ వికె సింగ్ చెప్పారు. ఇప్పటికే 9 సబ్ జైళ్లను మూసివేయగా, మరో ఐదు త్వరలో మూసివేస్తున్నట్లు చెప్పారు. ఈ భవనాల్లో ప్రభుత్వం తరపుసేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు చెప్పారు. సోమవారం నాడిక్కడ జైళ్ల శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంధుల నివాసం, మానసిక వికలాంగుల కోసం, అనాధలు, వివక్షకు గురైన మహిళలు, వృద్ధులు ఆరోగ్యం క్షీణించిన వారికి, వికలాంగుల సేవ కోసం వీటిని వినియోగిస్తామని చెప్పారు. ఇందుకు ప్రభుత్వ పరిధిలో ఆదేశాలు జారీ చేయడంతో ఈ ప్రక్రియ చేపట్టినట్లు చెప్పారు. నేరాలను తగ్గించుకుంటూ, నేరస్తుల కౌన్సిలింగ్, వారిలో పరివర్తన తెచ్చే అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల చేపట్టిన భిక్షాటన చేస్తున్న వారిని జైళ్లశాఖలో అమలు చేస్తున్న ఆనందాశ్రమంలోకి తరలిస్తున్న సంగతి తెలిసిందేనని అన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని బిక్షాటన రహిత నగరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా, ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ జైళ్ళ శాఖలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ శాఖలు కూడా సామాజిక సేవ చేయవచ్చనే కోణంలో తొలుత జైళ్లశాఖ ఈ చొరవ తీసుకుందని వివరించారు. భిక్షాటన చేసే వారిని తరలించడం, వారి సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఏటా రూ.3 కోట్ల బడ్జెట్ కేటాయిస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు రూ.50 లక్షల వరకు ఖర్చు చేశామని తెలిపారు.